పనికిమాలిన విషయాలు

Publish Date:Oct 17, 2022

Advertisement

అనగనగా ఓ బద్ధకిష్టి. బారెడు పొద్దెక్కాక లేవడం, తినడం, తిరగడం, రాత్రివేళకి పడుకోవడం.... ఇదే అతని దినచర్యగా ఉండేది. ఎప్పటిలాగే ఓ రోజు ఆ బద్ధకిష్టి సుష్టుగా తినేసి, అలా చల్లగాలికని చెరువుగట్టుకి చేరుకున్నాడు. ఆ చెరువుగట్టు మీద ఊసుపోక అటూఇటూ తిరగడం మొదలుపెట్టాడు. ఇంతలో అతనికి ఓ కపాలం కనిపించింది. దానిని చూసిన బద్ధకిష్టికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. దాని పక్కనే కూర్చుని నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. ఆ కపాలం తనని చూసి నవ్వినట్లు తోచింది. ‘ఎవరు నువ్వు? నీకు ఈ గతి ఎలా పట్టింది?’ అని అడిగాడు బద్ధకిష్టి.

 

‘జీవితాన్ని వృధా చేసుకుంటూ, పనికిమాలిన విషయాలను పట్టించుకోవడం వల్లే ఈ స్థితికి చేరుకున్నాను,’ అంది ఆ కపాలం. ఆ మాటలు విన్న బద్ధకిష్టికి ఎక్కడలేని ఆశ్చర్యం వేసింది. కపాలం మాట్లాడటం ఏమిటి? అందులోనూ తన పరిస్థితికి కారణం ఏమిటో చెప్పడం ఏమిటి? అనుకున్నాడు. వెంటనే ఈ విషయాన్ని ఎవరితోనన్నా పంచుకోవాలని అనిపించింది. కానీ ఎవరితో పంచుకుంటే బాగుంటుంది! అని తెగ ఆలోచించాడు. చివరికి ఏకంగా రాజుగారి దగ్గరకు వెళ్లే తను చూసిన విషయాన్ని చెప్పాలని నిశ్చయించుకున్నాడు. ఇంత చిత్రమైన విషయం అంతటి ప్రభువు దగ్గరకు చేరాల్సిందే అని బయల్దేరాడు.

 

అలా బద్ధకిష్టి రాజుగారి దగ్గరకు బయల్దేరాడు. ఓ రెండు రోజులు కాలినడకన రాజధానికి చేరుకుని, రాజదర్బారులోకి ప్రవేశించాడు. అక్కడ నిండు సభలో ఉన్న రాజుగారిని చూస్తూ తను మోసుకొచ్చిన వార్తని వినిపించాడు. ‘కపాలం ఏమిటి? మాట్లాడటం ఏమిటి? నీకుగానీ మతిపోయిందా!’ అని అడిగారు రాజుగారు. ‘లేదు ప్రభూ! కావాలంటే మీరే వచ్చి స్వయంగా చూడండి!’ అంటూ రెట్టించాడు బద్ధకిష్టి. బద్ధకిష్టి అంత గట్టిగా చెప్పడంతో రాజుగారిలో కూడా ఎక్కడలేని ఆసక్తి బయల్దేరింది. ఎక్కడో కథల్లో తప్ప తను కపాలం మాట్లాడటం గురించి విననే లేదయ్యే! అందుకే మందీమార్బలాన్ని వెంటతీసుకుని బద్ధకిష్టి వెంట బయల్దేరాడు. ఓ పూటంతా ప్రయాణించి వారు కపాలం ఉన్న చెరువుగట్టుకి చేరుకున్నారు.

 

ఆ కపాలం ఇంకా అక్కడే ఉంది. చిరునవ్వు నవ్వుతున్నట్లే ఉంది. ‘నేను ఈ దేశపు రాజుగారిని తీసుకువచ్చాను. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో ఈయనతో ఓసారి చెప్పు,’ అని అడిగాడు బద్ధకిష్టి. దానికి ఆ కపాలం నుంచి ఎలాంటి జవాబూ రాలేదు. మరోసారి, ఇంకోసారి.... అలా పదేపదే ఆ కపాలాన్ని ప్రశ్నించినా కూడా అది నిమ్మకుండిపోయింది. కపాలం మాట్లాడకపోయేసరికి, రాజుగారికి పట్టరాని ఆవేశం వచ్చింది. తమని నవ్వులపాలు చేయడానికే బద్ధకిష్టి ఈ పన్నాగం పన్నాడని ఆయన అనుకున్నారు. వెంటనే ‘వీడి శిరస్సుని ఖండించి ఆ కపాలం పక్కనే పడేయండి,’ అని ఆజ్ఞాపించి తన దారిన తాను చక్కా వెళ్లిపోయారు.

