బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిరంకుశత్వాన్ని ఎదిరించి, భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో విప్లవ జ్యోతిగా వెలిగిన వీరపాండ్య కట్టబొమ్మన పాత్రలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ అద్భుత నటనతో అలరించారు. అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన అనంతరం, శుక్రవారం సాయంత్రం విజయవాడ పట్టణం పటమటలోని ఆంత్రలాక్స్ హాల్‌లో ప్రజాప్రతినిధుల కోసం ఆంధ్రప్రదేశ్ “శాసన వ్యవస్థ” ఆధ్వర్యంలో నిర్వహించిన "ఆటవిడుపు"ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు – 2026 కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ తనదైన శైలిలో ఈ ప్రదర్శన ఇచ్చారు.
సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యకామాలను ప్రారంభించారు. కట్టబొమ్మన విశిష్ట ఆహార్యం, గంభీరమైన వాచకం, రాజసంతో మంత్రి దుర్గేష్ ఆ పాత్రలో జీవించేశారు. ఆయన వేదికపైకి రాగానే సభలో చప్పట్ల వర్షం కురిసింది.ఈ ప్రదర్శనను వీక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరియు సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులు మంత్రి దుర్గేష్ నటనను వేనోళ్ల కొనియాడారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. "దేశభక్తికి నిలువెత్తు రూపం వీరపాండ్య కట్టబొమ్మన అని, పాంచాలకురిచ్చి యుద్ధంలో ఆయన చూపిన సాహసం చిరస్మరణీయమని" కొనియాడారు. అటువంటి మహనీయుడి పాత్రను పోషించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ నటనా శైలి, సంభాషణల చాతుర్యం, పుణ్యభూమి నాదేశం నమోనమామి పాటలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, సునీల్ కుమార్ తదితర సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రదర్శించిన తీరు సభికులను మంత్రముగ్ధులను చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/atavidupu-mla--mlc-sports-cultural-festivals-36-215138.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.