LATEST NEWS
మండల అధ్యక్ష పదవులు కాంగ్రెస్ లో చిచ్చు రేపాయి. సూర్యాపేట జిల్లా అర్వపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ లో రెండు వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. రాళ్లు, కర్రలతో పరస్పర దాడులకు తెగబడ్డాయి. విషయం ఏమిటంటే..   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకాలపై చెలరేగిన అసంతృప్తి రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.  మండల అధ్యక్షుల నియామకాలను వ్యతిరేకిస్తూ అసమ్మతి వర్గం చలో గాంధీభవన్‌కు బయలుదేరింది. ఈ వర్గాన్ని  అర్వపల్లి చౌరస్తా వద్ద ఎమ్మెల్యే వర్గం అడ్డుకుంది. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్యా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణలో పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. లాఠీ చార్జితో పరిస్థితిని అదుపు చేశారు.  ఈ ఘటనతో అర్వపల్లి చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.   conflict among Congress factions, flare up over posts, Suryapet district, Arvapalle, Stones, Sticks, Teluguone
వైసీపీలో అంతర్గత వైషమ్యాలు, కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. ప్రకాశం జిల్లాలో వైసీపీలో రెండు వర్గాలు రోడ్డున పడి కొట్టుకున్నాయి. వైసీపీ మహిళా కార్యకర్తలైతే జుట్టూ జట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఇక పురుష క్యాడర్ చొక్కాలు చించుకుని మరీ వీరంగమాడారు. ఈ గొడవ ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ కార్యాలయం సాక్షిగా, అదీ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జరిగింది.  వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కాళ్లు తొక్కుతున్నారంటూ కొంతమంది పురుష క్యాడర్ ను నిలదీశారు. దీంతో అక్కడ రెండు గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలతో దాడులకు పాల్పడ్డారు.  మహిళలు జుట్టూజుట్టూ  పట్టుకుని కొట్టుకుంటే... పురుషులు చొక్కాలు చించుకున్నారు. దీంతో ఒక్కసారిగా పార్టీ కార్యాలయంలో గందరగోళం ఏర్పడింది. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఘర్షణకి దిగడం చర్చనీయాంశంగా మారింది. YSR, Birth Anniversary, Ongole, Groups, Quarrel
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్ట్ వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. గన్నవరం పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, కోర్టు ముందు హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు. అయితే, ఆయనపై కేవలం పవన్ కళ్యాణ్ లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను దూషించారనే కారణంతోనే కాకుండా, అత్యంత కఠినమైన  ఉపా చట్టం కింద దేశద్రోహం కేసులు నమోదు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. కేవలం దళిత క్రిస్టియన్ శంఖారావం సభలో మాట్లాడిన వ్యాఖ్యల కోణంలోనే కాకుండా..  ఆయన వెనుక ఉన్న ఒక పెద్ద నెట్‌వర్క్‌ను పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో ఎండగట్టారు. గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం. ముఖ్యంగా గత ఏడాది నవంబర్‌లో ఆయన విడుదల చేసిన కొన్ని వీడియోలను పోలీసులు పెన్ డ్రైవ్ రూపంలో న్యాయస్థానానికి సమర్పించారు. నిషేధిత సీపీఐ (ఎంఎల్) మావోయిస్టు సంస్థకు చెందిన కేశవరావు, హిడ్మా వంటి అగ్రనేతలను కీర్తిస్తూ..  వారు అమరజీవులని, మళ్లీ పుడతారని, యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని రావణ్ వ్యాఖ్యానించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అమాయక గరిజన యువతను టార్గెట్ చేసుకుని దేశానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించేలా ఈ ప్రసంగాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ వాదిస్తోంది. ఈ పరిణామాలపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ  రామకృష్ణ తెలుగువన్ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఉపా' చట్టం కింద ఒకసారి కేసు నమోదైతే సాధారణ ఐపీసీ సెక్షన్లలాగా బెయిల్ రావడం సులభం కాదన్నారు. అయితే.. ఈ చట్టాన్ని శాంతిభద్రతలు సజావుగా ఉన్న ఏపీలో ప్రయోగించడం ఆందోళన కు గురిచేస్తోందనీ,  ప్రభుత్వం మారిన ప్రతిసారీ ఒకరు నేరస్థుడిగా, మరొకరు ప్రజాసేవకుడిగా మారిపోయే సంప్రదాయం సరికాదన్నారు. ప్రస్తుతం ప్రశ్న రావణ్ ముందున్న ఏకైక మార్గం హైకోర్టును ఆశ్రయించడమేనన్న ఆయన..  ప్రశ్న రావణ్.. ఆయన తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్  దాఖలు చేసి, ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరే అవకాశం ఉందన్నారు. హైకోర్టుకు ఉన్న ప్రత్యేక అధికారాల ద్వారా వీడియో కంటెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి..  ఒకవేళ ఆ ప్రసంగాల వల్ల సమాజంలో తక్షణ నష్టం లేదా హింస జరగలేదని భావిస్తే రావణ్‌కు ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయని  రామకృష్ణ అభిప్రాయపడ్డారు.  Prashna Ravana Arrest AP, Former Judge Ramakrishna Interview,  UAPA Case Andhra Pradesh, Ravana Remand Report, AP Politics Telugu News  
  ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర రాజకీయ నాయ కులు, పోలీసు ఉన్నతాధికారులు, కీలక ప్రభుత్వ అధికారులకు వ్యక్తిగత భద్రత దృష్ట్యా గన్‌మెన్‌లను కేటాయించ డం సర్వసాధారణం. అయితే ఉప్పల్   బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాత్రం ఈ విషయంలో భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు.   తనకు వ్యక్తిగత భద్రత కోసం గన్‌మెన్‌లు అవసరం లేదని ఆయన మొదటి నుంచీ చెబుతూవస్తున్నారు.  ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి  గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ..  తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు. ప్రజల మధ్య ఎలాంటి హడావుడి లేకుండా, సాధారణ వ్యక్తిలా ఉండాలనేదే తన అభిప్రాయమని అప్పట్లోనే వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం (జులై 7) ఆయన భద్రత కోసం   గన్‌మెన్‌లు నివాసానికి వెళ్లగా..  లక్ష్మారెడ్డి వారిని  వెనక్కి పంపించారు. తన భద్రతను తానే చూసుకుంటానని, గన్‌మెన్‌లు లేకుండా  ప్రజల్లో తిరగడమే  తనకు సౌకర్యంగా ఉంటుందని వారికి వివరించారు. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని మరోసారి స్పష్టం చేయడంతో గన్‌మెన్‌లు అక్కడి నుంచి వెనుదిరిగారు. 