 

రాజుగారి ఆజ్ఞని భటులు నెరవేర్చారు. ఆ కపాలం పక్కనే బద్ధకిష్టి శిరస్సుని కూడా పడేసి వెళ్లిపోయారు. అంతా సద్దుమణిగిన తరువాత, అప్పుడు మాట్లాడింది కపాలం. ‘నా సంగతి సరే! ఇప్పుడు నీ సంగతి చెప్పు. నీకు ఈ గతి ఎలా పట్టింది?’ అంటూ బద్ధకిష్టి శిరస్సుని అడిగింది. దానికి బద్ధకిష్టి శిరస్సు ‘ఏముంది! జీవితాన్ని వృధా చేసుకుంటూ, పనికిమాలిన విషయాలను పట్టించుకోవడం వల్లే ఈ స్థితికి చేరుకున్నాను,’ అంటూ నిట్టూర్చింది.

 

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.

 

By
en-us Political News

  
పిల్లల పెంపకం అనేది ఒక బాధ్యతాయుతమైన ప్రయాణం. ముఖ్యంగా మగపిల్లలను పెంచేటప్పుడు తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సమాజంలో మగపిల్లల పెంపకానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉంటాయి....
గుండెపోటు లేదా హార్ట్ అటాక్ లక్షణాలు కనిపిస్తే అంబులెన్స్ వచ్చేలోపు ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలి? చేయవలసిన పనులు, చేయకూడని పొరపాట్లు మరియు CPR ప్రాముఖ్యత గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
రాత్రిపూట పాదాలలో తీవ్రమైన మంట, దురద మరియు చికాకు వేధిస్తున్నాయా? బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ వెనుక ఉన్న డయాబెటిస్, విటమిన్ లోపాలు మరియు ఇతర ఆరోగ్య కారణాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
వేడివేడి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉందా? 65 డిగ్రీల కంటే ఎక్కువ వేడి ఉన్న పానీయాలు అన్నవాహిక క్యాన్సర్‌కు ఎలా దారితీస్తాయో వైద్యుల హెచ్చరికలతో తెలుసుకోండి.
చిన్న పిల్లల నిద్ర వేళలు మరియు డేకేర్ కేంద్రాల నిబంధనల మధ్య సంబంధంపై తాజా పరిశోధనల విశేషాలు. వయస్సును బట్టి మారుతున్న పిల్లల నిద్ర అలవాట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
కార్డియోజెనిక్ షాక్ నిర్ధారణ మరియు చికిత్స తీరును మెరుగుపరచడానికి SCAI విడుదల చేసిన తాజా నిపుణుల మార్గదర్శకాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
సంవత్సరం పాటు నిల్వ ఉండే అచ్చమైన ఆంధ్ర స్టైల్ పులిహోర గోంగూర పచ్చడిని సులభంగా ఎలా తయారు చేయాలో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
పెంపుడు కుక్కలకు పచ్చి చికెన్ పెట్టడం వల్ల పక్షవాతం మరియు నరాల సంబంధిత APN వ్యాధి వచ్చే ప్రమాదం ఉందా? తాజా పరిశోధనల ప్రకారం కుక్కలకు పచ్చి మాంసం వల్ల కలిగే అనర్థాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకోండి.
కేవలం 15 నిమిషాల్లో ఇంట్లోనే ఎంతో సులభంగా, రుచిగా అటుకుల పాయసం తయారు చేసే విధానం గురించి తెలుసుకోండి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ హెల్దీ స్వీట్ రెసిపీ పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
దీపావళి స్పెషల్ గా కరకరలాడే పెసర గారెలు ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. నూనె పీల్చకుండా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే పర్ఫెక్ట్ పెసర వడల రెసిపీ ఇక్కడ ఉంది.
మన ఆరోగ్యానికి పెను సవాలుగా మారిన అనేక వ్యాధుల్లో క్యాన్సర్ ప్రధానమైనది. శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి రావచ్చు. కణాల పెరుగుదల అదుపు తప్పి, ఇతర అవయవాలకు వ్యాపించడమే ఈ సమస్యకు ముఖ్య కారణం...
అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రుచికరమైన పెసరపప్పు హల్వాను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
గ్రీన్ మటన్ కర్రీని పచ్చి మసాలాలు, పచ్చిమిర్చి మరియు కొబ్బరి పేస్ట్ తో అత్యంత రుచికరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.