దొంగే దొంగా దొంగా అని అరచినట్లుగా జగన్ తీరు!

Publish Date:Jan 2, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు దొంగే దొంగ దొంగ అని అరిచిన చందంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ హయాంలో  తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో ఇప్పటికే వైసీపీ నాయకులు పలువురు పీకలోతు ఇరుక్కున్నారు. కొందరు అరెస్టయ్యారు కూడా. మరి కొందరు విచారణలను ఎదుర్కొంటున్నారు. సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలో  తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ వెనుక ఉన్నది వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపంపై పిటిషన్ దాఖలు చేయాలంటే  ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలి. కానీ తాజాగా తెలంగాణలో  పిటిషన్ దాఖలైంది. ఔను తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ పిటిషన్ దాఖలు కావడం  విన‌డానికి ఆశ్చ‌ర్య‌కంగా ఉన్నావాస్తవం.
నిజానికి  క‌మిష‌న్ల క‌క్కుర్తితో  తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో  కల్తీ నెయ్యి వినియోగం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగనే వెనకుండి తెలంగాణ హైకోర్టులో ఇలా ఎదురు పిటిషన్ వేయించడమేంటన్న విస్మయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.   జగన్ హయాంలో తిరుమల కేంద్రంలో సర్వ అనర్ధాలూ జరిగాయన్న విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే.  ఇక పరకామణి చోరీ వ్యవహారంలో ఫిర్యాదు దారుడైన   ఏవీఎస్వో స‌తీష్ హ‌త్య జగన్ హయాంలో తిరుమలలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, తిరుమల పవిత్రతను దెబ్బతీసే చర్యలూ యథేచ్ఛగా జరిగాయనడానికి నిదర్శనంగా చెబుతున్నారు పరిశీలకులు.  ఆయన హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలే.. కనీసం విపక్ష హోదా లేకుండా వైసీపీ ఘోర పరాజయం కావడానికి కారణమని శ్రీవారి భక్తులు భావిస్తున్నారు.    జ‌గ‌న్ హ‌యాంలో తిరుమ‌ల కేంద్రంగా జ‌రిగిన అక్ర‌మాల సంగతి కాసేపు పక్కన పెట్టి..  తెలంగాణ హైకోర్టులో తిరుమల ప్రసాదాల నాణ్యతపై దాఖలైన పిటిషన్ లోని అంశాలను గమనిస్తే.. 

ఆగ‌మ‌శాస్త్రం ప్ర‌కారం స్వామివారికి నైవేద్య సంత‌ర్ప‌ణ జ‌ర‌గ‌డం లేద‌న్న‌ది ఈ పిటిష‌న్లోని ప్ర‌ధానాంశం. పిటిష‌న్ త‌ర‌ఫు సుశీలారాం అనే న్యాయ‌వాది   వాద‌న‌లు వినిపించారు. గ‌తంలో టీటీడీ ఆమోదించిన తీర్మానాల‌ను ఈ బోర్డు తుంగ‌లో తొక్కింద‌న్న‌ది మరో ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అయితే ఈ వాద‌న‌లు విన్న ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అప‌రేశ్ కుమార్ సింగ్, జ‌స్టిస్ జీఎం మొయినుద్దీన్ తో కూడిన ధ‌ర్మాస‌నం విషయాన్ని టీటీడీ దృష్టికి తీసుకెళ్లారా? అని ప్రశ్నించింది. దీనిపై  తాము మౌఖికంగా టీటీడీ బోర్డుకు విన్న‌వించిన‌ట్టు చెప్పారు పిటిష‌న‌ర్ కే. శివ‌కుమార్. భ‌క్తుల విశ్వాసాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని.. ఈ వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకోవ‌ల్సిందిగా కోరారు పిటిష‌న‌ర్. అయితే ఈ పిటిష‌న్ ప‌ట్ల కోర్టు రిజిస్ట్రీ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో కోర్టు పటిషన్ విచారణార్హతపై త‌న నిర్ణ‌యం వాయిదా వేసింది. 

 వైవీ సుబ్బారెడ్డి, భూమ‌న వంటి  అన్యమతస్థులను టీటీడీ బోర్డు చైర్మ‌న్లుగా నియ‌మించిన జ‌గ‌న్..  అలాగే శ్రీవారి  ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగం, శాలువాల కుంభ‌కోణం, శ్రీవాణి టికెట్ల‌కు లెక్క‌లు చూప‌క పోవ‌డం, ప‌ర‌క‌మాణి చోరీ,  స్విమ్స్ ఆస్ప‌త్రుల్లోని మెడిక‌ల్ షాపుల నుంచి నెల‌కు రూ. 40 ల‌క్ష‌ల మేర వ‌సూలు చేయ‌డం ఇలా ఎన్నోఅవకతవకలు జగన్ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలు కావడంపై సర్వత్రా విస్మయం, ఆగ్రహం వ్యక్తమౌతోంది.  అన్న‌దానంలో నాసిర‌కం స‌రుకులు,  క్యూలైన్ల‌లో భ‌క్తుల‌కు ఇవ్వాల్సిన సాంబార్ రైస్, పెరుగ‌న్నం, పాలు వంటివి ఇవ్వ‌కుండా ఆప‌డం.. వంటి ప‌లు సంఘటనలు జరిగింది జగన్ హయాంలోనే కదా అని భక్తులు కూడా అంటున్నారు. 

కొండ మీదే కాదు కొండ కింద గోవింద‌రాజుల స్వామి వారి ఆల‌య గోపుర బంగారు తాప‌డంలోనూ త‌మ చోర‌ బుద్ధి చాటింది జ‌గ‌న్ అండ్ కో. ఈ మొత్తం గోపుర తాప‌డంలో 69 కోట్ల విలువైన బంగారం కొట్టేసిన‌ట్టు తేలింది. ఇదే గోపురంపై ఉన్న ముప్పై రెండు విగ్ర‌హాల విధ్వంసానికి కూడా కార‌కుల‌వ‌డం మ‌రో అప‌చారం.. ఇక వ‌రాహ స్వామి వారి గోపురం బంగారు తాప‌డంలో లిక్విడ్ రూపంలోనూ బంగారం కొట్టేయ‌డం వంటి ఎన్నో కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. 

బ్రిటిషర్ల హ‌యాంలో కూడా తిరుమల వేంకటేశ్వరుడి విషయంలో ఇలా అపచారాలు జరగలేదని పండితులు  అంటున్నారు. అయితే జగన్ హయాంలో మాత్రం తిరుమల పవిత్రతను మంటగలిపేలా అపచారాలు జరిగాయని అంటున్నారు. ఆ అరాచకాలన్నీ ఒక్కటొక్కటిగా ఇప్పుడు బయట పడుతుం డటంతో..   హిందూ ఓటు బ్యాంకు దూరమైపోతోందన్న భయంతోనే జగన్ తిరుమల పవిత్రత విషయంలో ఎక్కడ లేని అక్కరా కనబరుస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.  తన హయాంలో చేయాల్సిందంతా, చేయగలిగినంతా చేసి ఇప్పుడు తగుదునమ్మా అంటూ   శ్రీవారికి ఆగమశాస్త్రం ప్రకా రం నైవైద్య నివేదిన జరగడం లేదంటూ కోర్టును ఆశ్రయించడం వెనుక ఉన్నది కేవలం రాజకీయమే కానీ,  శ్రీవారిపై భక్తితో కాదని అంటున్నారు.  

By
en-us Political News

  
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.