తెలంగాణ మునిసిపోల్స్.. జనసేన, బీజేపీ ఎవరిదారి వారిదే!

Publish Date:Jan 11, 2026

Advertisement

తెలంగాణ  మునిసిపల్ ఎన్నికలకు ముందు కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఫిబ్రవరిలో తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన ఎన్డీయేతో తెలంగాణ ఎన్నికలలో పొత్త ప్రశక్తే లేదని తెలంగాణ బీజేపీ ప్రకటించడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.   

సహజంగానే జనసేన తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో పోటీ అనగానే బీజేపీతో పొత్తు ఉంటుందని అంతా భావించారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన బిజెపి, టిడిపిలతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సహజంగానే తెలంగాణలో కూడా అదే కూటమి కొనసాగుతుందని అంతా భావించారు. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రానున్న మునిసిపోల్స్ లో జనసేనతో తమ పార్టీకి ఎటువంటి పొత్తూ లేదంటూ ప్రకటించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బీజేపీ తెలంగాణ మునిసిపోల్స్ లో స్వతంత్రంగా  పోటీ చేస్తుందని, జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవనీ కుండబద్దలు కొట్టేశారు. రామచంద్రరావు ప్రకటనకు కొద్ది సేపు ముందే జనసేన తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో రాజకీయవర్గాలలో  పొత్తులపై పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది. అయితే ఎన్డీఏ తరహా కూటమి కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితమనీ, ఇది తెలంగాణలో కొనసాగే అవకాశం లేదనీ రామచంద్రరావు ప్రకటనతో తేటతెల్లమైంది.  ఇందుకు ప్రధాన కారణం.. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్యా రాజకీయ వేడి రగులుస్తున్న జలవివాదాలేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ జలవివాదాల కారణంగానే.. ఆంధ్రప్రదేశ్‌లో   సన్నిహిత సమన్వయం ఉన్నప్పటికీ,  తెలంగాణలో పార్టీల మధ్య పొత్తుకు అవకాశం లేని పరిస్థితి నెలకొందని అంటున్నారు.  ఆ కారణంగానే తెలంగాణలో  బీజేపీ, జనసేన పార్టీలు మునిసిపల్ ఎన్నికలలో ప్రత్యర్థులుగా రంగంలోకి దిగాల్సిన అనివార్యత ఏర్పడిందని అంటున్నారు.  

By
en-us Political News

  
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.