తమిళనాడు రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి  విజయ్ కరూర్ జిల్లాలో పర్యటించకుండా నిరోధించాలని కోరుతూ ప్రతిపక్ష  డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు   నిరాకరించింది. ఒక రాష్ట్ర   ముఖ్యమంత్రి పర్యటనలను తాము ఏ విధంగా నియంత్రించగలమని న్యాయస్థానం  ప్రశ్నించింది. గతంలో   తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కరూర్ ప్రాంతంలో తీవ్రమైన తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలనూ, అలాగే గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఈ నెల  10న కరూర్ సందర్శనకు  సీఎం విజయ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే..  సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. డీఎంకే తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. బాధితులను కలిసి ప్రభుత్వ పరంగా ఉద్యోగ నియామక పత్రాలు, ఇతర ఆర్థిక సాయం అందించేందుకు సీఎం వెళ్తున్నారని, దీనివల్ల సీబీఐ దర్యాప్తు పారదర్శకత దెబ్బతింటుందని ఆయన కోర్టుకు వివరించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ..  బాధిత కుటుంబాలను పరామర్శించడం సాక్షులను ప్రభావితం చేయడం ఎలా అవుతుందని ప్రశ్నించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోకపోతే కొట్టివేస్తామని స్పష్టం చేయడంతో..  డీఎంకే న్యాయవాది పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో కోర్టు ఆ వ్యాజ్యాన్ని ముగించింది. దీంతో  ఈ నెల   10న సీఎం విజయ్  కరూర్ పర్యటనకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.   DMK Petition Dismissed, Tamil Nadu CM Joseph Vijay, Karur Stampede Case, Tamil Nadu Politics, TeluguOne
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టి బాలీవుడ్ వైపు అడుగులు వేయడం ఈమధ్య మన టాలీవుడ్ దర్శకులకు ఒక క్రేజీ ట్రెండ్‌గా మారింది. చాలామంది ప్రతిభావంతులైన దర్శకులు ఇక్కడ తమ సత్తా చాటి, నార్త్ ఇండియన్ మార్కెట్‌ను సైతం షేక్ చేస్తుండగా.. ఇప్పుడు ఆ విలక్షణమైన దర్శకుల జాబితాలోకి ప్రముఖ క్రేజీ లేడీ డైరెక్టర్ బి.వి.నందినిరెడ్డి కూడా చేరడానికి పూర్తిగా సిద్ధమైంది. సమంత ప్రధాన పాత్రలో ఆమె అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇలాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందిని రెడ్డి తదుపరి ప్లాన్ ఏంటి అని ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే అందరి అంచనాలకు తగ్గట్టే ఆమె రూట్ మార్చి నేరుగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఆమె ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించడం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే తాను హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టబోతున్నట్లు నందిని రెడ్డి చాలా నమ్మకంగా ప్రకటించింది. ఒక మంచి బలమైన కథ కుదిరితే ఖచ్చితంగా బాలీవుడ్ సినిమా చేస్తానని ఆమె స్పష్టం చేసింది. ఏ భాషలో చెప్పినా కథ యొక్క మూల భావం మరియు భావోద్వేగం ఒకటే అనేది తన బలమైన అభిప్రాయమని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తనకు హిందీ భాష కొత్తేమీ కాదని, గతంలో తాను సుమారు రెండేళ్ల పాటు దేశ రాజధాని ఢిల్లీలో చదువుకున్నానని పేర్కొంది. ఆ చదువుకునే సమయంలోనే తాను చాలా హిందీ సినిమాలు చూశానని, అందువల్ల అక్కడి సంస్కృతి మరియు భాషపై తనకు మంచి అవగాహన ఉందని వివరించింది. అయితే బాలీవుడ్ వెండితెర ఎంట్రీ కంటే ముందే ఆమె సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై కూడా ఒక సరికొత్త రకమైన ప్రయోగానికి తెరలేపుతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఇప్పటివరకు ఎక్కువగా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, మనసుకు హత్తుకునే లవ్ స్టోరీస్, లైట్ హార్టెడ్ సినిమాలు చేసిన నందిని రెడ్డి, ఈసారి తన శైలిని పూర్తిగా మార్చబోతోంది. ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు కాస్త భిన్నమైన సరికొత్త అనుభూతిని అందించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే త్వరలో ఒక 'డార్క్ సూపర్‌నేచురల్ వెబ్‌సిరీస్' ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నానని ఆమె సంతోషంగా పంచుకుంది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయిందని, వచ్చే అక్టోబర్‌లో ఈ వెబ్‌సిరీస్ యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని నందిని రెడ్డి స్పష్టం చేసింది. ఈ సరికొత్త హారర్ అండ్ మిస్టరీ వెబ్‌సిరీస్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే ఆమె తన తదుపరి హిందీ సినిమాపై పూర్తి దృష్టి పెట్టనున్నట్లు సమాచారం లభించింది. మరి టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి బాలీవుడ్ ఎంట్రీ ఏ స్టార్ హీరోతో లేదా హీరోయిన్‌తో ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.     Nandini Reddy, Maa Inti Bangaaram, Samantha 
Producers Naga Vamsi and Nagarjuna appears to have adopted a unique release strategy for Akhil Akkineni, Bhagyashri Borse starrer Lenin, one that could significantly reduce the impact of early overseas reviews on the film's opening day in India. Ahead of the film's July 10 release, the producer announced that shows across India will begin at 5:00 AM, while overseas premieres are scheduled for 4:30 AM IST on the same day. Traditionally, Telugu films premiere several hours earlier in the United States, with social media reviews, ratings and audience reactions flooding the internet well before the first shows begin in the Telugu states. Those initial responses often shape the online narrative around a film, influencing undecided audiences and even impacting advance bookings for later shows. With just a 30-minute