Publish Date:Feb 17, 2026
టి20 వరల్డ్ కప్ లో సూపర్ 8 దశకు చేరాలంటే ఆస్ట్రేలియా తాను ఆడాల్సిన తదుపరి మ్యాచ్ గెలవడమొక్కటే సరిపోదు. మంగళవారం జింబాబ్వే జట్టు ఐర్లాండ్ చేతిలో ఓడిపోవాలి. అయితే జింబాబ్వే, ఐర్లాండ్ ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఒక వేళ ఏదైనా కారణం చేత రద్దైనా ఆస్ట్రేలియా సూపర్ 8 ఆశలు వదులు కోవాల్సిందే. ఎందుకంటే మ్యాచ్ రద్దైనా, గెలిచినా జింబాబ్వే నేరుగా సూపర్ 8కు వెళ్లిపోతుంది. అంటే ఐర్లాండ్ తో మ్యాచ్ జరిగి, జింబాబ్వే ఓడిపోతేనే ఆసీస్ సూపర్ 8 ఆశలు సజీవంగా ఉంటాయన్న మాట. జింబాబ్వే, ఐర్లాండ్ మ్యాచ్ కు ఇప్పుడు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. టాస్ జాప్యమైంది. పల్లెకల మైదానంలో కవర్స్ కప్పి ఉన్నాయి. వర్షం జోరుగా పడుతోంది.
వర్షం కారణంగా మ్యాచ్ రద్దౌతుందేమోనన్న ఆందోళనతో ఆస్ట్రేలియా ఉంది. ఒక వేళ ఓవర్లు కుదించైనా మ్యాచ్ జరిగితే ఐర్లాండ్ విజయం సాధిస్తుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే జింబాబ్వే జట్టు అద్భుత ప్రదర్శన ఇస్తోంది. ఇప్పటికే బలమైన ఆసీస్ జట్టపై అలవోక విజయం సాధించింది. సపోజ్ ఫర్ సపోజ్ జింబాబ్వే ఐర్లండ్ చేతిలో ఓడిపోయినా ఆసీస్ తదుపరి మ్యాచ్ గెలిచినా సూపర్ 8 కు నేరుగా వెళ్లే అవకాశాలు లేవు. అప్పుడు రన్ రేట్ ఇంపార్టెంట్ అవుతుంది.
ప్రస్తుతానికి గ్రూప్ బిలో జింబాబ్వే మెరుగైన రన్ రేట్ తో ఉంది. ఎలా చూసినా ఈ సారి వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా సూపర్ 8కు చేరే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. నేపథ్యంలోనే జింబాబ్వే, ఐర్లండ్ మ్యాచ్ జరుగుతుందా? జరిగితే ఫలితంఎలా ఉంటుంది అన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rain-tenssion-to-australia-36-214243.html
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వ్యవస్థను ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్‌గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.