అహ్మదాబాద్ స్టేడియంకు దిష్టి తీసిన క్రికెట్ ఫ్యాన్స్
Publish Date:Mar 6, 2026
Advertisement
దేశంలో క్రికెట్ ఫీవర్ పీక్స్ కు చేరింది. టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం (మార్చి 8) అహ్మదాబాద్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో టీమ్ ఇండియా తలపడనున్న సంగతి తెలిసిందే. భారత్ లో క్రికెట్ ఒక మతంగా మారిన నేపథ్యంలో ఫైనల్ లో టీమ్ ఇండియా విజయం సాధించాలని కోరుతూ క్రికెట్ ఫ్యాన్స్ అహ్మదాబాద్ స్టేడియంకు దిష్టి తీశారు. టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో టీమ్ ఇండియా ఇంగ్లాండ్ పై ఏడు పరుగుల తేడాతో చెమటోడ్చి గెలిచిన నేపథ్యంలో భారత జట్టు బౌలింగ్ బలహీనతలు ప్రస్ఫుటంగా బయటపడ్డాయి. దీంతో ఫైనల్ లో న్యూజిలాండ్ పై విజయం సునాయాసం కాదన్న అనుమానం అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే కొందరు అభిమానులు అహ్మదాబాద్ స్టేడియంకు దిష్టి తీశారు. మూడేళ్ల క్రితం 2023 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరి కూడా అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తైన విషయాన్ని క్రికెట్ అభిమానులకు చేదు జ్ణాపకంగా మిగిలిపోయింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో కూడా ఈ మైదానం భారత్‌కు అచ్చిరాలేదు. టి20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్ ఒకే ఒక్క మ్యాచ్ లో పరాజయం పాలైంది. ఆ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్. దీంతో అహ్మదాబాద్ వేదికగా జరగనున్న టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో టీమ్ ఇండియా విజయం సాధించాలని కోరుకుంటూ దిష్టి తీయడం నెటిజనులను విపరీతంగా ఆకర్షించింది.
http://www.teluguone.com/news/content/fans-funny-act-in-ahmadabad-stadium-36-215139.html