gap between the overseas premieres and the first Indian screenings, that window has been almost eliminated. Even if the first reactions begin appearing online, they are unlikely to spread widely enough before audiences in Andhra Pradesh and Telangana have already entered theatres. It is a strategy that ensures the first wave of viewers in India experience the film without being heavily influenced by overseas verdicts. The move also reflects how the Telugu film industry is adapting to the social media era. Instant reviews on X, YouTube and other platforms have become increasingly influential, with both positive and negative word-of-mouth spreading within minutes. By synchronizing the release timings, the makers appear to be giving LENIN a more level playing field, allowing the domestic audience to form its own opinion rather than relying on early overseas chatter. Whether this was the primary intention behind the scheduling has not been officially confirmed by the makers. However, the timing has certainly caught the attention of trade observers and fans alike. If the strategy proves effective, it could inspire more Telugu producers to minimize the gap between overseas premieres and Indian first shows, especially for big-ticket releases where first impressions on social media can have an outsized impact on opening-day momentum. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
టాలీవుడ్ యువ కథానాయకుడు, ఎనర్జిటిక్ స్టార్ నవీన్ పోలిశెట్టి తన తదుపరి సినిమా విషయంలో మళ్ళీ రిస్క్ చేయబోతున్నాడా అనే చర్చ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నవీన్ పోలిశెట్టి నటించిన గత చిత్రం 'అనగనగా ఒక రాజు' ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా విడుదలై ఇప్పటికే దాదాపు 6 నెలలు, అంటే సుమారు అర్థ సంవత్సరం దాటిపోయింది. అయినప్పటికీ, ఇప్పటివరకు నవీన్ నుంచి తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా, నవీన్ మాత్రం ఎప్పటిలాగే 'నిదానమే ప్రధానం' అనే సూత్రాన్ని పాటిస్తూ కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే నవీన్ పోలిశెట్టి ఒక తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు.. 'సైరన్' చిత్ర దర్శకుడు ఆంటోనీ భాగ్యరాజ్. జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ వంటి క్రేజీ స్టార్ కాస్టింగ్‌తో క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో ఆంటోనీ భాగ్యరాజ్ 'సైరన్' సినిమాను తెరకెక్కించాడు. అయితే, ఈ సినిమా తెలుగులో కనీస ప్రభావం చూపించలేకపోయింది, పోనీ తమిళంలో అయినా వర్కవుట్ అయిందా అంటే అక్కడ కూడా అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఒక ఫ్లాప్ దర్శకుడితో నవీన్ సినిమా చేయాలనుకోవడమే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి ఆంటోనీ భాగ్యరాజ్ చెప్పిన ఒక లైన్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌కు బాగా నచ్చిందట. దాంతో వాళ్లే స్వయంగా చొరవ తీసుకుని ఈ కథను నవీన్ పోలిశెట్టి వరకు తీసుకెళ్లారని, కథ విన్న నవీన్ కూడా దానికి ఓకే చెప్పాడని ఇండస్ట్రీ టాక్. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి ముందుకు రావడంతో దీనిపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక సినిమా విజయవంతం అయ్యాక హీరోలు ఎంత గ్యాప్ తీసుకోవాలనేది వారి వ్యక్తిగత ఇష్టమే అయినప్పటికీ, నవీన్ పోలిశెట్టి లాంటి మంచి క్రేజ్ ఉన్న హీరోలు ఇలా 6 నెలలకు పైగా ఎలాంటి సినిమా ప్రకటించకుండా ఖాళీగా ఉండిపోవడం మార్కెట్ పరంగా సరైన సంకేతం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నవీన్ పోలిశెట్టికి యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో కూడా తిరుగులేని ఇమేజ్, ఫాలోయింగ్ ఉంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా తర్వాత కూడా నవీన్ చాలా పెద్ద బ్రేక్ తీసుకున్నాడు. అయితే మధ్యలో అతనికి ఒక చిన్న ప్రమాదం జరగడం వల్లే ఆ ఆలస్యం జరిగిందని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అలాంటి ఆరోగ్య సమస్యలు ఏవీ లేవు. ప్రస్తుత టాలీవుడ్ ట్రెండ్ చూస్తే రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరు హీరోలను మినహాయిస్తే, రేంజ్‌తో సంబంధం లేకుండా చాలా మంది హీరోలు చాలా నిదానంగా సినిమాలు తీస్తున్నారు. నవీన్ పోలిశెట్టి కూడా ఇప్పుడు అదే 'టైం టేకింగ్ జోన్' లోకి వెళ్లిపోతున్నాడు. మరి ఆంటోనీ భాగ్యరాజ్ కాంబినేషన్‌లో ఓకే చేసిన ఈ సినిమా ఏ సీజన్‌లో విడుదలవుతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.     Naveen Polishetty, Mythri Movie Makers, Antony Bhagyaraj
  ట్రైలర్ తోనే అభిమానులని ఏర్పరుచుకున్న మూవీ 'నాగబంధం'(Nagabandham). కొన్ని ఫ్యామిలీస్ అయితే నాగబంధం రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అని ఎదురుచూసి మరి రిలీజ్ రోజు థియేటర్స్ దగ్గర బారులు తీరారు. ట్రైలర్ కల్పించిన ఇంపాక్ట్ ఆ లెవల్లో ఉంది. కానీ మేకర్స్ మంచి కంటెంట్ ని స్క్రీన్ ప్లే అవగాహనా లోపంతో కధనాన్ని నింపి పడేసారని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.  