దిగొచ్చిన పసిడి ధరలు
Publish Date:May 22, 2026
Advertisement
దేశంలో పసిడి ధరలు గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతూ సరికొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హఠాత్తుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితులు, అంతర్జాతీయ పరిణామాలు, గ్లోబల్ మార్కెట్‌లో వస్తున్న మార్పుల వల్ల దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. అమెరికా డాలర్ రోజురోజుకూ బలోపేతం కావడం... యూఎస్ డెట్ సెక్యూరిటీలపై రాబడులు ఊహించని విధంగా పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి నుంచి తమ లాభాల స్వీకరణకు, అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆ ప్రభావం నేరుగా దేశీయ మార్కెట్లపై పడింది. గుడ్ రిటర్న్స్, బులియన్ మార్కెట్ వెబ్‌సైట్ సమాచారం మేరకు, హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నిన్నటి ముగింపుతో పోలిస్తే 980 రూపాయల మేర క్షీణించి 1,56,930లకు దిగివచ్చింది. అదే క్రమంలో, సాధారణ ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా 10 గ్రాములకు 900 రూపాయల మేర తగ్గి ప్రస్తుతం 1,43,850 వద్ద నిలిచాయి. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి కూడా భారీ పతనాన్ని నమోదు చేసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర ఏకంగా 15,000 రూపాయలు పతనమైంది.
http://www.teluguone.com/news/content/drop-in-gold-and-silver-prices-36-220625.html





