ఆర్సీబీపై సన్ రైజర్ విజయం.. అయినా మూడో స్థానానికే పరిమితం

Publish Date:May 22, 2026

Advertisement

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీపై అద్భుత విజయం సాధించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అయితే..  ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోవాలన్న సన్‌రైజర్స్ ఆశ నెరవేరలేదు. సమీకరణాల కారణంగా మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి  తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఇషాన్ కిషన్  46 బంతుల్లో 79 , అభిషేక్ శర్మ  22 బంతుల్లో 56 , హెన్రిచ్ క్లాసెన్ 24 బంతుల్లో 51 పరుగులతో చెలరేగారు.  చివరిలో నితీశ్ కుమార్ రెడ్డి  కూడా12 బంతుల్లో 29 నాటౌట్ తో  మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్  19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు తో 44 పరుగులు చేసి అద్భుత ఆరంభాన్నిచ్చాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 4.3 ఓవర్లకే జట్టు స్కోరును 60 పరుగులకు చేర్చాడు. అయితే, ఇషాన్ మలింగ బౌలింగ్‌లో అతను ఔటవ్వడంతో ఆర్సీబీ పరుగుల వేగానికి కళ్లెం పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 15 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ , 12 పరుగులకు దేవదత్ పడిక్కల్ కూడా పెవిలియన్ చేరడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. 

ఈ దశలో కెప్టెన్ రజత్ పటీదార్  39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 56 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. కృనాల్ పాండ్యతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా, అవసరమైన రన్‌రేట్ భారీగా పెరిగిపోవడంతో ఒత్తిడి పెరిగింది. పటీదార్ అర్ధశతకం పూర్తి చేసుకున్న తర్వాత ఔటయ్యాడు. చివరిలో కృనాల్ పాండ్య  41 నాటౌట్ , టిమ్ డేవిడ్  15 నాటౌట్ ధాటిగా ఆడినా..  ఫలితం లేకపోయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో మలింగ రెండు వికెట్లతో రాణించగా, సాకిబ్ హుస్సేన్, ట్రావిస్ హెడ్ చెరో వికెట్ పడగొట్టారు.

ఈ విజయంతో సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌లలో 9 విజయాలతో లీగ్ దశను ముగించింది. అయితే.. మూడో స్థానంలో నిలవడంతో ఈ నెల 27న ముల్లన్ పూర్ లో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిస్తే ఫైనల్ బెర్త్ కోసం క్వాలిఫయర్ 2లో తలపడుతుంది.

అటు..  ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ కూడా 14 మ్యాచ్ లలో 9 విజయాలు నమోదు చేశాయి. అయితే, మెరుగైన రన్ రేట్ కారణంగా ఆర్సీబీ తొలి స్థానంలో, గుజరాత్ రెండో స్థానంలో  నిలిచాయి. మూడు బెర్తులు స్టాండింగ్స్ తో సహా ఖరారైన నేపథ్యంలో..  నాలుగో బెర్తు కోసం రాజస్థాన్, పంజాబ్, కోల్ కతా, ఢిల్లీ జట్ల మధ్య పోటీ నెలకొంది. 

By
en-us Political News

  
అమెరికా డాలర్ రోజురోజుకూ బలోపేతం కావడం... యూఎస్ డెట్ సెక్యూరిటీలపై రాబడులు ఊహించని విధంగా పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి నుంచి తమ లాభాల స్వీకరణకు, అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు.
ప్రత్యేక బిహేవియర్ కోడ్ ఆఫ్ కండక్ట్.. అంటే పర్యాటకులతో మర్యాదగా ప్రవర్తించేలా ఒక ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక ప్రాంతాలకు వచ్చే కుటుంబాలు, ముఖ్యంగా మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనీ, మహిళా పర్యాటకులు ఎక్కడా అసౌకర్యానికి, వేధింపులకు గురికాకుండా కఠిన నిఘా ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ ఇంధన ధరల పెంపు తొలి సారి మే 15 న, ఆ తర్వాత వెంటనే మే 19 న రెండోసారి కూడా చమురు కంపెనీలు ధరలను పెంచాయి. ఇప్పుడు శనివారం జరిగిన తాజా పెంపుతో కలిపి గత 10 రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 5 రూపాయల మేర పెరిగాయి.
టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో మార్మోగుతోంది.
రిజర్వేషన్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.
రైతులను సేంద్రియ సాగువైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
సరికొత్త బైక్ కొనడం చాలా మందికి ఒక కల. అయితే ఆ కల కోసం ముప్పై ఏళ్లుగా నిరీక్షించి, వినూత్న రీతిలో దాన్ని సాకారం చేసుకున్నారు
చంద్ర‌బాబును చేర‌దీసింది రాజారెడ్డే అంటారు. వాళ్లు వాళ్లు ఒక‌ప్పుడు కాంగ్రెస్ లీడ‌ర్లే క‌దా? అలాంటి చంద్ర‌బాబు రాజారెడ్డిని హ‌త్య చేయించి ఉంటారా?
ఉప్పల్ స్టేడియంలో ఈరోజు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో టికెట్ల కోసం అభిమానులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
తెలంగాణ సచివాలయం వద్ద ఉధృత వాతావరణం నెలకొని ఉంది.
కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య బాధ్యతలు, హక్కులపై బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఒక అత్యంత కీలకమైన మరియు సంచలన తీర్పును వెలువరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.