విరాట్ కర్ణ, గ్లామరస్ బ్యూటీస్ నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన క్యారెక్టర్స్ కాగా, అభిషేక్ నామా దర్శకుడు. సుమారు 110 కోట్ల భారీ బడ్జెట్‌తో, విజువల్ గ్రాండియర్‌గా నిర్మితమైన ఈ పాన్ ఇండియా చిత్రం ఈ నెల  3న ప్రపంచవ్యాప్తంగా  భారీ స్థాయిలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,100 కి పైగా స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వసూళ్ల పరంగా ఘోరంగా వెనుకబడిపోయింది. మొదటి మూడు రోజుల వీకెండ్‌లో ఇండియా నెట్ కలెక్షన్ల పరంగా కేవలం 9.75 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఇందులో మొదటి రోజు 3.25 కోట్లు, రెండో రోజు  3.05 కోట్లు మాత్రమే వసూలు కావడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. గ్రాస్ వసూళ్లు, ఓవర్సీస్ కలెక్షన్లు అన్నింటినీ కలుపుకున్నప్పటికీ, మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా వరల్డ్‌వైడ్ కలెక్షన్లు 13.70 కోట్ల నుండి కేవలం 15 కోట్ల లోపే పరిమితమయ్యాయి.100 కోట్ల బడ్జెట్ పెట్టిన మూవీకి   కనీసం 15 కోట్లు కూడా దాటకపోవడం భారీ డిజాస్టర్ వైపు అడుగులు వేస్తోందని స్పష్టమవుతోంది. Also read: jayam ravi: జయం రవి కీలక నిర్ణయం... అభిమానులు క్షమించాల్సిందే  ఏది ఏమైనా కేవలం భక్తి అంశాలని  నమ్ముకుంటే సరిపోదని, వాటికి బలమైన కథ, కథనం తోడైతేనే ప్రేక్షకులు ఆదరిస్తారని 'నాగబంధం' ఫలితం మరోసారి నిరూపించింది. ప్రస్తుతం వర్కింగ్ డేస్‌లోకి అడుగుపెట్టిన ఈ సినిమా థియేటర్లలో కనీస ఆక్యుపెన్సీని కూడా నమోదు చేయలేక బాక్సాఫీస్ రేసులో పూర్తిగా వెనుకబడిపోయింది.  nagabandham, virat karna, nabha natesh  
Swathi Reddy has entered a new phase in her personal life by tying the knot with filmmaker Srikanth Nagothi, the director of the critically acclaimed Telugu drama Month of Madhu. The intimate wedding ceremony was attended by close family members and friends, with pictures from the celebration quickly going viral on social media. Swathi and Srikanth first collaborated on Month of Madhu, the 2023 relationship drama that received widespread appreciation for its mature storytelling and heartfelt performances. Swathi's portrayal of Lekha was hailed as one of the finest performances of her career, while Srikanth Nagothi earned praise for his sensitive writing and direction. The couple had kept their relationship away from the public eye, making the wedding a pleasant surprise for fans and the film fraternity alike. As congratulatory messages poured in across social media, well-wishers celebrated the union of the actress and the filmmaker who shared a successful creative collaboration before becoming life partners. Colors Swathi, who rose to fame as a television host before making a successful transition to films with memorable performances in Telugu, Tamil and Malayalam cinema, has enjoyed a career spanning nearly two decades. Her marriage to Srikanth Nagothi marks a new beginning, with fans wishing the newlyweds a lifetime of happiness and togetherness. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  తెలుగు, తమిళ ప్రేక్షకులకి 'జయం రవి’గా సుపరిచితుడైన స్టార్ హీరో రవి మోహన్ గత కొంతకాలంగా సినిమాల కంటే తన వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో ఎక్కువగా నిలుస్తూ వచ్చారు. ముఖ్యంగా భార్య ఆర్తీ రవితో విడాకుల వివాదం, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదొడుకుల నేపథ్యంలో ఆయన గతంలో ఒక సంచలన ప్రకటన చేశారు. విడాకుల వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చేంతవరకు నటనకి  స్వస్తి పలుకుతున్నానని, సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇస్తున్నట్లు భావోద్వేగంగా ప్రకటించి అభిమానులకి  తీవ్ర నిరాశకు గురిచేశారు. అయితే, తాజాగా ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు చెన్నైలో జరిగిన జెఎఫ్‌డబ్ల్యూ (JFW) అచీవర్స్ అవార్డ్స్ వేడుకలో రవి మోహన్ స్టేజీపైనే ఎంతో ఎమోషనల్ అవుతూ తన అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఈ ఏడాది తాను 46వ వసంతంలోకి అడుగుపెడుతున్నాను. తన జీవితంలో సగం కాలం అంటే ఏకంగా 23 సంవత్సరాల పాటు సినిమా పరిశ్రమలోనే గడిపాను. నా జీవితంలో 50 శాతం వ్యక్తిగత జీవితానికి, 50 శాతం వృత్తిపరమైన సినిమా జీవితానికి సమానంగా ప్రాధాన్యత ఇస్తాను. అయితే ఇటీవల వ్యక్తిగత జీవితంలో భావోద్వేగాలు శృతిమించి ఒక చిన్న పొరపాటు నిర్ణయం తీసుకున్నాను. ఆ ఒక్క ఎమోషనల్ నిర్ణయం తనను ప్రాణంగా ప్రేమించే అభిమానులను, చిత్ర పరిశ్రమను ఎంతగానో బాధించింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన తోటి నటీనటులు, దర్శకులు తన వద్దకు వచ్చి, "నువ్వు ఏమైనా అనుకో.. కానీ సినిమాలను వదిలేస్తానని మాత్రం ఎప్పుడూ అనకు" అని సర్దిచెప్పడం వల్లే తనలో మళ్లీ కొత్త నమ్మకం కలిగింది. Also read: డైరెక్టర్‌పై పగబట్టిన స్టార్ హీరో ఫ్యాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న రివెంజ్ స్టోరీ! అభిమానులని ఉద్దేశించి మాట్లాడుతూ, ఇకపై అభిమానులని ఎప్పటికీ బాధపెట్టను. సినిమా రంగానికి ద్రోహం చేయనని మోకాళ్లపై నిలబడి మరీ క్షమాపణలు కోరారు. తన కష్టకాలంలో అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ తలవంచి కృతజ్ఞతలు తెలుపుతూ, త్వరలోనే మరింత శక్తివంతంగా వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం రవి మోహన్ చేతిలో వరుస భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయన నటిస్తున్న 'కరాటే బాబు' చిత్రం ఆగస్టు 28న విడుదలకి సిద్ధమవుతోంది. దాంతో పాటు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'జీని' (Genie) కూడా నిర్మాణంలో ఉంది. వీటన్నింటికీ మించి, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన 'లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీ' (LCU) లో భాగమైన 'బెంజ్' (Benz) చిత్రంలో రవి మోహన్ ఒక కీ రోల్ పోషించబోతున్నారు. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ ద్వారా రవి మోహన్ తన పవర్‌ఫుల్ రీఎంట్రీని ఖరారు చేశారు. లోకేష్ కనగరాజ్ ఈ ప్రాజెక్ట్‌లోకి ఆయనను ఆహ్వానించడం విశేషం.   
  తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ రోజు థియేటర్ దగ్గర ఎరేంజ్ మెంట్స్ చేసే అభిమానుల ముఖాలు చూడాలి. వెయ్యి దీపావళులు ఒకేసారి వచ్చినట్టుగా వెలుగుతూ ఉంటాయి. పాలాభిషేకాలు, భారీ కటౌట్లతో పండగ వాతావరణం సృష్టిస్తారు. ఫర్ సపోజ్    మూవీ  గనుక  ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతే, ఆ కోపమంతా సదరు దర్శకుడిపైనే చూపిస్తుంటారు. తాజాగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఒక ఆసక్తికరమైన సమాచారం ప్రకారం, ఒక స్టార్ హీరో అభిమానులు తమ హీరోకు డిజాస్టర్ ఇచ్చిన ఒక డైరెక్టర్‌పై వినూత్న రీతిలో సోషల్ మీడియా వేదికగా రివెంజ్ తీర్చుకుంటున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.   రీసెంట్ గా భారీ బడ్జెట్ తో ఒక సినిమా రిలీజ్ అయ్యింది. ప్రచార చిత్రాలతో మంచి హైప్ ని తెచ్చుకున్నా కూడా స్క్రీన్ ప్లే లోపాలతో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో హీరో అభిమానులు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఎంతలా అంటే సోషల్ మీడియా పుట్టిందే మా కోసమే అనేంతలా. ఈ సోషల్ మీడియా దాడి వెనుక 100 శాతానికి పైగా పాత కక్షలే కారణమని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. గతంలో ఆ దర్శకుడు సదరు స్టార్ హీరో బాడీ లాంగ్వేజ్‌కు భిన్నంగా సినిమా తీసి, కనీసం యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోలేదనేది ఫ్యాన్స్ ప్రధాన ఆరోపణ. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఆ సినిమా కేవలం 50 కోట్ల మార్కుని కూడా దాటలేకపోయింది, దీనివల్ల డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు వచ్చాయి. ఆ నష్టాల తాలూకు చేదు జ్ఞాపకాలని  అభిమానులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు ఆ డైరెక్టర్ మూవీని టార్గెట్ చేస్తున్నారు. Also read: Akhil Akkineni: మా నాన్న పని రాక్షసుడు.. లెనిన్ కామెంట్స్ వైరల్   
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల శైలి చాలా డిఫరెంట్. ఆయన ఒక కథ అనుకుంటే దాని బౌండ్ స్క్రిప్ట్ పూర్తిగా రాజీ లేకుండా సిద్ధం కావాలి, అలాగే ప్రతీ సన్నివేశానికి సంబంధించిన సంభాషణలతో కూడిన పక్కా డైలాగ్ వెర్షన్ కూడా పక్కాగా రెడీ అవ్వాలి. అప్పుడే ఆయన సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారు. అది శేఖర్ కమ్ముల పాటిస్తూ వస్తున్న ఒక ప్రత్యేకమైన వర్కింగ్ స్టైల్. పర్ఫెక్ట్ అవుట్‌పుట్ కోసం ఆయన ఎన్ని సంవత్సరాలైనా సరే చాలా ఓపికగా వేచి చూస్తారు. ధనుష్, నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన ఆయన గత చిత్రం 'కుబేరా' విడుదలై అప్పుడే ఏడాది కాలం దాటిపోయింది. దీంతో శేఖర్ కమ్ముల నుండి వచ్చే నెక్స్ట్ సినిమా ఎప్పుడు ఉంటుందా అని అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ఇటు ఆయన అభిమానుల్లోనూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రానికి సంబంధించిన పూర్తి స్థాయి స్క్రిప్ట్ వర్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. సినిమాకు సంబంధించిన డైలాగ్ వెర్షన్ కూడా రెడీ అయిపోయింది. అయితే, ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించబోయే హీరో ఎవరు అనేది మిస్టరీగా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న చాలా మంది స్టార్ హీరోల డేట్లు ఖాళీగా లేకపోవడం ఇక్కడ ఒక ప్రధాన సమస్యగా మారింది. శేఖర్ కమ్ముల మైండ్‌లో ప్రస్తుతానికి కొందరు క్రేజీ హీరోల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రేసులో మొదటి ఆప్షన్‌గా నేచురల్ స్టార్ నాని పేరు బలంగా వినిపిస్తోంది. అయితే నాని లైనప్‌లో ఇప్పటికే వరుసగా రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మరోవైపు, శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో మళ్లీ ఇంకోసారి జతకట్టే అవకాశం కూడా ఉన్నట్లు ఫిలింనగర్ టాక్. ఒకవేళ ఇక్కడ డేట్లు కుదరకపోతే కోలీవుడ్‌కి చెందిన ఎవరైనా యంగ్ హీరోతో ముందుకు వెళ్లాలా అనే ప్రత్యామ్నాయ ఆలోచనను కూడా శేఖర్ కమ్ముల పరిశీలిస్తున్నారు. హీరో లాక్ అయిన వెంటనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.      Sekhar Kammula, Nani, Naga Chaitanya, Tollywood, TeluguOne  
తెలుగు బుల్లితెరపై ‘కలర్స్’ కార్యక్రమంతో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత వెండితెరపై తనదైన నటనతో బెస్ట్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి స్వాతి రెడ్డి (Colors Swathi) సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. గత కొంతకాలంగా ఆమె వ్యక్తిగత జీవితం, వైవాహిక బంధం గురించి సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు, వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ, స్వాతి రెండో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు శ్రీకాంత్ నగోతి (Srikanth Nagothi) చేతిని ఆమె అందుకున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా, కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటంతో అభిమానులు, నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటి స్వాతి రెడ్డి గతంలో 2018 ఆగస్టు నెలలో కేరళకు చెందిన వికాస్ వాసు అనే ఇంటర్నేషనల్ పైలట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అనంతరం ఆమె దాదాపు ఐదేళ్ల పాటు వెండితెరకు, గ్లామర్ ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు. అయితే, 2023 నాటికి వీరిద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ సమయంలోనే స్వాతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి పెళ్లి ఫోటోలన్నింటినీ తొలగించడంతో ఈ విడాకుల అంశం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలలో మీడియా ప్రతినిధులు దీనిపై ప్రశ్నించినప్పటికీ, తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి ఆమె నిరాకరించారు. ప్రొఫెషనల్ లైఫ్‌కు, పర్సనల్ లైఫ్‌కు మధ్య గీత గీసుకుని మౌనంగా ఉండిపోయారు. విడాకుల అనంతరం స్వాతి రెడ్డి తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి టాలీవుడ్‌లో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కిన ‘మంత్ ఆఫ్ మధు’ (Month of Madhu) అనే ఎమోషనల్ డ్రామా సినిమాలో ఆమె లీడ్ రోల్ పోషించారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ నగోతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే దర్శకుడు శ్రీకాంత్‌తో స్వాతికి మంచి పరిచయం ఏర్పడింది. అది కాస్తా కాలక్రమేణా బలమైన స్నేహంగా, ఆపై ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రేమగా