డాలర్ పతనం.. అమెరికా అగ్రహోదాకు గండం?

Publish Date:Apr 8, 2026

Advertisement

అమెరికా అగ్రరాజ్య హోదాను వేగంగా కోల్పోతోందా? ఆ దేశానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పట్టు ఏర్పడడానికి కారణమైన డాలర్ పతనం.. అమెరికా ప్రాభవాన్ని దెబ్బతీస్తోందా? అంటే.. ప్రపంచ ఆర్థిక నిపుణుల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది.  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న దూకుడు రాజకీయాలు, ఇతర దేశాలపై హేతురహితంగా ప్రకటించిన టాక్స్ వార్ కారణంగా ప్రపంచ దేశాలలో అమెరికా తన పరపతిని వేగంగా కోల్పోతున్నది. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ట్రంప్ అహంకారమే కారణమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.

ఇరాన్ పై అమెరికా దాడులు, దాని పర్యవశానాల కారణంగా  అమెరికా ఆర్థిక  విశ్వసనీయత ప్రశ్నార్థకమైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.  సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల చమురు వాణిజ్యమంతా డాలర్లలోనే జరగడం ఇప్పటి వరకూ అమెరికాకు కొండంత అండగా నిలిచింది. అయితే ప్రస్తుతం పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. అమెరికా ఆధిపత్యాన్ని అమెరికా మిత్ర దేశాలు సైతం అంగీకరించని పరిస్థితులు నెలకొంటున్నాయి.  అన్నిటికీ మించి అమెరికా ఇతర దేశాలను లొంగదీసుకోవడానికి తన ఆర్థిక శక్తిని  ఆయుధంగా వాడుకోవడం పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమౌతోంది.   రష్యా, ఇరాక్ వంటి దేశాల ఆస్తులను అమెరికా సెంట్రల్ బ్యాంక్ (ఫెడరల్ రిజర్వ్) స్తంభింపజేయడం చూసి, మిగిలిన దేశాలు అప్రమత్తమవుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలు   కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే భారత్ సుమారు 100 టన్నుల బంగారాన్ని అమెరికా నుండి తిరిగి తన స్వదేశానికి తరలించింది. ఒక్క  భారత్ మాత్రమే కాదు..  జర్మనీ, ఫ్రాన్స్ వంటి ఐరోపా దేశాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి.  ఇక చమురు దిగుమతుల విషయంలో డాలర్ పెత్తనానికి కూడా గండి పడింది.   డాలర్ స్థానంలో ప్రత్యామ్నాయ కరెన్సీల వాడకం  వైపు పలు దేశాలు మొగ్గు చూపుతున్నాయి.  ఇరాన్, వెనిజులా వంటి దేశాలు ఇప్పటికే చైనాతో యువాన్లలో చమురు వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. బ్రిక్స్  కూటమిలోని దేశాలు కూడా డాలర్ తో సంబంధం లేకుండా సొంత చెల్లింపుల వ్యవస్థలను బలోపేతం చేసుకుంటున్నాయి.

ఇక హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల కూడా  డాలర్ విముక్త వాణిజ్యానికి ఊతమిచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. కేవలం యువాన్ లేదా ఇతర కరెన్సీలలో చెల్లింపులు జరిపే నౌకలనే  ఇరాన్ అ నుమతించడానికి అంగీకరించిన నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడింది.  ట్రంప్ వార్నింగ్ లతో  డాలర్ ప్రాభవాన్ని కాపాడుకోవాలని  ప్రయత్నిస్తున్నా.. ఆ దేశ ఆర్థిక పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు.  దీంతో త్వరలోనే అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యం ముగుస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,53,820 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,41,000 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,15,370 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ రోజు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ వెండిపై పది వేలు పెరిగి 2,65,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు వారాల సమయంలో శాంతి చర్చలు కూడా జరగనున్నాయి. ఇరాన్ కూడా ఈ తాత్కాలిక ఒప్పందానికి అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
ఓ గర్భిణీని అంబులెన్స్ లో తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆ గర్భిణికి 108 సిబ్బంది సమయస్ఫూర్తితో అంబులెన్స్ లోనే కాన్పు చేసి తల్లి బిడ్డలను సురక్షితంగా కాపాడారు.
గచ్చిబౌలి మంగళ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి అనే యువకుడు వ్యాపారం చేస్తున్నాడు. ఈనెల 12వ తేదీన వెంకట కృష్ణ డెస్టినేషన్ మ్యారేజ్ జరగనుంది. ఒకవైపు అంగరంగ వైభవంగా వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వివాహ ఏర్పాట్ల కోసం వెంకట కృష్ణ 20 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.
విమానాశ్రయంలో సాధారణ భద్రతా తనిఖీల సమయం లో స్కానింగ్‌లో బుల్లెట్లు బయటపడటంతో అధికా రులు వెంటనే అప్రమత్తమ య్యారు. ఆయుధాలకు సంబంధించిన సరైన అను మతులు, పత్రాలు చూపించ లేకపోవడంతో సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకు న్నారు.
పోలీసులు కథనం ప్రకారం సికింద్రాబాద్ బేగంపేటలోని ఒక ట్రైనింగ్ సంస్థకు పైలట్ కోర్సు కోసం వచ్చిన యువ తిని ట్రైనర్ నసిముద్దీన్ మాయ మాటలతో నమ్మించాడు. ట్రైనింగ్‌లో సహాయం చేస్తానని చెప్పి యువతిని తన వశం చేసు కున్నాడు. అనంతరం పలు మార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పును ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తదితరులు ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే.
సైదా బేగం మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా బాధ్యత తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇలా సైదా బేగం ద్వారా మహిళ లను రిక్రూట్ చేసేలా చేయడమే ఉగ్రవా దుల టార్గెట్.. ఇప్పటివరకు సుమారు 42 మంది యువ తులను సైదా బేగం రిక్రూట్ చేసినట్లుగా ప్రాథమిక ఆధారాలు లభించాయి.
ఈ డీల్ వెనుక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌ల దౌత్యం ఉంది. ఇరాన్‌కు ఇచ్చిన గడువు ముగియడానికి గంటల ముందు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా యుద్ధ విరామం ప్రకటన చేశారు.
షూటింగ్ ఖరీదైన క్రీడ.. ఒక మధ్యతరగతి యువకుడు ఆ రంగంలో అడుగుపెట్టడమే గొప్ప అనుకుంటే.. అక్కడితో ఆగకుండా భారత కీర్తి పతాకను ప్రపంచ దేశాలలో రెపరెపలాడిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించి దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాడు.
తాడేపల్లి, ఉండవల్లితో పాటు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ సోదాల్లో విశాఖపట్నం ఎండాడలో ఒక విలాసవంతమైన ఫ్లాట్, తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో జీప్లస్ 2 భవనాన్ని గుర్తించారు. వీటితో పాటు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులు, రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో మరో రూ.3 లక్షలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం ఉన్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.
అదలా ఉంటే.. ఇరాన్ తమ భూభాగంలోకి ప్రవేశించిన అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేసిన సమయంలో ఆ విమానంలోని ఇద్దరు పైలట్ల ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయారు. వారిలో ఒకరిని అమెరికా రక్షణ దళాలు వెంటనే కాపాడాయి. కానీ రెండో పైలట్ ఆచూకీ కనిపించలేదు. దీంతో అమెరికా తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది. మరో వైపు ఇరాన్ అప్రమత్తమైంది. ఇరాన్ భూభాగంలో చిక్కుకున్న అమెరికా పైలట్ ను ప్రాణాలతో అప్పగించిన వారికి భారీ నజరానా ప్రకటించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.