బీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్య

Publish Date:May 22, 2026

Advertisement

సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ ననాయకుడు చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యారు. మధు హత్య  స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఎర్కారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ..  ప్రజల్లో  గుర్తింపు తెచ్చుకున్న ఒ  నాయకుడి  హత్య స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు మధును దారుణంగా నరికి చంపారు. హత్య అనంతరం సాక్ష్యాలను తారుమారు చేసేందుకు  శరీర భాగాలను గోనె సంచుల్లో గట్టిగా కట్టేశారు. ఆపై  ఆ గోనె సంచులను సమీపంలోని ఎస్సారెస్పీ  కెనాల్‌ కాల్వలో పడేశారు. కాల్వలో అనుమానాస్పదంగా పడి ఉన్న గోనె సంచులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

సమాచారం అందుకున్న పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకుని,  కెనాల్ నుంచి ఆ గోనె సంచులను వెలికితీసి   బీఆర్‌ఎస్‌ నేత చింతలపాటి మధు మృతదేహ భాగాలుగా గుర్తించారు.  ఈ ఘోర క్రూరమైన హత్యకు సంబంధించి పోలీసులు  కేసు నమోదు చేసి, క్లూస్ టీమ్ సహాయంతో సంఘటనా స్థలంలో కీలక ఆధారాలను సేకరించారు.

ఈ దారుణ హత్యోదంతం తెలియగానే ఎర్కారం గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు, ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మధు అనుచరులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హంతకులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.  

By
en-us Political News

  
నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 14 మంది విద్యార్థులకు మంత్రి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా విమాన ప్రయాణంతో కూడిన వైజాగ్, అరకు వ్యాలీ టూర్‌ను ఏర్పాటు చేశారు. ఫ్లైట్ టికెట్లు చేతిలో పడగానే విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఇద్దరు విదేశీయులు తమ లగేజ్ బ్యాగుల్లో గంజాయిని అత్యంత గుట్టుగా తరలించే ప్రయత్నం చేశారు. గంజా యిని చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి, వాటిని వ్యాక్యూమ్ సీల్ చేసి కస్టమ్స్ తనిఖీల్లో అనుమానం రాకుండా ప్లాన్ చేశారు.
కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (టి), పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల ప్రాంతాల్లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్‌ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. కేవలం ఈ ప్రాంతాల్లోనే కాకుండా, రాష్ట్రంలోని దాదాపు 16 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46.2 డిగ్రీల నుంచి 46.5 డిగ్రీల సెల్సియస్‌ మధ్య రికార్డవడం ప్రస్తుత పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
kohli reject to shake hand with travis head, contraversym ipl2026, sunrisers,rch, match
రన్ మెషీన్ గా పరుగుల సునామీ సృష్టించే విరాట్ కోహ్లీ.. వ్యక్తిగత స్కోరుతోనే కాకుండా, పార్టనర్ షిప్ లు నెలకొల్పడంలోనూ తనకు తానే సాటి అని ఈ రికార్డు ద్వారా నిరూపించుకున్నాడు.
దేశంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఏకంగా 270.82 గిగావాట్ల విద్యుత్ వాడకం నమోదింది. ఇది భారత విద్యుత్ రంగ చరిత్రలో కొత్త రికార్డు. ప్రభుత్వం ఈ వేసవి కాలానికి అంచనా వేసిన గరిష్ట డిమాండ్ 270 గిగావాట్లను కూడా ఈ రికార్డు దాటేసింది.
అమెరికా డాలర్ రోజురోజుకూ బలోపేతం కావడం... యూఎస్ డెట్ సెక్యూరిటీలపై రాబడులు ఊహించని విధంగా పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి నుంచి తమ లాభాల స్వీకరణకు, అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు.
ప్రత్యేక బిహేవియర్ కోడ్ ఆఫ్ కండక్ట్.. అంటే పర్యాటకులతో మర్యాదగా ప్రవర్తించేలా ఒక ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక ప్రాంతాలకు వచ్చే కుటుంబాలు, ముఖ్యంగా మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనీ, మహిళా పర్యాటకులు ఎక్కడా అసౌకర్యానికి, వేధింపులకు గురికాకుండా కఠిన నిఘా ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ ఇంధన ధరల పెంపు తొలి సారి మే 15 న, ఆ తర్వాత వెంటనే మే 19 న రెండోసారి కూడా చమురు కంపెనీలు ధరలను పెంచాయి. ఇప్పుడు శనివారం జరిగిన తాజా పెంపుతో కలిపి గత 10 రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 5 రూపాయల మేర పెరిగాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 79 , అభిషేక్ శర్మ 22 బంతుల్లో 56 , హెన్రిచ్ క్లాసెన్ 24 బంతుల్లో 51 పరుగులతో చెలరేగారు. చివరిలో నితీశ్ కుమార్ రెడ్డి కూడా12 బంతుల్లో 29 నాటౌట్ తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో మార్మోగుతోంది.
రిజర్వేషన్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.