జగన్, రోజా పాదయాత్రలు... వింతలే వింతలు..
Publish Date:Dec 2, 2017
Advertisement
వింతలు చూడలంటే మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. వైసీపీ నేతలు చేస్తున్న పాదయాత్రలు చూస్తే చాలు. కావల్సినన్ని వింతలు, విశేషాలు కనిపిస్తాయి.. వినిపిస్తాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పం పేరుతో.. ఒకపక్క పాదయాత్ర చేస్తుంటే.. మరోపక్క ఎమ్మెల్యే రోజా కూడా పాదయాత్ర మొదలుపెట్టింది. వీళ్ల పాదయాత్రల్లోనే అసలైన వింతలు కనిపిస్తున్నాయి. అవేంటనుకుంటున్నారా.. ? జగన్ కోసం ఒకటి, రెండేళ్ళ పసి బాలుడు కూడా వేచిచూడడం… మూడు, నాలుగేళ్ల పాప నిరాహార దీక్ష చేయడం… 40 ఏళ్ళ మహిళ ముసలి అవ్వ అయిపోవడం… ఇలా చెప్పుకుంటూ పోతే ఓ మహాభారతమే అవుతుంది. తాజాగా మరో వింత బయటపడింది. అదేంటంటే.. పట్టుమని పది నిముషాలు కూడా నిలబడలేని వికలాంగుడు ఏకంగా 12 కిలోమీటర్లు జగన్ వెంట నడిచాడట. ఆశ్యర్యం ఏంటంటే..ఆ పెద్దాయన గత పదేళ్లుగా మంచానికి పరిమితం అయ్యాడట. కనీసం పది నిముషాలు కూడా సదరు వ్యక్తి నిలబడలేడట. అలాంటిది.. జగన్ పాదయాత్రలో ఏకంగా 12 కిలో మీటర్లు నడిచాడట. డాక్టర్లు, దేవుళ్ళు కూడా సాధించలేని ఇలాంటి వింతలకు నిలయంగా జగన్ “ప్రజా సంకల్పయాత్ర” లో మాత్రం సాధ్యమవుతుంది. ఇక రోజా పాదయాత్ర విషయానికి వస్తే.. అదో విడ్డూరం. పాపం ఏసీ గదుల్లో నుండి బయటకు వచ్చారు కదా.. అందుకే ఇదో పెద్ద విషయం లాగ అనిపిస్తుంది. ఇలాంటివి సామాన్య ప్రజలకు సర్వ సాధారణం అని తెలియదు కాబోలు. ఒక విధంగా చెప్పాలంటే అసలు వీటిని లెక్కే చేయరు. కానీ వైసీపీ నేతలకు మాత్రం ఇదో పెద్ద విషయం. అందుకే రోజా పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుండి.. ఆమె కాళ్లను చూపించడమే ఎక్కువైంది. ఆమె కాళ్లకు బొబ్బలెక్కడం.. వాటికి చికిత్స చేయించుకుంటున్న ఫొటోలు వేస్తూ హంగామా చేస్తున్నారు. ఇంకా అద్భుతం ఏంటంటే... తన కాళ్ళు చూపించాలంటూ చేసిన సైగలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో రోజా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినట్లయ్యింది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వింతలే బయటపడతాయి. రోజా హంగామా కొద్ది రోజులే అయినా.. జగన్ పాదయాత్రలో మాత్రం మరో నాలుగైదు నెలల పాటు ఈ వింతలు, విడ్డూరాలు చూడాల్సిందే.
http://www.teluguone.com/news/content/jagan-45-79071.html





