యుద్దం ఆపేయండి ...అమెరికాకు చైనా కండీషన్

Publish Date:Mar 16, 2026

Advertisement

 

హోర్ముజ్ జలసంధిలో ఇంధన నౌకల రవాణాపై ఇరాన్ ఆంక్షలతో అమెరికా తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఆ క్రమంలో హోర్ముజ్ జలసంధిని రక్షించుకునేందుకు, ఇంధన రవాణాను క్రమబద్ధీకరించేందుకు ముందుకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపునకు చైనా స్పందించింది. హోర్ముజ్ రక్షణ కోసం ముందుకు వస్తామని, అయితే ముందుగా పశ్చిమాసియాలో సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని చైనా షరతు పెట్టింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. 

పశ్చిమాసియాలో ఘర్షణల వల్ల అంతర్జాతీయ ఇంధన ప్రవాహం, ప్రాంతీయ శాంతి, స్థిరత్వం దెబ్బతింటున్నాయని లిన్ జియాన్ అన్నారు. ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అమెరికాకు ఆయన సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణలు ఆగితేనే ప్రాంతీయ స్థిరత్వం సాధ్యమవుతుందని అన్నారు. మార్చి నెల చివర్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటించాల్సి ఉంది. ప్రస్తుతం ట్రంప్ బీజింగ్ పర్యటన గురించి అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని లిన్ జియాన్ అన్నారు. 

ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో ట్రంప్ పర్యటన కీలకం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా పర్యటన గురించి ట్రంప్ తాజాగా మాట్లాడుతూ.. హోర్ముజ్ జలసంధి రక్షణ విషయంలో చైనా సమాధానాన్ని బట్టి తన పర్యటన షెడ్యూల్ ప్రకారం ఉంటుందా.. వాయిదా పడుతుందా అనే విషయంలో నిర్ణయం తీసుకుంటానన్నారు.
 

By
en-us Political News

  
రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్‌గా కూడా ఎదుగుతుంది.
హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది.
తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె పేరిట ఉన్న స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చిక్కుల్లో పడ్డాడు.
తీవ్ర ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఏర్పడిన ఇంధన కొరత నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఆధునికి సాంకేతిక యుద్దాల్లో కీలక పాత్ర పోషించ ఆత్మాహుతి డ్రోన్లు భారత్ ఆర్మీ అమ్ములపొదిలో చేరాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాను అరెస్ట్ చేసేందుకు అస్సాం పోలీసులు హైదరాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం.
పచ్చటి రుషికొండకు బోడి గుండు కొట్టి మరీ నిర్మించిన ఈ విలాలవంతమైన భవనాన్ని ఎలా వినియోగించుకోవాలన్న విషయంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ సబ్ కమిటీ తాజాగా భేటీ అయ్యింది. ఈ భేటీలో విశాఖపట్నంలోని వివాదాస్పద రుషికొండ ప్యాలెస్ ను కేవలం ఎగ్జిబిషన్ లా కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే విధంగా తీర్చిదిద్దాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల బలోపేతానికి, ఉన్నత విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్ననేపథ్యంలో హుర్ముజ్ ప్రావిన్స్‌ సమీపంలోని సరిహద్దుల వద్ద ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు తమ దేశ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన అమెరికాకు చెందిన మానవరహిత నిఘా విమానాన్ని ( గుర్తించి, తక్షణమే కూల్చివేసాయి. అందుకు సంబంధించి ఆ విమాన శిధిలాల ఫుటేజీని ఇరాన్ అధికారికంగా విడుదల చేయడంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. గత కొంతకాలంగా అమెరికా ఇరాన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే.
మద్యం కుంభకోణం కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల ప్రజలకు తమిళనాడుతో విడదీయలేని సంబంధం ఉంది. ఉదయం లేచింది మొదలు పాలు, కూరగాయల వ్యాపారం నుంచి షాపింగ్ వరకు అంతా తమిళనాడు పట్టణాలతోనే ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ నిరంతర తనిఖీలు సామాన్యుడిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.