వాలెంటైన్ వీక్.. కొండంత భరోసా ఇవ్వగలిగేది ఆత్మీయ కౌగిలింత..!

Publish Date:Feb 12, 2025

Advertisement

 

కౌగిలి అనే పదానికి చాలా రకాల అర్థాలు చెబుతుంటారు.  చూసే దృష్టిని బట్టి అర్థం మారుతుంది అంటారు. అలాగే ప్రతి విషయంలోనూ రెండు కోణాలు ఉంటాయి.  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వాలెంటైన్స్ వీక్ హవా కొనసాగుతోంది. ఈ వాలెంటైన్స్ వీక్ అందరికీ సంబంధించినదే అయినా స్పెషల్ గా ప్రేమికులు ప్రాముఖ్యత ఇస్తారు.  వాలెంటైన్స్ వీక్ లో హగ్ డే కూడా ఒకటి.  ఈ రోజును ఆరోగ్యకరంగా ఎలా జరుపుకోవాలంటే..

హగ్ చేసుకోవడం పరిస్థితిని బట్టి అర్థాలు ఇస్తుంది. కానీ ఒక అమ్మాయి, అబ్బాయి హగ్ చేసుకుంటారు అంటే చూట్టూ ఉన్న అందరి కళ్లు నానా రకాలుగా అర్థాలు వెతుక్కుంటాయి.  ఇష్టపడిన ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కౌగిలించుకోవడం అంటే.. వారి మధ్య ఉండే అపార్థాలు, దాపరికాలు చెరిపేసుకోవడమే.. వాలెంటైన్ వీక్ ను ఎంతో సంబంరంగా జరుపుకునే ప్రేమికులు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

ప్రేమించిన వ్యక్తిని తన సొంతం అనుకుని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అంత మాత్రం చేత ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు.  అందులో ఇంకా పెళ్లి చేసుకోకుండా ప్రేమ పేరుతో తొందర పడకూడదు.

ప్రేమించిన అమ్మాయిని ఈ వాలెంటైన్స్ వీక్ లో భాగంగా  కౌగిలించుకోవడానికి ముందు అమ్మాయి అనుమతి తప్పక తీసుకోవాలి. అమ్మాయికి ఇష్టం లేకుండా ఈ స్టెప్ వేయకూడదు.  

ప్రేమికుల జంట  ఏదైనా పని చేసే ముందు సమాజాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.  పబ్లిక్ లో ఎలాంటి  పనులు చేయకూడదు.  సమాజం పట్ల భాద్యగా ఉండాలి.

కౌగిలి..

కౌగిలి అనేది కేవలం ప్రేమికుల మధ్య మాత్రమే కాదు.. వాలెంటైన్స్ వీక్ ఎలాగైతే ఇష్టమైన వారితో ఎలాంటి సంబంధం ఉన్నవారితో అయినా ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోవచ్చో.. హగ్ డే కూడా అలాగే జరుపుకోవచ్చు. తల్లిదండ్రులు, స్నేహితులు, తోడబుట్టిన వారు..ఆత్మీయులు,  కష్టాలలో తోడుగా నిలిచేవారు,  మంచి దారి చూపించేవారు..ఇలా ఎవరిని అయినా మనసుకు దగ్గరా చేసుకుని ఆత్మీయంగా ఒక కౌగిలింత ద్వారా కొండంత భరోసాను ఇద్దరి బంధంలో నింపుకోవచ్చు.


                                  *రూపశ్రీ.

By
en-us Political News

  
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి...
ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి...
ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లల పెళ్లిని కళ్లారా చూడాలని, ఆ వేడుకలో భాగం కావాలని ఒక పెద్ద కల ఉంటుంది. కానీ, ఒక రోజు మీ పిల్లలు "నాకు ఇప్పుడే పెళ్లి వద్దు" లేదా "నేను పెళ్లికి రెడీగా లేను" అని చెబితే, ఆ మాట వినగానే మనసు ముక్కలవుతుంది. కోపం, బాధ, ఆందోళన కలగడం సహజం...
ఆదివారం అనే మాట వినగానే మన ముఖాల్లో సంతోషకరమైన చిరునవ్వు వస్తుంది. ఇది కుటుంబంతో సమయం గడపడానికి,  పని నుండి విరామం తీసుకోవడానికి కేటాయించబడిన రోజుగా పరిగణిస్తారు...
వేగంగా మారుతున్న  జీవనశైలి,  డిజిటల్ యుగంలో పేరెంటింగ్ పద్ధతులు కూడా మారుతున్నాయి. అలాంటి ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు చాలా చర్చించబడుతోంది...
పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందం కాదు; అది రెండు కుటుంబాల కలయిక, రెండు జీవితాల మేళవింపు. కానీ నేటి కాలంలో సంబంధం చూసేటప్పుడు మనం కేవలం ఆస్తులు, అంతస్తులు లేదా...
ఏ బంధం అయినా నిలబడటానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం. అందులో భార్యాభర్తల బంధం మరీ సున్నితమైనది. కానీ ఆ బంధాన్ని ఎంత దృఢంగా మార్చుకుంటారు అనేదే ఇక్కడ ముఖ్యం.  భార్యాభర్తల బంధం బలంగా మారడానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం...
నేటి కాలంలో ప్రజల ఉద్దేశాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. బయటకు ఒకటి చెబుతారు, కానీ తరువాత వారు చేసేది మరొకటి ఉంటుంది. దీని వలన ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం కష్టమవుతుంది...
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు...
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు...
తల్లిదండ్రులు పిల్లలు ఎంత పెద్దైనా వారు చిన్నవారిగానే కనిపిస్తారు అని  అంటుంటారు.  కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు,  పిల్లల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి   అతిపెద్ద కారణం  చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.