యువతులకు ఉగ్ర శిక్షణ.. సైదా బేగం విచారణలో విస్తుపోయే వాస్తవాలు!
Publish Date:Apr 8, 2026
Advertisement
విజయవాడ టెర్రర్ లింక్ కేసులో హైదరాబాద్ సైదా బేగం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొద్ది రోజుల కిందట విజయవాడ టెర్రర్ లింక్ లో హైదరా బాద్ కు చెందిన సైదా బేగం ఉన్నట్లుగా అధికారులు గుర్తించి, ఆమెను అదుపులోకి తీసు కొని విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణ లో సంచలమైన అంశాలు బయటపడ్డాయి. సైదా బేగం భర్త నుండి విడిపోయి పుట్టింటికి వచ్చి నివాసం ఉంటుంది. ఆమె పలు ఇళ్లలో పనిచేస్తూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. ఆ విధంగా ఒక వ్యక్తితో పరిచయం ఏర్ప డింది. అలా ఆమె ఉగ్రవాదం వైపు మరలింది. అంతటితో ఆగకుండా ఈ సైదా బేగం మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా బాధ్యత తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇలా సైదా బేగం ద్వారా మహిళ లను రిక్రూట్ చేసేలా చేయడమే ఉగ్రవా దుల టార్గెట్.. ఇప్పటివరకు సుమారు 42 మంది యువ తులను సైదా బేగం రిక్రూట్ చేసినట్లుగా ప్రాథమిక ఆధారాలు లభించాయి. సైదా బేగం ఖవాతీన్ పేరుతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపు నిర్వహిస్తూ యువతులను లక్ష్యంగా చేసుకున్నట్లు అధి కారులు గుర్తించారు. ఇందు కొరకు సైదా బేగం తన ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 40 అకౌంట్లు సృష్టించి జిహాద్ భావజా లానికి సంబంధించిన వీడియోలు పోస్టు చేస్తూ యూత్ లో ఐడియాలజీ నింపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే దర్యాప్తులో భాగంగా సైదా బేగం వద్ద నుండి తీసుకున్న ఫోన్లో వాట్స్అప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో ఉగ్రవాద భావ జాలాన్ని ప్రోత్సహించే పలు వీడియోలు, పిడిఎఫ్ ఫైల్స్ ఉన్నట్లుగా వెల్లడైంది. వాటి లో పేలుడు పదార్థాల తయారీ, బ్లాక్ పౌడర్ తయారీ వంటి వీడియోలు కూడా ఉన్నట్లుగా పోలీ సులు తెలిపారు.వీటన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. సైదా బేగం... యువతులను ప్రభావితం చేయడానికి ఒసామా బిన్ లాడెన్, జాకీర్ నాయక్ వీడియోలు షేర్ చేస్తూ అమ్మాయిలను ఉగ్రవాదం వైపు మళ్ళిం చింది.... అమ్మాయిలకు స్నిప్పర్ రైఫిల్, షూటింగ్ వంటి వాటిలో ట్రైన్ ఇవ్వాలని ఉగ్రవాదులు సైదా బేగానికి ఆదేశాలు జిహాద్ గ్రూపుల నుండి వచ్చినట్లుగా విచారణలో వెల్లడైంది. స్నిప్పర్ రైఫిల్, షూటింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రణాళిక ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలోనే సైదా బేగం మొదటగా మదర్సాల్లో మతపరమైన శిక్షణ అయ్యాక వెపన్ ట్రైనింగ్ కు సన్నాహాలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని...సైదా బేగం నెట్వర్క్ కు సంబంధించి మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/terror-training-for-young-women-36-216919.html





