కొత్త ట్విస్ట్.. జయలలిత కూతురే... శోభన్ బాబు చెప్పాడు...
Publish Date:Dec 4, 2017
Advertisement
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం జయ వారసులమంటూ పలువురు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. మొదట కృష్ణమూర్తి అనే వ్యక్తి తాను జయలలిత-శోభన్ బాబుల వారసుడనని...ఆస్తి తనకే చెందాలని కోరుతూ కోర్టును ఆశ్రయించగా.. ఆ వ్యక్తి అందించిన పత్రాలు నకిలీవి అని తెలిపి నాలుగు తిట్లు తిట్టి అతగాడిని జైలుకి పంపించింది. ఇక ఆ స్టోరీ అయిపోయిందనుకుంటే ఇప్పుడు అమృత అనే యువతి తాను జయలలిత కూతురినని మరో ట్విస్ట్ ఇచ్చింది. అంతేకాదు.. కావాలంటే డీఎన్ఏ టెస్ట్ కూడా చేయించాలని కోరుతూ ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించింది. దీంతో అందరూ ఆశ్చర్యపోగా.. సుప్రీంకోర్టు మాత్రం అందుకు అంగీకరించలేదనుకోండి. అయితే ఇప్పుడు జయలలిత పై మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. జయలలితకు కూతురు ఉన్న మాట వాస్తవమేనని జయ మేనత్త కూతురు లలిత ఇంతకుముందే చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అమృత జయకు, నటుడు శోభన్ బాబుకు పుట్టిన సంతానమేనని జయ స్నేహితురాలు గీత తెలుపుతున్నారు. అంతేకాదు ఈ విషయాన్ని శోభన్ బాబే తనతో స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. 1999లో తానొకసారి శోభన్‌బాబు ఇంటికి వెళ్లినప్పుడు జయకు తనకు ఒక కుమార్తె ఉన్న విషయాన్ని శోభన్ బాబు తనతో ప్రస్తావించారని ఆమె అన్నారు. ఆమె పేరు అమృత అని కూడా చెప్పారన్నారు. 1996 నుంచి జయలలితతో అమృతకు సంబంధాలు ఉండేవని.. డీఎన్ఏ పరీక్షల్లోనే అసలు విషయం తేలుతుందని ఆమె అన్నారు. ఈ విషయం జయ ప్రియసఖి శశికళకు కూడా తెలుసని చెప్పారు. జయ కూడా శోభన్ బాబుతో తాను సహజీవనం చేస్తున్నానని, ఆయన వివాహితుడు కావడంతో పెళ్లి చేసుకోలేకపోతున్నానని అంగీకరించిందని తెలిపింది. దీనిపై ఆమె అప్పట్లో స్టార్ అండ్ స్టైల్ అనే ఆంగ్ల పత్రికకు స్వయంగా లేఖ కూడా రాశారట. ఇక ఇప్పుడు ఈ విషయం బయటకు రావడంతో అమృత ఆమె కూతురే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు సూచనతో అమృత కర్ణాటక కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. ఇక జరుగుతన్న పరిణామాలు చూస్తుంటే అమృత వాదనలు నిజమేనేమో అనిపిస్తుంది. అంత ధైర్యంగా డీఎన్ఏ టెస్ట్ కూడా చేయించాలని కోరిందంటే... నిజంగా ఆమె జయలలిత కూతురా అని ఏంటీ అని ఆలోచనలో పడ్డారు. మరి ముందు ముందు ఇంకెన్ని విషయాలు బయటపడతాయి.. నిజంగా అమృత జయ కూతురేనా తెలియాలంటే ఆ నిజం తెలిసే వరకూ ఆగాల్సిందే...
http://www.teluguone.com/news/content/jayalalitha-45-79082.html





