శ్రీవారి సేవలో సీజేఐ
Publish Date:Mar 1, 2026
Advertisement
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం (మార్చి1) తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బి. ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవి చంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పి ఎల్. సుబ్బారాయుడు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్చకులు వేద మంత్రాలు నడుమ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం తరువాత భారత ప్రధాన న్యాయమూర్తి ని అర్చకులు శేష వస్త్రం కప్పి, రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ బి. ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవి చంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి గౌ,భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తీర్థప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ వరహస్వామి వారిని దర్శించుకున్నారు
http://www.teluguone.com/news/content/cji-justice-surya-kanth-in-tirumala-36-214843.html