మారింది. ‘మంత్ ఆఫ్ మధు’ సినిమా ప్రమోషన్స్ కోసం వీరు కలిసి పాల్గొన్న టీవీ షోలు, ఇంటర్వ్యూలలో కూడా వీరి బాండింగ్ ప్రత్యేకంగా కనిపించింది. ఒకరినొకరు జీవిత భాగస్వాములుగా ఎంచుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట, ఎట్టకేలకు 2026 జూలై మొదటి వారంలో వివాహ బంధంతో ఒకటయ్యారు. చాలా సింపుల్‌గా జరిగిన ఈ వెడ్డింగ్ ఈవెంట్‌లో ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది సభ్యులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులకు కూడా ఈ వివాహ సమాచారం ముందుగా తెలియకపోవడం గమనార్హం. పెళ్లి ముగిసిన తర్వాత బయటకు వచ్చిన అందమైన వెడ్డింగ్ పిక్స్ చూసి టాలీవుడ్ వర్గాలు సైతం షాక్‌కు గురయ్యాయి. జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను అధిగమించి, సరికొత్త ఆశలతో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ క్రేజీ టాలీవుడ్ కపుల్‌కు ఇండస్ట్రీ ప్రముఖులు తమ బెస్ట్ విషెస్ అందిస్తున్నారు.     Colors Swathi, Actress Swathi Reddy, Srikanth Nagothi
Nagarjuna Akkineni has been staying away from media and concentrating on his KING100 and Akhil's Lenin. The actor made an interesting observation about why he had to miss a date for Lenin. He stated that he never missed a date as he plans everything perfectly to match the timeline and then announce the date.  Now, the actor stated that when they have been ready to release the film on 26th June, co-producer Naga Vamsi with director Murali Kishore Abburu and editor Navin Nooli stated that if they get two more weeks the movie will be even better. So, he agreed to it and even though that effect OTT equations, he did not want to release a film without liking it.  Murali Kishore Abburu stated that he is happy with the output and Akhil became the character. He also stated that he wanted to take audiences to his village and show them the story of Lenin and Bharati. Bhagyashri Borse is playing the leading lady and producer Naga Vamsi praised her performance.  He stated that she did a better performance and Sreeleela had to replaced because she could not adjust dates. He thanked Nagarjuna trusting them and giving such an opportunity. Nagarjuna once again confirmed that Akhil will deliver a good hit on 10th July with Lenin.                                                                                       Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు,  గొడవలు, అతిగా స్పందించడం, జోక్యం చేసుకోవడం వంటివి కూడా గతంలో కంటే ఎక్కువగా పెరిగాయని చెప్పవచ్చు. వీటి వల్ల బంధాల మధ్య దూరం పెరుగుతుంది. అయితే నేటికాలంలో బంధాలు బలంగా ఉండాలంటే మైక్రో ప్రైవసీ పాటించాలట. ఇంతకీ మైక్రో ప్రైవసీ అంటే ఏంటి? ఇది బంధాలను బలంగా ఉంచడంలో ఎలా సహాయపడుతుంది? తెలుసుకుంటే.. మైక్రోప్రైవసీ.. మైక్రో-ప్రైవసీ అనేది నేటికాలంలో సంబంధాల గురించి జాగ్రత్త చేసే ఒక మార్గం. సంబంధంలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికీ కొంత పర్సనల్ స్పేస్  అవసరమని ఇది చెబుతుంది. ఈ స్పేస్  వ్యక్తికి మానసిక స్వేచ్ఛను అందిస్తుంది , సంబంధం భారంగా మారకుండా నివారిస్తుంది. ప్రేమ అంటే ప్రతీదాన్నీ నియంత్రించడం కాదని, ఒకరి హద్దులను మరొకరు గౌరవించుకోవడం కూడా అని మైక్రో ప్రైవసీ నొక్కి చెబుతుంది. మైక్రో-ప్రైవసీ సంబంధాలలో ఒక బాలెన్స్ ను క్రియేట్ చేస్తుంది.  దీనివల్ల ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నా ఎవరి ఐడెంటిటీ వారికి ఉంటుంది. మైక్రో ప్రైవసీలో అసలు అర్థం.. మైక్రోప్రైవసీలో ఉండే  ముఖ్యమైన అంశం  భాగస్వామి లేదా కుటుంబ సభ్యుని  పర్సనల్ ఫీలింగ్స్ ను, పర్సనల్  సమయాన్ని గౌరవించడం. ఎప్పుడూ వారితో టచ్‌లో ఉండటం లేదా ప్రతి కదలికను గమనించడం అనేది  సంబంధాలను బలహీనపరుస్తుంది. దానికి బదులుగా, ఒకరికొకరు కొంత స్వేచ్ఛను ఇచ్చుకుంటూ, ఒత్తిడి లేకుండా సంబంధాన్ని కొనసాగించడం ముఖ్యం. అతిగా డిపెండ్ అవడాన్ని, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ను నియంత్రణలో ఉంచడంలో కూడా మైక్రో ప్రైవసీ సహాయపడుతుంది. మైక్రో ప్రైవసీ ఎందుకు అవసరం.. మైక్రో ప్రైవసీ  సంబంధాలలో నమ్మకాన్ని, అర్థం చేసుకునే తత్వాన్ని పెంపొందిస్తుంది. ప్రతి ఒక్కరికి  వారి స్వంత సమయం, స్పేస్  ఉన్నప్పుడు, వారు మానసికంగా మరింత ప్రశాంతంగా, బాలెన్స్డ్ గా  ఉంటారు. ఇది సంబంధాలలో అనవసరమైన ఒత్తిడిని తగ్గించి ఎక్కువ కాలం బంధాలు పదిలంగా ఉండేలా చేస్తుంది. మైక్రో ప్రైవసీ పాటించే వ్యక్తులు తమ ఐడెంటిటీని కూడా కోల్పోకుండా ఉంటారు.  ఒకరి ముందు ఒకరు తక్కువ కాదు అనేలా బందాలు ఉంటే.. ఆ బంధాలు ఎన్నేళ్ళైనా పదిలంగా ఉంటాయి. ఇలా  చేయాలి.. భార్యాభర్తలలో ఎవరో ఒకరు అప్పుడప్పుడు ఒంటరిగా సమయం గడపాలని, అభిరుచులను కొనసాగించాలని, లేదా స్నేహితులతో సమయం గడపాలని కోరుకున్నప్పుడు, వారికి అంతరాయం కలిగించకుండా లేదా ప్రశ్నించకుండా వారి ఇష్టాలను గౌరవించడం, వారి అభిరుచులను కొనసాగించడంలో మద్దతు ఇవ్వడం వంటివి మైక్రో ప్రైవసీకి చక్కని ఉదాహరణ.  ఇది ఈ రోజు కొత్తగా  చెప్పాల్సిన విషయమేమీ కాదు.. కానీ కొందరికి అర్థం కావాలంటే కొన్ని ప్రత్యేక మార్గాలలో చెప్పాలి. అందుకే దీన్ని మైక్రో ప్రైవసీ అంటున్నారు.  ఈ మార్గాన్ని పాటిస్తే బంధాలు పదిలంగా ఉంటాయి.                                  *రూపశ్రీ.
ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అయితే అవసరానికి మించి మొబైల్ వాడటం క్రమంగా వ్యసనంగా మారి మన ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వీడియోలో Dr. వేణుగోపాల్ మొబైల్ వ్యసనం వల్ల మెదడులో జరిగే మార్పులు, ఏకాగ్రత తగ్గిపోవడం, జ్ఞాపకశక్తిపై పడే ప్రభావం, నిద్ర సమస్యలు, ఆందోళన, ఒత్తిడి వంటి అంశాలను చాలా సులభంగా వివరించారు.  అలాగే మొబైల్‌కు బానిస కాకుండా ఉండేందుకు పాటించాల్సిన అలవాట్లు, స్క్రీన్ టైమ్‌ను ఎలా తగ్గించుకోవాలి, పిల్లలు మరియు యువతలో మొబైల్ వినియోగాన్ని ఎలా నియంత్రించాలి అనే విషయాలపై కూడా విలువైన సూచనలు అందించారు.  మొబైల్‌ను పూర్తిగా వదిలేయడం అవసరం లేదు. కానీ దానిని సరైన విధంగా ఉపయోగించడం ద్వారా మన మెదడు ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను మరియు జీవన నాణ్యతను కాపాడుకోవచ్చు. మొబైల్ వ్యసనం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి.  
