భారత జట్టులో ఆడాలన్న కల.. 19 ఏళ్లకే ముగిసిన యువ క్రికెటర్ జీవితం.!

Publish Date:Nov 13, 2026

Advertisement

వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్ సూసైడ్..!

క్రికెట్ మైదానంలో బంతిని బౌండరీ దాటిస్తూ.. భారత జట్టు తరఫున ఆడాలనే కలతో అడుగులు వేస్తున్న ఓ యువ క్రీడాకారిణి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. చేతిలో బ్యాట్ పట్టుకుని మైదానంలో మెరవాల్సిన ఆ యువతి.. ఇంట్లో విగతజీవిగా కనిపించడం తీవ్ర విషాదాన్ని నింపింది. వికారాబాద్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల నందిని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.

నందిని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుతోపాటు క్రికెట్‌లో శిక్షణ పొందుతోంది. చిన్న వయసులోనే ఆటపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. క్రమంగా తన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల అండర్-19 స్థాయి క్రికెట్‌లోనూ సత్తా చాటింది. బీసీసీఐ అండర్-19 స్థాయిలో ఎంపికై ఆడినట్లు, పీసీసీఏఐ అండర్-19 స్థాయిలోనూ ప్రాతినిధ్యం వహించినట్లు సమాచారం. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి భారత జట్టుకు ఆడాలని కలలు కంటోంది. అయితే ఇంతలోనే ఆమె జీవితం విషాదాంతమైంది.

శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నందిని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే నందిని మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రేమ పేరుతో వేధింపులే కారణమా.?

అనిల్, కృష్ణ అనే ఇద్దరు యువకులు కొంతకాలంగా నందినిని వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనిల్ ప్రేమ పేరుతో ఇబ్బందులకు గురిచేసేవాడని, కృష్ణ కూడా అతడికి సహకరిస్తూ వేధించేవాడని బంధువులు చెబుతున్నారు. ఈ వేధింపుల కారణంగానే నందిని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణల్లో నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

న్యాయం కోసం రోడ్డెక్కిన కుటుంబ సభ్యులు.!

నందిని మృతితో తీవ్ర ఆవేదనకు గురైన కుటుంబ సభ్యులు, బంధువులు వికారాబాద్‌లో ఆందోళనకు దిగారు. తమ బిడ్డను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నందినికి న్యాయం చేయాలని, ఆమె మృతికి కారణమైన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఒకవైపు చదువు.. మరోవైపు క్రికెట్ సాధన.. చిన్న వయసులోనే అండర్-19 స్థాయికి ఎదిగిన ప్రతిభ.. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే ఆశయం.. ఇలా ఎన్నో కలలతో ముందుకు సాగుతున్న నందిని జీవితం 19 ఏళ్లకే ముగిసిపోవడం అందరినీ కలచివేస్తోంది. మైదానంలో పరుగులు సాధించి దేశం గర్వించేలా చేయాల్సిన ఓ యువ క్రీడాకారిణి ఇలా విగతజీవిగా మారడం విషాదకరం.

అసలు నందిని ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులేంటి? కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న వేధింపులు నిజమేనా? ఈ ఘటనలో అనిల్, కృష్ణ పాత్ర ఏంటి? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నందిని మృతికి గల అసలు కారణాలు పోలీసుల విచారణలో వెలుగులోకి రావాల్సి ఉంది.

మీకు నచ్చవచ్చు: తీన్మార్ మల్లన్న హత్యకు కుట్ర జరిగిందా..? డీజీపీకి ఎమ్మెల్సీ ఫిర్యాదు.!

మీకు నచ్చవచ్చు: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..మూడు రోజుల్లోనే భారీగా తగ్గిన గోల్డ్ రేటు..తులం ఎంతంటే.?

 

 

[ women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide ]

By
en-us Political News

  
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇటీవలి కాలంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహించిన దాండియా వేడుకలో దురదృష్టవశాత్తు ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అలాగే ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రమోషన్ ఈవెంట్  నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి 10వ తరగతి విద్యార్థి హత్య.!
అత్యవసర అవసరాల నిమిత్తం శ్రీను ఒక మొబైల్ లోన్ అప్లికేషన్ ద్వారా  40 వేల రూపాయలు రుణం తీసుకున్నాడు. అయితే అనుకోని ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల నుంచి శ్రీనుకు   వేధింపులు ప్రారంభమయ్యాయి.
275 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు...మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్‌లోని చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో సోమవారం నాడు అసాధారణ వాతావరణం నెలకొంది.
తెలంగాణలో ధరణి, భూభారతి భూ రికార్డుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
కొడంగల్ నివాసంలో సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్.!
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే స్థాయిలో నేరగాళ్ల అక్రమ మార్గాలు కూడా పెరిగిపోతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.