టీ 20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి సూపర్-8 మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్ధేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని టీమ్ ఇండియా 19.2 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి చేదించింది. సంజు శాంసన్ కీలక ఇన్నింగ్ ఆడి జట్టుని గెలిపించాడు.
వాంఖడేలో మార్చి 5న రెండో సెమీ ఫైనల్లో భారత్ జట్టు ఇంగ్లాండ్‌తో తలపడనుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ సూపర్-8 కీలక పోరులో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణయం తొలుత తప్పేమో అనిపించేలా వెస్టిండీస్ బ్యాటర్లు ఆరంభం నుంచే ధాటిగా ఆడారు. రోస్టన్ చేజ్ 40, జేసన్ హోల్డర్ 37 నాటౌట్, కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ 34 మెరుపు ఇన్నింగ్స్‌లతో నిర్ణీత 20 ఓవర్లలో విండీస్ 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో జస్పీత్ బుమ్రా (2/36) కీలక సమయంలో వికెట్లు తీసి విండీస్ స్కోరు 200 దాటకుండా అడ్డుకోగలిగారు.
ఇక 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలినా, వన్‌డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ భారత్‌ను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసిన శాంసన్, విండీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు.
అయితే చివరి 5 ఓవర్లలో 60 పరుగులు కావాల్సిన దశలో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ యువ సంచలనం తిలక్ వర్మ (27), హార్దిక్ పాండ్యా (17) బాధ్యతాయుతంగా ఆడి, మరో 4 బంతులు మిగిలి ఉండగానే 199 పరుగులు సాధించి భారత్‌కు విజయాన్ని అందించారు. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/team-india-beat-windes-36-214844.html
కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 మంది యువకులు ఫ్రంట్‌లైన్ ప్రెస్ పేరుతో ఒక బృందంగా ఏర్పడి షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. వీరంతా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యారు. చిత్రీకరణ కోసం పుష్పగిరి వద్దనున్న పెన్నా నది వద్దకు వీరు ఆదివారం వెళ్లారు.
ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, మహ్మద్ షమీ అదిరిపోయే వ్యూహంతో వారిని దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతికే షమీ వేసిన స్లోయర్ డెలివరీని అర్థం చేసుకోవడంలో అభిషేక్ పూర్తిగా విఫలమయ్యాడు. బంతి బ్యాట్ అంచుకు తగిలి షార్ట్ థర్డ్ దిశగా వెళ్లగా, అక్కడ ఉన్న మనిమారన్ సిద్ధార్థ్ అద్భుతమైన డైవ్‌తో క్యాచ్ పట్టాడు.
మంగళవారం ) పవర్ ప్లాంట్స్‌పై దాడులు, బ్రిడ్జ్‌పై దాడులు అన్నీ కలగలిపి ఉంటాయి. ఇలాంటిది మునుపెన్నడూ చూసి ఉండరు. హోర్ముజ్‌ను తెరవకపోతే మీకు నరకం కనిపిస్తుంది.. చూస్తూ ఉండండి అంటూ అని బూతులతో ట్రంప్ చెలరేగిపోయారు.
చైనాకు చెందిన పలు సాంకేతిక సంస్థలు శాటిలైట్ ఛాయాచిత్రాలు, విమానాల రాకపోకల డేటా, షిప్పింగ్ సమాచారాన్ని విశ్లేషించడానికి ఏఐని వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా మిజార్‌విజన్ వంటి సంస్థలు ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించిన సమాచారాన్ని అత్యంత వేగంగా క్రోడీకరించి, అమెరికా సైన్యం ఎక్కడెక్కడ మోహరించి ఉందో ఇట్టే కనిపెట్టేస్తున్నాయి.
ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 43 పరుగుల తేడాతో చైన్నైని చిత్తు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ 2026 సీజన్ లో ఇప్పటి వరకూ ఇదే అత్యధిక స్కోరు.
కుటుంబాల్లో కలహాలు పెరిగి విషాదాంతాలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాంటి దుర్ఘటన ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
తారామతి డ్రగ్స్ కేసులో ముంబైకి చెందిన నటుడు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఈగిల్ టీం తెలిపారు
తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన డీసీఎం వాహనం బీభత్సం సృష్టించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
శత్రువు భూభాగంలోకి వెళ్లి తమ పైలట్‌ను రక్షించుకుని చరిత్ర సృష్టించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. యుద్దం గెలిచినట్లే సంబరపడిపోతున్నారు
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఇరాన్ అనుకూల ప్రచారం.. లాస్ ఏంజిల్స్‌లో సులేమానీ బంధువుల అరెస్ట్
దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.