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది. ఇది వందలాది, వేలాది సంవత్సరాలుగా సాగుతున్న సంప్రదాయం.  అయితే భారతదేశంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. భారతీయులు విదేశాలలో పుట్టిన సంప్రదాయాలను పాటిస్తూ వెర్రిగా మారిపోతున్నారు. డేటింగ్ లు, సహజీవనాలు, రకరకాల కొత్త కల్చర్లు పాటిస్తూ భారతీయ సంస్కృతికి దూరం అవుతున్నారు. ఇప్పుడు డింక్ పేరిట ఏకంగా ఒక తరాన్ని పుట్టకుండా ఆపేస్తున్నారు.  అసలు డింక్ అంటే ఏమిటి?  దీని పట్ల భారతీయ జంటలు ఎందుకు అంత ఆకర్షితులు అవుతున్నారు? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. దశాబ్దాలుగా కుటుంబ వంశాన్ని కొనసాగించే మార్గంగా వివాహాన్ని చూసేవారు. కానీ కొత్త తరం దీనికి వ్యతిరేకంగా ఉంది, వంశాన్ని ముందుకు తీసుకెళ్లడం అనే విషయం కంటే.. ప్రపంచం పట్ల ఆసక్తి పెరిగింది,  సంబంధాల తీరు కూడా మారుతోంది. ఇప్పుడు ఒక బిడ్డను కనాలన్నా,  వంశాన్ని ముందుకు నడపాలన్నా పెద్దగా ఆసక్తి చూపడం లేదు.దీన్నే డింక్ అంటున్నారు. విదేశాలలో పుట్టిన ఈ సంస్కృతి పట్ల భారతీయులు కూడా  నెమ్మదిగా అలవాటు పడుతున్నారు. డింక్ అంటే.. DINK అంటే ' డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ ', పేరులోనే దీని  అర్థం ఉంది. దీని అర్థం పెళ్లి తర్వాత పిల్లలను కనాలని అనుకోకపోవడం. డింక్ జంటలు ఎందుకు పెరుగుతున్నాయ్.. కొన్నేళ్ల క్రితం వరకు ఇంకా పిల్లలు ఎందుకు పుట్టలేదు అనేదే చాలా పెద్ద ప్రశ్నగా ఉండేది పెళ్లైన జంటల్లో.. కానీ ఇప్పుడు పిల్లలు వద్దు అనే నిర్ణయం వస్తోంది. ముఖ్యంగా బారతదేశంలోని పట్టణాలలో ఉన్న జంటలలో చాలా మార్పు వస్తోంది. చదువుకున్న, ఇద్దరూ సంపాదించే భార్యాభర్తలు అసలు మనకు పిల్లలు అవసరమేనా అనే ప్రశ్న వేసుకుంటున్నారు. ముఖ్యంగా 20, 30 ఏళ్ల వయసులో  పెళ్లిచేసుకున్న జంటలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆర్థిక భారం.. చాలామంది ఎదుర్కునే స్పష్టమన కారణం ఆర్థిక విషయాలే..   ఇరవై, ముప్పై సంవత్సరాల కిందట పిల్లలను పెంచినట్టు నేటికాలంలో మెట్రో సిటీలలో పిలలను పెంచడం కష్టమవుతోందని చాలామంది అంటున్నారు. పాఠశాల ఫీజులు,ఇల్లు కొనడం లేదా అద్దె, పిల్లల సంరక్షణ , ఆరోగ్య సంరక్షణ.. ఇవన్నీ పిల్లలు వద్దు అనుకోవడానికి కారణం అవుతున్నాయి. మెట్రో పట్టణాలలో ఇద్దరు వ్యక్తుల సంపాదన కూడా వీటికి సరిగా సరిపోవడం లేదని ఆవేదన చాలా మందిలో ఉంది. క్వాలిటీ లైఫ్.. పిల్లలు పుడితే లైఫ్ క్వాలిటీ పోతుందని చాలామంది జంటలు అబిప్రాయం.  పిల్లల బాధ్యతలలో తాము ఎన్నో సంతోషాలు, సరదాలు, ఇష్టాలు కోల్పోవడానికి, జీవితాన్ని సరదాగా గడపడానికి, ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడానికి సరిపడినంత సమయం దొరకడం లేదని అనుకుంటున్నారు.  పైగా పిల్లల కారణంగా జీవితంలో కాస్త విలాసంగా బ్రతికే అవకాశం ఉన్నా దాన్ని పిల్లల కోసం త్యాగం చేయాల్సి వస్తుంది. అందుకే పిల్లలు వద్దని అనుకుంటున్నారు. మరొక మార్గం.. చాలా మంది DINK జంటగా ఉండాలని నిర్ణయం తీసుకుంటే అది  బాధ్యతల నుండి తప్పించుకోవడం కోసం లేదా వారి విలాసవంతమైన జీవితం కోసం అనుకుంటారు.  కానీ ఇది తప్పు.. చాలామంది పిల్లల పట్ల తీసుకోవాల్సిన బాధ్యతలను ఒకరికొకరు బాధ్యతగా చూసుకోవడంలో, అలాగే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, జంతు సంక్షేమం వంటి  తమకు ఇష్టమైన విషయాల ద్వారా బాధ్యతను తీసుకుంటున్నారు. ఇది తమ తరువాత వంశం లేకపోయినా,   కుటుంబాన్ని కాపాడుకోవడం ,  జీవన నాణ్యతను మెరుగ్గా ఉంచుకోవడం వంటి కారణాల వల్లే చేస్తున్నారు.                                    *రూపశ్రీ.
