మగపిల్లల పెంపకంలో చేయకూడని ఐదు పొరపాట్లు , తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి!

Publish Date:Nov 7, 2026

Advertisement

 

పిల్లల పెంపకం అనేది ఒక బాధ్యతాయుతమైన ప్రయాణం. ముఖ్యంగా మగపిల్లలను పెంచేటప్పుడు తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సమాజంలో మగపిల్లల పెంపకానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉంటాయి. అయితే కాలం మారుతున్న కొద్దీ పెంపకం పద్ధతుల్లో కూడా మార్పులు రావడం చాలా అవసరం.మగపిల్లలను కేవలం క్రమశిక్షణ పేరుతో కట్టడి చేయడం వల్ల వారి మానసిక వికాసం దెబ్బతినే అవకాశం ఉంది. పిల్లలు పూర్తీగా  ఎదగాలంటే వారిని అర్థం చేసుకుంటూ సరైన మార్గంలో నడిపించాలి. మగపిల్లల పెంపకంలో తల్లిదండ్రులు సాధారణంగా చేసే కొన్ని పొరపాట్లు ఏమిటి?  వాటిని ఎలా సరిదిద్దుకోవాలి?  వివరంగా తెలుసుకుంటే..

అల్లరిని ఆపకూడదు..


మగపిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు మొదటిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వారిని అల్లరి చేస్తున్నారని ఎప్పుడూ ఆపకూడదు. పిల్లలు అల్లరి చేయడం వారి మెదడు ఎదుగుదలలో ఒక భాగం. వారు ఆటలాడుకుంటూ, ఇళ్లంతా తిరుగుతూ చేసే అల్లరి వారి శారీరక , మానసిక చురుకుదనాన్ని పెంచుతుంది. ప్రతి చిన్న విషయానికి వారిని అరిచి, భయపెట్టడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే పిల్లల సహజమైన అల్లరిని కొంతవరకు అర్థం చేసుకుని, దాన్ని సరైన పద్ధతిలో మళ్లించాలి.


రోజంతా ఇంట్లోనే ఖాళీగా కూర్చోబెట్టడం..

పిల్లలను రోజూ ఆరుబయట ఆటలాడడానికి పంపాలి. వారి బ్రెయిన్ డెవలప్‌మెంట్ కి ఆటలు చాలా అవసరం. ప్లే గ్రౌండ్ లో  ఆడుకోవడం వల్ల పిల్లలలో సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయి. తోటి పిల్లలతో కలిసిమెలిసి తిరగడం, టీమ్ స్పిరిట్ నేర్చుకోవడం వంటివి ఆటల ద్వారానే సాధ్యమవుతాయి. ఇంట్లోనే మొబైల్స్ లేదా వీడియో గేమ్స్‌కి పరిమితం చేయకుండా శారీరక శ్రమ ఉండే ఆటలను ప్రోత్సహించాలి.

ఏడవద్దని చెప్పడం..

మగపిల్లలకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. వారు బాధగా ఉన్నప్పుడు, కష్టంగా అనిపించినప్పుడు ఏడవడం సహజం. అలాంటప్పుడు వారి భావాలను అణచివేయడం వల్ల భవిష్యత్తులో వారు తమ భావాలను బయటపడలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. మగపిల్లలు ఏడవకూడదు.. లాంటి మాటలు అస్సలు చెప్పకూడదు.  వారి బాధను బయటకు వ్యక్తం చేయడానికి స్వేచ్ఛనివ్వాలి. అప్పుడే వారు మానసికంగా దృఢంగా ఎదుగుతారు.


ప్రయత్నాలకు ప్రోత్సాహం..

భయం వల్ల పిల్లలను ప్రతి చిన్న విషయానికి కట్టడి చేస్తుంటారు. అయితే సురక్షితమైన హద్దుల్లో ఉంచుతూనే పిల్లలు చేయాలకునే పనులకు,  కొత్త ప్రయత్నాలకు   వారిని ప్రోత్సహించాలి. ఇలాంటి చిన్న సాహసాలు చేయడం వల్ల పిల్లల్లో ధైర్యం పెరుగుతుంది , భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తి వస్తుంది.


తండ్రి ప్రవర్తన..

