చట్టంతో గేమ్స్.. జగన్ కు అబ్బిన అనువంశిక విద్య!

Publish Date:Dec 26, 2025

Advertisement

చట్టం, న్యాయం, కోర్టులు ఇలాంటి వాటిని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఖాతరు చేయరు. వాటితో చెలగాటమాడటం ఆయనకు రాజకీయ ప్రవేశానికి ముందు నుంచీ బాగా అలవాటైన విద్య. ఇదీ జగన్ గురించి న్యాయనిపుణులు చెప్పే మాట. 

అందుకు వారు ఉదహరిస్తున్న ఈ క్రోనాలజీ చూస్తే ఎవరికైనా అది నిజమేగా అనిపించకమానదు.  జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి.  చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి,  ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసినవారెవరూ ఉండకపోవచ్చచునం టారు పరిశీలకులు.  ఈ విషయంలో జగన్  తాత రాజారెడ్డి కాలం నుంచి వైఎస్ కుటుంబానికి అనువంశికంగా అబ్బిన విద్య అంటారు.  

లా యునివ‌ర్శిటీ ఎలాగో.. అన్ లాయూనివ‌ర్శిటీ అనేది ఉండి ఉంటే ఆ వర్సిటీకి జ‌గ‌న్ ను  హెడ్ అయి ఉండేవారంటారు. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ క్విడ్ ప్రోకో కేసుల్లో  చట్టంతో చెలగాటమాడుతున్న తీరు తెలిసిందే. విచారణ ముందుకు సాగకుండా వరుస డిశ్చార్జ్ పిటిషన్ లతో ఆయన కేసును సాగతీస్తున్న తీరు న్యాయ నిపుణులనే విస్మయపరుస్తోంది. 

ఇటీవ‌ల  జ‌గ‌న్ కేసుల‌ను ప‌రిశీలిస్తున్న న్యాయ‌మూర్తి బ‌దిలీ అయ్యారు. ఆయన స్థానంలో మరో న్యాయమూర్తి వచ్చారు. జగన్ కేసులు విచారిస్తున్న న్యాయమూర్తి బదలీ అయితే ఏంటి అని అంతా అనుకోవచ్చు కానీ  కొత్తగా వచ్చిన న్యయమూర్తి జగన్ కేసులకు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ పరిశీలించడానికి కొన్నేళ్లు పడుతుంది.  దీంతో క‌థ మ‌ళ్లీ మొద‌టికే వ‌స్తుంది. సరే బదలీ అనేది సాధారణం కదా అనుకోవచ్చు. కానీ జగన్ తన కేసుల విచారణ ముగింపు లేకుండా అలా కొక.. సాగుతూ ఉండటానికి పలు పద్ధతులు అవలంబిస్తుంటారు..  వాటిలో ఒకటే   డిశ్చార్జీ పిటిష‌న్ల వ‌ర‌ద పారించడం. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ కేసులలో  130 డిశ్చార్జీ పిటిష‌న్లు దాఖలయ్యాయి. అలాగే విచారణపై స్టేలు కోరుతూ పిటిషన్ వేయడం. ఇలాంటి పిటిషన్ల విచారణ ద్వారా కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకోవడం, అలాగే  ఈ కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడం.   2019- 24 మ‌ధ్య సీఎంగా అధికారంలో ఉన్నందున, పాలనా పరమైన అడ్డంకులకు అవకాశం లేకుండా, తనకు కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచిమినహాయింపు కావాలంటూ పిటిషన్ వేసి మినహాయింపు పొందిన జగన్.. ఇప్పుడు అధికారంలో లేకపోయినా, కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అయినా.. తాను కోర్టుకు వస్తే.. జనం ఇబ్బందిపడేంతగా ట్రాఫిక్ జామ్ లు ఏర్పడతాయనీ, తన భద్రతకు ప్రభుత్వానికి భారీగా ఖర్చు అవుతుందంటూ కోర్టును మళ్లీ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. తాను చెప్పిన మాట వాస్తవమని  అందరూ నమ్మే విధంగా ఇటీవల ఆయన నాంపల్లి కోర్టుకు హాజరైనప్పుడు వైసీపీయులు చేసిన హంగామా జగన్ ప్లాన్ లో భాగమేనంటారు పరిశీలకులు. 

 ఒక సాధార‌ణ ఎంఎల్ఏగా ఉన్న జగన్ కు ఎలాంటి హైఎండ్ ప్రోటోకాల్ లేకున్నా ఉన్న‌ట్టు గా సృష్టించి.. కోర్టు విచారణకు తనకంటూ ఓ షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్న ఘనత జగన్ కే చెల్లుతుందంటున్నారు.   తాను ఎప్పుడు కోర్టుకు హారైనా జనం ఇలా తండోపతండాలుగా తనను చూడటానికి వస్తారనీ, వారిని కంట్రోల్ చేయడం, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాలకు, పోలీసులకు తలకు మించి భారం అవుతుందన్న బిల్డప్ క్రియేట్ చేశారు. ఇప్పడు అదే చూపి మరో సారి కేసుల విచారణ నుంచి వ్యక్తిగత మినహాయింపు పొందినా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు.  ఇన్ని రకాలుగా తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల దర్యాప్తు ముందుకు సాగకుండా జాప్యం అయ్యేలా జగన్ మేనేజ్ చేయగలుగుతున్నారంటే దానికి చట్టంతో చెలగాటమని కాకుండా మరేమనాలని ప్రశ్నిస్తున్నారు. కేసు వాయిదాలు కోరడానికే జగన్ న్యాయవాదుల ఖర్చు కోట్ల రూపాయలు ఉంటుందని ఇటీవల కొన్ని గణాంకాలువెలుగులోకి వచ్చాయి.  లాతో గేమ్స్ ఆడుకోవ‌డం ఎలా అని ఒలింపిక్స్ లో పోటీ పెడితే.. జగన్ కు గోల్డ్ మెడల్ ఖాయమంటూ నెటిజనులు సెటైర్లు పేలుస్తున్నారు. చూడాలి మరి ఇంకెంత కాలం ఈ కేసుల విచారణను జగన్ తన స్టైల్ లో సాగదీస్తారో?  

By
en-us Political News

  
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.