భారతీయుల భోజనంలో అన్నం చాలా ప్రధానమైనది. అన్నం తినడం వల్ల వచ్చే సాటిసిఫాక్షన్ వేరే ఏ విధంగా రాదని చాలామంది అంటారు.  ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మూడు పూటలా అన్నం తినాలన్నా చక్కగా తినేస్తారు. కానీ ప్రస్తుతం డయాబెటిస్,  అధిక బరువు వంటి సమస్యలతో అన్నం అంటే దూరం జరిగే వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారు ఆహారంలో రొట్టెలు తీసుకోవడం మంచిదని అనుకుంటారు.  చపాతీలు, సజ్జ, జొన్న రొట్టెలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.  ముఖ్యంగా జొన్నరొట్టెలు శరీరానికి చక్కని పోషణ ఇస్తాయి.  అంతేకాదు.. 30 రోజులు అన్నానికి బదులుగా జొన్న రొట్టెలు తింటే ఆరోగ్య పరంగా  అద్బుతమైన ఫలితాలు చూస్తారు.  30రోజులు జొన్న రొట్టెలు తింటే ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. 30రోజులు అన్నానికి బదులు జొన్న రొట్టెలు తింటే కలిగే ఫలితాలు.. భారతీయులు ఉపయోగించే తృణదాన్యాలలో జొన్నలు చాలా శ్రేష్టమైనవి. జొన్నలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఈ కారణంగా అన్నానికి బదులు జొన్న రొట్టెలు తినడం వల్ల చాలాసేపటి వరకు ఆకలి అవ్వదు.  ఈ కారణంగా పదే పదే ఏదో ఒకటి తినడం అనే అలవాటు కూడా తగ్గుతుంది.  దీనివల్ల బరువు తగ్గడం కూడా సులువు అవుతుంది.  రోజూ అన్నానికి బదులు జొన్నరొట్టెలు తినేవారు బరువు సులువుగా తగ్గుతారు. డయాబెటిస్ ఉన్న వారికి జొన్నలు గొప్ప వరం అని చెప్పవచ్చు. అన్నంతో పోలిస్తే జొన్నరొట్టెలలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల జొన్నరొట్టెలు తింటే షుగర్ లెవెల్స్ నిలకడగా ఉంటాయి.  డయాబెటిస్ ఉన్నవారు అన్నం, చపాతీ బదులు రోజూ జొన్నరొట్టెలు తింటే బ్లడ్ షుగర్ చాలా కంట్రోల్ అవుతాయి. జొన్నలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  దీనివల్ల ఆహారం జీర్ణం కావడంలో ఎలా ఇబ్బందులు ఉండవు. మలబద్దకంతో ఇబ్బంది పడేవారు రోజూ జొన్నరొట్టెలు తీసుకుంటే మలబద్దకం సమస్య తొగ్గిపోతుంది. జీర్ణాశయం స్థితి మెరుగవుతుంది. జొన్నరొట్టెలలో ఉండే గ్లైసెమిక్ సూచీ చాలా తక్కువ.  ఇది రక్తంలో గ్లూకోజ్ ను చాలా నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఈ కారణంగా నెమ్మదిగా అరుగుతుంది.  దీనివల్ల చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉండటమే కాదు.. చాలా సేపు ఎనర్జీగా కూడా ఉంచుతుంది. అన్నం అయితే తొందరగా అరిగిపోతుంది. అందుకే జొన్నరొట్టెలు తింటే ఎక్కువ సేపు ఎనర్జీగా ఉండవచ్చు. పూరీ,  బేకరీ ఫుడ్స్,  కేక్స్, ఆయిల్ ఫుడ్స్  వంటివి తినడం వల్ల శరీరంలో  చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.  అయితే చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు ఏ ఆహారం తినాలన్నా చాలా భయపడుతూ ఉంటారు. కానీ రోజూ జొన్న రొట్టెలు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.  గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.   జొన్నరొట్టెలు శరీరానికి చలువ చేస్తాయి,  బలాన్ని ఇస్తాయి,  ఎక్కువ సేపు శరీరానికి శక్తిని ఇస్తాయి, రోజూ కనీసం ఒక్కపూట అయినా జొన్న రొట్టెలు తింటే శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అందుకే కనీసం రోజులో ఒక్క పూట అయినా జొన్న రొట్టెను ఆహారంలో తీసుకోవడం మంచి అలవాటని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు.                               *రూపశ్రీ.
బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) అనేది అత్యవసర వైద్య పరిస్థితి. మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాపాయం మాత్రమే కాకుండా శాశ్వత వైకల్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది.  ఈ వీడియోలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. అనిరుధ్ దేశ్‌ముఖ్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరించారు.  ఈ వీడియోలో మీరు తెలుసుకునే అంశాలు: బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? స్ట్రోక్ ఎన్ని రకాలుగా ఉంటుంది? స్ట్రోక్ వచ్చే ప్రధాన కారణాలు ఏమిటి? స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే హెచ్చరిక లక్షణాలు (TIA) ఏమిటి? చేతులు, కాళ్లు బలహీనపడటం, ముఖం వంకర కావడం, మాట తడబడటం వంటి లక్షణాలను ఎలా గుర్తించాలి? "గోల్డెన్ పీరియడ్" అంటే ఏమిటి? ఆ సమయంలో చికిత్స ఎందుకు చాలా కీలకం? ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి? స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి? స్ట్రోక్ విషయంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడడమే కాకుండా మెదడు దెబ్బతినే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.  బ్రెయిన్ స్ట్రోక్ గురించి పూర్తి అవగాహన పొందాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health‌ ను ఫాలో అవుతూ ఉండండి.
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం,  ప్రోటీన్ కూడా ఉంటుంది.  భారతీయులు భోజనం చివర పెరుగుతో తింటే తప్ప వారికి తృప్తి ఉండదు. వేసవి కాలంలో పెరుగును ఇష్టంగా తింటారు. అయితే వర్షాకాలంలో పెరుగు తినడం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు.  పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని,  జీర్ణవ్యవస్థ పై ప్రభావం పడుతుందని అంటుంటారు.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. పెరుగు కడుపుకు మేలు చేసే ప్రోబయోటిక్ ఆహారంగా పరిగణించబడుతుంది, కానీ వర్షాకాలంలో పెరుగు తినడం పై  భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని కొందరు చెబుతారు, అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం వేరే విధంగా చెబుతున్నారు. వర్షాకాలంలో పెరుగు తినవచ్చా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వర్షాకాలంలో పెరుగును తినవచ్చు, కానీ దాని పరిమాణం , పెరుగు తినే  సమయం విషయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే, వర్షాకాలంలో జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల కొంతమందికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది,  పేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది, శరీరాన్ని చల్లబరచడమే కాకుండా ఉత్తేజపరుస్తుంది.   రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. వర్షంలో పెరుగు తినడం వల్ల కలిగే నష్టాలు.. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు , ఫ్లూ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పెద్దలు జలుబు, జ్వరం ఉన్నప్పుడు పెరుగు తినకూడదని చెబుతారు. పెరుగు తినడం వల్ల   కఫం , శ్లేష్మంతో సమస్యలు రావచ్చు. కొంతమందికి కడుపు ఉబ్బరం కలగవచ్చు.  రాత్రిపూట తినడం జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. పెరుగు ఎలా తింటే శ్రేష్టం..  పగటిపూట మాత్రమే పెరుగు తినడం మంచిది.  రాత్రిపూట పెరుగు తినడం మానుకోవాలి.   కొద్దిగా వేయించిన జీలకర్ర లేదా నల్ల మిరియాల పొడి వేసుకుని  పెరుగు తీసుకుంటే మంచిది.  తాజాగా,  ఇంట్లో తయారుచేసిన పెరుగును మాత్రమే తినడం ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం. పెరుగు ఎవరు తినకూడదు? జలుబుతో బాధపడుతున్న వాళ్లు,  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు, ఆస్తమా లేదా అలర్జీ రోగులు, రాత్రి ఆలస్యంగా భోజనం చేసే వారు.. పెరుగు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.                                   *రూపశ్రీ.