కిరణ్ కు అధిష్టానం బాసట?

Publish Date:Apr 3, 2012

Advertisement

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మధ్య ఏర్పడిన వివాదంలో అధిష్టానం కిరణ్ కు బాసటగా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. వారం రోజుల క్రితమే ఇటువంటి పరిణామాలను ఊహించిన కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఎంపిలను పార్టీలో నెంబర్ టూ లాంటి ప్రణబ్ ముఖర్జీ వద్దకు రాయబారం పంపారు. వీరు చెప్పినదంతా విన్న ప్రణబ్ కిరణ్ కుమార్ కు సానుకూలంగా మాట్లాడారు. నిజానికి ఈ మొత్తం వ్యవహారంలో బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తక్కువ అంచనా వేశారు. కిరణ్ బలహీనుడని ఆయనకు మద్దరు ఇచ్చేవారు ఎవరూ లేరని బొత్స మొదటినుంచి భావిస్తూ వచ్చారు. దీనికి తోడు తన బలాన్ని కూడా బొత్స ఎక్కువగా అంచనావేసుకున్నారు. అంతేకాక పిసిసి అధ్యక్షుడైనప్పటి నుంచి కిరణ్ కు వ్యతిరేకంగా తన వర్గాన్ని కూడగట్టడానికి బొత్స ప్రయత్నించారు. సమయం దొరికినప్పుడల్లా కిరణ్ ను ఇరుకున పెట్టాలని భావించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే బాధ్యత తీసుకోవాలంటూ బొత్స తన వర్గంతో ప్రకటనలు చేయించడం కిరణ్ కుమార్ కు సహజంగానే ఆగ్రహం కలిగించింది. దీంతో ఆయన బొత్స పై ఏసిబి అస్త్రాన్ని ప్రయోజించి ఆయనకు దిమ్మతిరిగిపోయేలా చేశారు. ఈ దెబ్బతో విలవిలాడిన బొత్స అధిష్టానాన్ని శరణువేడటానికి ప్రయత్నించారు. ఇక్కడ కూడా ఆయనకు పెద్దగా మద్దతు లభించదని తెలుస్తోంది.

 

చిత్తూరు జిల్లాకు చెందిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగిన వైనాన్ని ఒకసారి పరిశీలిస్తే వారంతా చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతారని అర్థమవుతుంది. ఇదే జిల్లాకు చెందిన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాగలికారు. అలాగే పెద్దగా ప్రజాదరణ లేని కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ కాగలిగారు. ఆ తరువాత అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవిని పొందారు. ఆయన పదవిని పొందినవైనం కాకలు తీరిన కాంగ్రెస్ యోధులకు కూడా షాక్ నిచ్చింది. ఆ తరువాత సకలజనుల సమ్మె సమయంలో కూడా ఆయన నిగ్రహంతో వ్యవహరించి సమ్మెవిరమణకు ప్రయత్నించారు. దీనిలో సఫలమైన తరువాత రాజీవ్ యువకిరణాల పేరిట లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తామంటూ కొత్త కథకాన్ని ప్రారంభించారు. అదే సమయంలో తాను గట్టి సిఎంనని, తప్పు ఏ పార్టీవారు చేసినా సహించబోనని నిరూపించేందుకు మద్యం సిండికేట్లపై ఏసిబి దాడులు చేయించారు. ఏసిబి దాడులవల్ల అనేక మంది రాజకీయ నాయకుల భాగోతం వెలుగుచూసింది. అలా వెలుగుచూసిన బాగోతాల్లో బొత్స మద్యం సిండికేట్ ఒకటి. బొత్స మద్యం సిండికేట్ ద్వారా అక్రమంగా కోట్లాది రూపాయలు ఆర్జించారనడానికి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద తిరుగులేని సాక్ష్యాధారాలున్నాయి. ఈ సాక్ష్యాలనే ఆయన హస్తినలో అధిష్టానానికి అందజేశారు. అధిష్టానం కూడా తప్పుచేసిన వారిని వదిలివేస్తే తమకు రాష్ట్రంలో పరువుపోతుందన్న భయంతో ఉంది. అధిష్టానం కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో బొత్సను పక్కనపెట్టి అవసరమైతే డి. శ్రీనివాస్ కు తెరపైకి తెచ్చే ప్రయత్నం చేయవచ్చని తెలుస్తోంది.

 

 

By
en-us Political News

  
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇటీవలి కాలంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహించిన దాండియా వేడుకలో దురదృష్టవశాత్తు ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అలాగే ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రమోషన్ ఈవెంట్  నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి 10వ తరగతి విద్యార్థి హత్య.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.