బేగంపేటలో 145 ఏళ్ల వారసత్వం కట్టడం కూల్చివేత!

Publish Date:Apr 7, 2026

Advertisement

 

హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది. ఒకప్పుడు రాజసంతో మెరిసిన ఈ చారిత్రక భవనం ఇప్పుడు కూల్చివేత శబ్దాలతో కంపిస్తోంది. తెలంగాణలోని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ గ్రేడ్–II రక్షిత రాజభవనాన్ని ఒక నిర్మాణ సంస్థ కార్యాలయం కోసం కూల్చివేస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ విషయం బయటపడటంతో వారసత్వ పరిరక్షణపై తీవ్ర చర్చ మొదలైంది.పైగాహ్ వంశానికి చెందిన ఒబైద్ ఉర్ రెహ్మాన్ ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు.

 పాలిస్ లోని ఒక భాగంలో నివసిస్తున్న రెహ్మన్ మాట్లాడుతూ... శనివారం రోజు ఒక నిర్మాణ సంస్థ కార్యాలయం కోసం బేగంపేట్ లోని 145 సంవత్సరాల చరిత్ర గల చిరాన్ ఫోర్డ్ క్లబ్  భవనంలోని పలు నిర్మాణాలను తొలగిస్తూ స్థలం ఖాళీ చేసే పనులు వేగంగా సాగాయని తెలిపారు. “చిరాన్ ప్యాలెస్ తలుపులు ఇప్పటికే తీసేశారు… త్వరలో మొత్తం భవనం నేలమట్టం కావచ్చు,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.1980ల నుంచి నగర ప్రముఖులకు వినోద కేంద్రంగా ఉన్న క్లబ్ ప్రస్తుతం మూసివేయబడిందని తెలిపారు. ఒకప్పుడు చరిత్రను మోసు కొచ్చిన ఈ భవనం భవిష్యత్తు ఏమవుతుందన్న ప్రశ్న ఇప్పుడు నగరవాసుల ముందుంది.

By
en-us Political News

  
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల విధ్వంసం సృష్టించారు.
హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా మధ్య విభేదాలు పొడసూపినట్లు మైదానంలో దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన మరియు సీట్ల పెంపు అంశంపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజుకుంది.
ఆదివాసీ, గిరిజ‌న ,ఏజెన్సీ ప్రాంతాల స‌మ‌గ్ర అభివృద్ధికి అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.
బంగ్లాదేశ్‌లో మరోసారి మతపరమైన ఉద్రిక్తతలు హింసాత్మక రూపం దాల్చాయి.
ఏప్రిల్ 13, 1919 — భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో శాశ్వతంగా చెక్కుకుపోయిన నల్లరోజు.
దేశ అంతర్గత భద్రతకు సవాల్ విసురుతున్న ఒక భారీ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను జమ్మూ కశ్మీర్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు.
గ్యాస్ బ్లాక్ మార్కెట్ దందాపై తెలంగాణ సివిల్ సప్లైస్ శాఖ భారీ స్థాయిలో ఆపరేషన్ ప్రారంభించింది.
రెండవ విడత అన్నక్యాంటీన్లను ఈ నెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు పెదకూరపాడు నియోజకవర్గం, ధరణికోటలో ప్రారంభిస్తారు
దేశంలో మహిళలకు రాజకీయ హక్కులు మొట్టమొదట కల్పించిందే కాంగ్రెస్‌ పార్టీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి అనుమతుల ప్రక్రియను మరింత సరళీకరించాల్సిందిగా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు
ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.
టి20చరిత్రలోనే ముంబై ఇండియన్స్‌పై 1,000 పరుగుల మార్కును చేరుకున్న మొట్టమొదటి బ్యాటర్‌గా విరాట్ రికార్డు పుటల్లోకెక్కారు. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా తన బ్యాట్‌తో పరుగుల వరద పారించడం తనకు అలవాటేనని ఈ ఘనతతో మరోసారి నిరూపించుకున్నాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.