Publish Date:Feb 17, 2026
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా ఆపార్టీ నేతలంతా ఫార్ములా ఈ రేస్ కేసును లొట్టపీసు కేసు అంటూ ఎంతగా తక్కువ చేసి మాట్లాడాలని చూసినా అది గట్టి కేసేనని న్యాయనిపుణులు అంటున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతి లభించింది. ఈ కీలక పరిణామంతో తెలంగాణ ఏసీబీ ఫార్ములా ఈ రేసు విచారణను మరింత వేగవంతంచేయడానికి రెడీ అయిపోయింది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఎప్పుడో అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఇదే కేసులో అర్వింద్ కుమార్ విచారణకు కేంద్రం నుంచి అనుమతి లభించడంతో ఇక ఏ క్షణంలోనైనా ఆయనను విచారణకు పిలవడం, ఈ కేసులో చార్జిషీట్ దాఖలు కావడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ను విచారించేందుకు కేంద్రం నుంచి అనుమతి లభించిన వెంటనే ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. రూ.54.88 కోట్ల ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు తరలించడంలో అర్వింద్ కుమార్ కీలక పాత్ర పోషించారని, ముఖ్యంగా కేటీఆర్ ఆదేశాల మేరకు క్యాబినెట్ ఆమోదం లేకుండానే దస్త్రాలను వేగంగా కదిలించారని ఏసీబీ ఆరోపిస్తోంది.
ఈ లావాదేవీల వల్ల ప్రభుత్వ ఖజానాకు కేవలం నిధుల పరంగానే కాకుండా, జరిమానాల రూపంలోనూ భారీ నష్టం వాటిల్లిందని ఏసీబీ ఆధారాలు సేకరించింది. అదలా ఉంటే.. ఈ కేసులో అర్వింద్ కుమార్ అప్రూవర్ గా మారే అవకాశాలపై రాజకీయ, అధికార వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కెరీర్ , భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే.. ఈ కేసులో తాను పైస్థాయి ఆదేశాలను అమలు చేశానని చెబుతూ, అసలు సూత్రధారుల వివరాలను వెల్లడించేందుకు ఆయన సిద్ధమయ్యే అవకాశం మెండుగా ఉన్నాయంటున్నారు. అదే జరిగితే.. ఈ కేసులో ఏ1 కేటీఆర్‌కు ఇబ్బందులు తప్పవని న్యాయ నిపుణులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/center-ok-to-inquire-senior-ias-arvindkumar-36-214244.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.