తెలంగాణ విద్యావిధానంలో సమూల మార్పులు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం.!
Publish Date:Nov 11, 2026
Advertisement
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. విద్యాశాఖపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే 10+2 విధానం అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యతని సీఎం స్పష్టం చేశారు. విద్యావిధానంలో మార్పులు తీసుకొచ్చే క్రమంలో ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా బోధనా విధానాన్ని రూపొందించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా 9 నుంచి 12వ తరగతి వరకు ఉన్నత విద్యకు పునాదిగా భావించి, ప్రత్యేక విద్య (Specialised Education) అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. 12వ తరగతి నుంచి విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు అకడమిక్ పరిజ్ఞానంతో పాటు వృత్తి నైపుణ్యాలు అందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా విద్యా సంస్థల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో ప్రతిపాదిస్తున్న మార్పులు క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలయ్యేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇది కూడా చదవండి: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి: సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై కాల్పులు..ముగ్గురు జవాన్లకు గాయాలు.! [ Telangana Education Reforms, CM Revanth Reddy, 10+2 Education System, Specialised Education, Telangana Government Schools, Education Policy, Telugu One, Telugu News ]
http://www.teluguone.com/news/content/telangana-education-reforms-24-236848.html




