హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ కీలక ప్రకటన
Publish Date:Apr 8, 2026
Advertisement
అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో రెండు వారాల గడువు ఇచ్చారు. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు వారాల సమయంలో శాంతి చర్చలు కూడా జరగనున్నాయి. ఇరాన్ కూడా ఈ తాత్కాలిక ఒప్పందానికి అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌కు ఇచ్చిన గడువును పొడిగించాలన్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదనను అంగీకరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు 'ట్రూత్' ద్వారా ట్రంప్ వెల్లడించారు. పాక్ ప్రధాని షరీఫ్, ఫీల్డ్ మార్షల్ మునీర్‌తో మాట్లాడాననీ, వారి వినతి మేరకు ఇరాన్‌కు ఇచ్చిన గడువును పొడిగించి, దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే హోర్ముజ్ జలసంధిని తెరవాలనే షరుతుకు లోబడి ఈ రెండు వారాల గడువుకు, కాల్పుల విరమణకు అంగీకరించానని ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాల వైపు నుంచి ఈ కాల్పుల విరమణ ఉంటుందని పేర్కొన్న ట్రంప్.. ఇరాన్ పది సూత్రాలతో పంపిన ప్రతిపాదన బాగుందని చెప్పారు. ఈ రెండు వారాల సమయంలో ఇరాన్‌తో శాంతి చర్చలు జరుగుతాయన్నారు. ఇరాన్‌తో శాశ్వాత ఒప్పందానికి, పశ్చిమాసియాలో ప్రశాంతతను నెలకొల్పడానికి ఈ రెండు వారాల గడువు ఉపయో గపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం త్వరలోనే దొరకబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
http://www.teluguone.com/news/content/trump-key-announcement-36-216928.html





