క్యూబాతో యుద్దానికి డొనాల్డ్ ట్రంప్ రెడీ అయ్యారా?

Publish Date:May 21, 2026

Advertisement

 

ప్రపంచ వ్యాప్తంగా 8 యుద్దాలు ఆపాను.. తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని నానా హడావుడి చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్దకాంక్ష ఎప్పటికప్పుడు ప్రస్పుటమవుతూనే ఉంది. ట్రంప్ రెండో సారి అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక అలజడికి కారణమవుతూనే ఉన్నారు. ఒక వైపు ఇరాన్‌ - అమెరికా యుద్దంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతూ, ప్రపంచ దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా మరో యుద్ధానికి సిద్ధమైందేమోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా క్యూబాపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో కరీబియన్ సముద్ర జలాల్లోకి తాజాగా యూఎస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ నిమిట్జ్ సారథ్యంలోని నావికాదళం ప్రవేశించడంతో ఆందోళన పతాకస్థాయికి చేరింది. విమానవాహక నౌక యూఎస్ఎస్ నిమిట్జ్‌తో పాటు, పలు యుద్ధ నౌకలు కరీబియన్ జలాల్లోకి ప్రవేశించినట్టు యూఎస్ సదరన్ కమాండ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో తదుపరి ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. క్యూబాపై చాలాకాలంగా దృష్టిపెట్టామని ట్రంప్ బుధవారం (మే 20న) పేర్కొన్నారు. క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోపై అమెరికా న్యాయశాఖ హత్యారోపణలతో కేసు దాఖలు చేసిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

1996లో అంతర్జాతీయ జలాల్లో రెండు విమానాలు కూలిన ఘటనలో పలువురు మరణించడంపై ట్రంప్ ప్రభుత్వం ఈ నేరారోపణ చేసింది. క్యూబా స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రకటన చేయడంతో కలకలం రేగుతోంది. ఇక క్యూబా చమురు ఎగుమతులకు చెక్ పెట్టేలా ఆ దేశాన్ని దిగ్బంధించడాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బుధవారం సమర్థించుకున్నారు. క్యూబా ప్రజల ఇక్కట్లకు అక్కడి ప్రభుత్వమే కారణమని అన్నారు. ఇక అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ జాన్ ర్యాట్‌క్లిఫ్ గతవారమే క్యూబా అధికారులతో సమావేశం సందర్భంగా పలు హెచ్చరికలు చేసినట్టు కూడా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరు దేశాల మధ్య డీల్ కుదుర్చుకునేందుకు ఎక్కువ సమయం లేదని ఆయన హెచ్చరించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

By
en-us Political News

  
నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 14 మంది విద్యార్థులకు మంత్రి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా విమాన ప్రయాణంతో కూడిన వైజాగ్, అరకు వ్యాలీ టూర్‌ను ఏర్పాటు చేశారు. ఫ్లైట్ టికెట్లు చేతిలో పడగానే విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఇద్దరు విదేశీయులు తమ లగేజ్ బ్యాగుల్లో గంజాయిని అత్యంత గుట్టుగా తరలించే ప్రయత్నం చేశారు. గంజా యిని చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి, వాటిని వ్యాక్యూమ్ సీల్ చేసి కస్టమ్స్ తనిఖీల్లో అనుమానం రాకుండా ప్లాన్ చేశారు.
కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (టి), పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల ప్రాంతాల్లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్‌ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. కేవలం ఈ ప్రాంతాల్లోనే కాకుండా, రాష్ట్రంలోని దాదాపు 16 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46.2 డిగ్రీల నుంచి 46.5 డిగ్రీల సెల్సియస్‌ మధ్య రికార్డవడం ప్రస్తుత పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
kohli reject to shake hand with travis head, contraversym ipl2026, sunrisers,rch, match
రన్ మెషీన్ గా పరుగుల సునామీ సృష్టించే విరాట్ కోహ్లీ.. వ్యక్తిగత స్కోరుతోనే కాకుండా, పార్టనర్ షిప్ లు నెలకొల్పడంలోనూ తనకు తానే సాటి అని ఈ రికార్డు ద్వారా నిరూపించుకున్నాడు.
దేశంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఏకంగా 270.82 గిగావాట్ల విద్యుత్ వాడకం నమోదింది. ఇది భారత విద్యుత్ రంగ చరిత్రలో కొత్త రికార్డు. ప్రభుత్వం ఈ వేసవి కాలానికి అంచనా వేసిన గరిష్ట డిమాండ్ 270 గిగావాట్లను కూడా ఈ రికార్డు దాటేసింది.
గుర్తు తెలియని వ్యక్తులు మధును దారుణంగా నరికి చంపారు. హత్య అనంతరం సాక్ష్యాలను తారుమారు చేసేందుకు శరీర భాగాలను గోనె సంచుల్లో గట్టిగా కట్టేశారు. ఆపై ఆ గోనె సంచులను సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్‌ కాల్వలో పడేశారు. కాల్వలో అనుమానాస్పదంగా పడి ఉన్న గోనె సంచులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అమెరికా డాలర్ రోజురోజుకూ బలోపేతం కావడం... యూఎస్ డెట్ సెక్యూరిటీలపై రాబడులు ఊహించని విధంగా పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి నుంచి తమ లాభాల స్వీకరణకు, అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు.
ప్రత్యేక బిహేవియర్ కోడ్ ఆఫ్ కండక్ట్.. అంటే పర్యాటకులతో మర్యాదగా ప్రవర్తించేలా ఒక ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక ప్రాంతాలకు వచ్చే కుటుంబాలు, ముఖ్యంగా మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనీ, మహిళా పర్యాటకులు ఎక్కడా అసౌకర్యానికి, వేధింపులకు గురికాకుండా కఠిన నిఘా ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ ఇంధన ధరల పెంపు తొలి సారి మే 15 న, ఆ తర్వాత వెంటనే మే 19 న రెండోసారి కూడా చమురు కంపెనీలు ధరలను పెంచాయి. ఇప్పుడు శనివారం జరిగిన తాజా పెంపుతో కలిపి గత 10 రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 5 రూపాయల మేర పెరిగాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 79 , అభిషేక్ శర్మ 22 బంతుల్లో 56 , హెన్రిచ్ క్లాసెన్ 24 బంతుల్లో 51 పరుగులతో చెలరేగారు. చివరిలో నితీశ్ కుమార్ రెడ్డి కూడా12 బంతుల్లో 29 నాటౌట్ తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో మార్మోగుతోంది.
రిజర్వేషన్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.