తీవ్ర ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఏర్పడిన ఇంధన కొరత నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ‘స్మార్ట్ లాక్‌డౌన్’ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నిర్ణయం ప్రకారం ఇవాళ్టి నుంచి షాపింగ్ మాల్స్ రాత్రి 8 గంటలకే మూసివేయాల్సి ఉంటుంది. బేకరీలు, రెస్టారెంట్లు, దాబాలు, ఫంక్షన్ హాళ్లు రాత్రి 10 గంటలలోపు కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ పరిమితులు పంజాబ్, ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్, గిల్గిత్-బాల్టిస్తాన్, పీవోకే ప్రాంతాల్లో అమలులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో, పెరుగుతున్న ఖర్చులను నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lockdown-in-pakistan-36-216869.html
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం జలవిహార్ వద్ద ఉన్న నీటి సరఫరా ఆర్వో ప్లాంట్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది.
మాములుగా దక్షిణాదిలో అత్యంత సంపన్న పొలిటీషియన్లలో విజయ్ కూడా ఒకరు.
20వ శతాబ్దం మధ్య నుంచి 21వ శతాబ్దం వరకు ప్రపంచ రాజకీయాల్లో ఒక నిరంతర ప్రభావశక్తిగా నిలిచింది అమెరికా.
ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత విషయంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మౌనంగానే ఉండిపోయి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఎందుకంటే.. అమరావతిని రాజధానిగా జగన్ వ్యతిరేకిస్తున్నారు కనుక. సపోజ్ ఫర్ సపోజ్ రేపు ఆయన అధికారంలోకి వస్తే అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిపై ప్రతీకార చర్యలకు దిగుతారన్న భయమే అందుకు కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కేరళ నుంచి కర్ణాటకకు వచ్చి ట్రెక్కింగ్ చేస్తూ తప్పిపోయిన జీఎస్ శరణ్య మిస్టరీలో నిజమెంత?
కృత్రిమ మేధ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ సంస్థ ఇప్పుడు ఉద్యోగ విధానాల్లోనూ సంచలన మార్పులకు తెరలేపుతోంది.
ఆర్‌ఆర్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
చిన్నపాటి సెలూన్ నడుపుకుంటూ జీవనం సాగించే ఒక సామాన్యుడికి జీఎస్టీ అధికారులు కళ్లు బైర్లు కమ్మే షాక్ ఇచ్చారు.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,53,820 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,41,000 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,15,370 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ రోజు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ వెండిపై పది వేలు పెరిగి 2,65,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు వారాల సమయంలో శాంతి చర్చలు కూడా జరగనున్నాయి. ఇరాన్ కూడా ఈ తాత్కాలిక ఒప్పందానికి అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.