కేసీఆర్ కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవ్వనుందా...!
Publish Date:Dec 2, 2017
Advertisement
తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీఆర్ఎస్ కు ఎలాంటి ఢోకా లేదు అని చెప్పొచ్చు కూడా. తెలంగాణ ఉద్యమ పోరాటంలో పుట్టిన ఈ పార్టీ..ఆ బలంతోనే అధికారాన్ని చేపట్టింది. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవనే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే. ప్రత్యేక రాష్ట్ర విభజనలో తెలంగాణ ఉద్యమంలో అందరూ ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా ఈ ఉద్యమంలో జేఏసీ ఛైర్మన్ కోదండరాం...కీలక పాత్ర పోషించారు. అలాంటి కోదండరాంకే ఈరోజు టీఆర్ఎస్ వ్యతిరేకమైంది. ప్రభుత్వ విధానాలపై కోదండరాం కూడా వ్యతిరేకతతో ఉన్నారు. కోదండరాం మాత్రమే కాదు... తెలంగాణ రాష్ట్రం రావడానికి ఓ రకంగా కారణమైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్దులు కూడా కొంతమంది కేసీఆర్ కు వ్యతిరేకం అయ్యారు. ఇక దీనిలో భాగంగానే కోదండరామ్ కూడా కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో తాజా వార్త బయటకు వచ్చింది. అదేంటంటే... కోదండరాం, గద్దర్ కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించబోతున్నారన్న వార్త వినిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ రహస్యంగా భేటీ కావడం ఈ వార్తలకు ఊతమిస్తోంది. టీ.జేఏసీ చైర్మన్ కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్‌తో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జీ కుంతియా రహస్యంగా భేటీ అయ్యారు. సుమార్ రెండు గంటలకు పైగా వీరిమధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. నేరుగా ప్రజా సంఘాలు, జేఏసీ నేతలతోనే చర్చలు జరపాలన్న రాహుల్ విజ్ఞప్తితో దూతలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అయితే కోదండరాం... గద్దరు నిర్ణయం ఇంకా తెలియాల్సి ఉంది.
మరి ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కాస్త బెటరే. ఇక కేవలం కేసీఆర్, టీఆర్ఎస్ పైనే యుద్దంచేయడానికే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇప్పుడు ఇక వీళ్ల మద్దతు కూడా లభిస్తే కాంగ్రెస్ పార్టీ కాస్త బలం పుంజుకున్నట్టే. అసలే ఈ మధ్య టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతుంది. మరి కేసీఆర్ ఇప్పుడైనా కాస్త కళ్లు తెరిచి జాగ్రత్త పడకపోతే అసలుకే మోసం వస్తుంది మరి.
http://www.teluguone.com/news/content/kcr-45-79067.html





