శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ల కలకలం
Publish Date:Mar 23, 2026
Advertisement
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద బుల్లెట్ల కలకలం రేగింది. శంషాబాద్ నుంచి కేరళలోని కన్నూర్‌కు వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద రెండు లైవ్ బుల్లెట్లు బయటపడ టంతో అప్రమత్తమైన జిఎంఆర్ స్క్రీనింగ్ సిబ్బంది అతడిని అదుపులోనికి తీసుకున్నారు. సెక్యూరిటీ చెకింగ్ సమయం లో స్కానింగ్‌లో అనుమా నాస్పద వస్తువులు కనిపిం చడంతో ప్రయాణికుడిని నిలిపివేసి తనిఖీ చేయగా రెండు లైవ్ బుల్లెట్లు లభ్యమయ్యాయి. దీంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అవుట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు ప్రయాణికుడిని విచారిస్తున్నారు. ఈ బుల్లెట్లు అతడి వద్దకు ఎలా వచ్చాయి? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనతో ఎయిర్‌పోర్ట్‌లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
http://www.teluguone.com/news/content/bullets-at-shamshabad-airport-36-216033.html