పిల్లలు ముఖ్యంగా మగపిల్లలు తమ తండ్రిని ఆదర్శంగా తీసుకుంటారు. తండ్రి ఇంటా బయటా ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఇతరులను ఎలా గౌరవిస్తున్నాడు అనే అంశాలను పిల్లలు నిశితంగా గమనిస్తుంటారు. పిల్లలు తండ్రిని చూసి ప్రవర్తన నేర్చుకుంటారు కాబట్టి ఇంట్లో పెద్దల ప్రవర్తన ఎప్పుడూ ఆదర్శప్రాయంగా ఉండాలి.

మొత్తంగా చెప్పాలంటే మగపిల్లల పెంపకం కేవలం నియంత్రణతో కూడుకున్నది కాకుండా, ప్రేమతో, అవగాహనతో సాగాలి. వారి ఆలోచనలను గౌరవిస్తూ, సరైన మార్గదర్శకత్వం అందించినప్పుడే వారు మంచి పౌరులుగా ఎదుగుతారు. తల్లిదండ్రులు ఈ చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ వహిస్తే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడం చాలా సులభం అవుతుంది.

                                *రూపశ్రీ.

By
en-us Political News

  
గుండెపోటు లేదా హార్ట్ అటాక్ లక్షణాలు కనిపిస్తే అంబులెన్స్ వచ్చేలోపు ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలి? చేయవలసిన పనులు, చేయకూడని పొరపాట్లు మరియు CPR ప్రాముఖ్యత గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
రాత్రిపూట పాదాలలో తీవ్రమైన మంట, దురద మరియు చికాకు వేధిస్తున్నాయా? బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ వెనుక ఉన్న డయాబెటిస్, విటమిన్ లోపాలు మరియు ఇతర ఆరోగ్య కారణాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
వేడివేడి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉందా? 65 డిగ్రీల కంటే ఎక్కువ వేడి ఉన్న పానీయాలు అన్నవాహిక క్యాన్సర్‌కు ఎలా దారితీస్తాయో వైద్యుల హెచ్చరికలతో తెలుసుకోండి.
చిన్న పిల్లల నిద్ర వేళలు మరియు డేకేర్ కేంద్రాల నిబంధనల మధ్య సంబంధంపై తాజా పరిశోధనల విశేషాలు. వయస్సును బట్టి మారుతున్న పిల్లల నిద్ర అలవాట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
కార్డియోజెనిక్ షాక్ నిర్ధారణ మరియు చికిత్స తీరును మెరుగుపరచడానికి SCAI విడుదల చేసిన తాజా నిపుణుల మార్గదర్శకాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
సంవత్సరం పాటు నిల్వ ఉండే అచ్చమైన ఆంధ్ర స్టైల్ పులిహోర గోంగూర పచ్చడిని సులభంగా ఎలా తయారు చేయాలో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
పెంపుడు కుక్కలకు పచ్చి చికెన్ పెట్టడం వల్ల పక్షవాతం మరియు నరాల సంబంధిత APN వ్యాధి వచ్చే ప్రమాదం ఉందా? తాజా పరిశోధనల ప్రకారం కుక్కలకు పచ్చి మాంసం వల్ల కలిగే అనర్థాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకోండి.
కేవలం 15 నిమిషాల్లో ఇంట్లోనే ఎంతో సులభంగా, రుచిగా అటుకుల పాయసం తయారు చేసే విధానం గురించి తెలుసుకోండి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ హెల్దీ స్వీట్ రెసిపీ పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
దీపావళి స్పెషల్ గా కరకరలాడే పెసర గారెలు ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. నూనె పీల్చకుండా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే పర్ఫెక్ట్ పెసర వడల రెసిపీ ఇక్కడ ఉంది.
మన ఆరోగ్యానికి పెను సవాలుగా మారిన అనేక వ్యాధుల్లో క్యాన్సర్ ప్రధానమైనది. శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి రావచ్చు. కణాల పెరుగుదల అదుపు తప్పి, ఇతర అవయవాలకు వ్యాపించడమే ఈ సమస్యకు ముఖ్య కారణం...
అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రుచికరమైన పెసరపప్పు హల్వాను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
గ్రీన్ మటన్ కర్రీని పచ్చి మసాలాలు, పచ్చిమిర్చి మరియు కొబ్బరి పేస్ట్ తో అత్యంత రుచికరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
దీపావళిలో టపాసులు పేలేటప్పుడు కంటికి గాయాలైతే తీసుకోవాల్సిన అత్యవసర జాగ్రత్తలు మరియు ప్రథమ చికిత్స గురించి తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.