Publish Date:Mar 23, 2026
పసిడి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. యుద్ధ భయాలు, అంతర్జాతీయ రాజకీయాలు పసిడి మార్కెట్ చిగురుటాకులా వణికించేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటన తరువాత కూడా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సడలక పోవడంతో బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా ఆకాశానికి ఎగిశాయి. సోమవారం (మార్చి 23) ఒక్కరోజే బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగి పతనమయ్యాయి. హమ్మయ్యా అనుకునేలోగానే మళ్లీ ధరలకు రెక్కలు వచ్చాయి.
ఈ పరిణామాలు ఇటు వినియోగదారులను, అటు ఇన్వెస్టర్లను కూడా తీవ్ర గందరగొళంలో పడేశాయి. సోమవారం (మార్చి 23) ఉదయం యుద్ధ భయాలతో ఇన్వెస్టర్లు డాలర్ వైపు మొగ్గు చేపడంతో పసిడి ధరలు పతనమయ్యాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఉదయం 10 10 గ్రాముల బంగారం ధర రూ.1.36 లక్షలకు పడిపోయింది. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయని అంతా భావించారు. సాయంత్రానికి సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ఇరాన్‌పై యుద్ధానికి ట్రంప్ ఐదు రోజుల విరామం ప్రకటించగానే బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. సోమవారం రాత్రి 10 గ్రాముల బంగారం ధర తిరిగి రూ.1.46 లక్షలకు పెరిగింది. గంటల వ్యవధిలోనే పసిడి ధర ఏకంగా పదివేల రూపాయలు పెరిగింది. వెండి కూడా ఇదే దారిలో పయనించి కిలో రూ.2.32 లక్షల వద్ద స్థిరపడింది.
సాధారణంగా యుద్ధ భయాలు తగ్గితే ముడి చమురు ధరలు పడిపోతాయి, బంగారం ధరలు స్థిరపడతాయి. ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు పతనమైనా, బంగారం ధర మాత్రం పెరగడం విస్మయపరుస్తోంది. అయితే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ప్రధాన కారణం అనిశ్చితేనని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. యుద్ధ విరమణ తాత్కాలికమేననీ, ద్రవ్యోల్బణ భయాలు ఇంకా కొనసాగుతున్నాయనీ ఇన్వెస్టర్లు భావించడంతో బంగారం మాత్రమే సురక్షితమైన ఇన్వెస్ట్ మెంట్ అని భావిస్తున్నారు.
వారి భయాలకు తగ్గట్టుగానే ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటన తరువాత కూడా ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు ఇంకా తొలగిపోలేదనడానికి ఇదే తార్కానం. ఈ నేపథ్యంలో మంగళవారం (మార్చి 24) కూడా బులియన్ మార్కెట్ ఒడిదుడుకులకు లోను కావడం ధరలు పెరగడం ఖాయమని భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gold-prices-raise-again-36-216032.html
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,53,820 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,41,000 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,15,370 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ రోజు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ వెండిపై పది వేలు పెరిగి 2,65,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు వారాల సమయంలో శాంతి చర్చలు కూడా జరగనున్నాయి. ఇరాన్ కూడా ఈ తాత్కాలిక ఒప్పందానికి అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
ఓ గర్భిణీని అంబులెన్స్ లో తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆ గర్భిణికి 108 సిబ్బంది సమయస్ఫూర్తితో అంబులెన్స్ లోనే కాన్పు చేసి తల్లి బిడ్డలను సురక్షితంగా కాపాడారు.
గచ్చిబౌలి మంగళ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి అనే యువకుడు వ్యాపారం చేస్తున్నాడు. ఈనెల 12వ తేదీన వెంకట కృష్ణ డెస్టినేషన్ మ్యారేజ్ జరగనుంది. ఒకవైపు అంగరంగ వైభవంగా వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వివాహ ఏర్పాట్ల కోసం వెంకట కృష్ణ 20 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.
విమానాశ్రయంలో సాధారణ భద్రతా తనిఖీల సమయం లో స్కానింగ్‌లో బుల్లెట్లు బయటపడటంతో అధికా రులు వెంటనే అప్రమత్తమ య్యారు. ఆయుధాలకు సంబంధించిన సరైన అను మతులు, పత్రాలు చూపించ లేకపోవడంతో సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకు న్నారు.
పోలీసులు కథనం ప్రకారం సికింద్రాబాద్ బేగంపేటలోని ఒక ట్రైనింగ్ సంస్థకు పైలట్ కోర్సు కోసం వచ్చిన యువ తిని ట్రైనర్ నసిముద్దీన్ మాయ మాటలతో నమ్మించాడు. ట్రైనింగ్‌లో సహాయం చేస్తానని చెప్పి యువతిని తన వశం చేసు కున్నాడు. అనంతరం పలు మార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పును ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తదితరులు ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే.
సైదా బేగం మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా బాధ్యత తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇలా సైదా బేగం ద్వారా మహిళ లను రిక్రూట్ చేసేలా చేయడమే ఉగ్రవా దుల టార్గెట్.. ఇప్పటివరకు సుమారు 42 మంది యువ తులను సైదా బేగం రిక్రూట్ చేసినట్లుగా ప్రాథమిక ఆధారాలు లభించాయి.
ఈ డీల్ వెనుక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌ల దౌత్యం ఉంది. ఇరాన్‌కు ఇచ్చిన గడువు ముగియడానికి గంటల ముందు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా యుద్ధ విరామం ప్రకటన చేశారు.
డోనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న దూకుడు రాజకీయాలు, ఇతర దేశాలపై హేతురహితంగా ప్రకటించిన టాక్స్ వార్ కారణంగా ప్రపంచ దేశాలలో అమెరికా తన పరపతిని వేగంగా కోల్పోతున్నది. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ట్రంప్ అహంకారమే కారణమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ఇరాన్ పై అమెరికా దాడులు, దాని పర్యవశానాల కారణంగా అమెరికా ఆర్థిక విశ్వసనీయత ప్రశ్నార్థకమైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
షూటింగ్ ఖరీదైన క్రీడ.. ఒక మధ్యతరగతి యువకుడు ఆ రంగంలో అడుగుపెట్టడమే గొప్ప అనుకుంటే.. అక్కడితో ఆగకుండా భారత కీర్తి పతాకను ప్రపంచ దేశాలలో రెపరెపలాడిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించి దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాడు.
తాడేపల్లి, ఉండవల్లితో పాటు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ సోదాల్లో విశాఖపట్నం ఎండాడలో ఒక విలాసవంతమైన ఫ్లాట్, తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో జీప్లస్ 2 భవనాన్ని గుర్తించారు. వీటితో పాటు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులు, రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో మరో రూ.3 లక్షలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం ఉన్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.