కరీంనగర్‌లో పట్టపగలే గన్‌తో దోపిడీ...
నగరాన్ని భయభ్రాంతులకు గురి చేసిన ఘటన..
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రముఖ ఆభరణాల దుకాణం పీఎంజే జ్యువెలరీ షాపుపై ఐదుగురు సాయుధ దుండగులు దాడి చేసి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. పట్టపగలే, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగడం స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు దారి తీసింది.
ఈరోజు మధ్యాహ్నం కస్టమర్ల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఐదుగురు వ్యక్తులు తుపాకులతో షాప్‌లోకి చొరబడ్డారు. ముందుగా సిబ్బందిని బెదిరిస్తూ గాల్లో కాల్పులు జరిపినట్లు సమాచారం. అనంతరం సిబ్బందిని ఒక మూలకు తరలించి, షోరూమ్‌లో ఉన్న బంగారు ఆభరణాలను బ్యాగుల్లో నింపుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తం ఘటన కేవలం కొన్ని నిమిషాల్లోనే ముగిసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కాల్పుల శబ్దాలు వినిపించడంతో చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు, ప్రజలు భయంతో పరుగులు తీశారు. కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. షాప్‌లోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాల్పుల సమయంలో ఎవరైనా గాయపడ్డారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.
దోపిడీకి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద కూడా అప్రమత్త చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పట్టపగలే ఇలాంటి ఘటన జరగడం నగర భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వ్యాపార వర్గాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసులను కోరుతున్నాయి. ఈ కేసులో త్వరలోనే కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/karimnagar-robbery-36-218857.html
బండి భగీరథ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. జ్యోతినగర్‌కు చెందిన ఒక యువతితో అతనికి స్నేహం ఏర్పడింది. కొంతకాలానికి ఆ యువతి అతనిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అయితే.. భగీరథ్ పెళ్లికి నిరాకరించడంతో పరిస్థితి మలుపు తిరిగింది. ఆ యువతి, ఆమె తల్లిదండ్రులు కలిసి అతనిపై క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారు.
పసిఫిక్ మహాసముద్రంలోని తూర్పు, మధ్య ప్రాంత ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయనీ, దీనివల్ల దేశంలో వర్షపాతం గణనీయంగా తగ్గి.. కరువు పరిస్థితులు ఏర్పడే ముప్పు ఉందని తెలిపింది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందనీ, అందువల్ల సాగునీటి కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
మన దేశానికి చెందిన ఆరు విభిన్నమైన వంటకాలు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం సంపాదించుకోవడం గమనార్హం. కేవలం రుచితోనే కాకుండా, భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పే ఈ వంటకాలు ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపును దక్కించుకున్నాయి.
గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలని చంద్రబాబు ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరనున్నారు. అలాగే గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. నెలరోజులలోనే రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం నిజంగా చారిత్రాత్మకమని చెప్పవచ్చు.
సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన యూనిట్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు.
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
Fin Allen Sixers Fest in Delhi, easy, win, over, dc, ipl2026, 4th, concicutive
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు.
ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐ ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి సుమారు రూ.కోట్లు తీసుకున్నారంటూ.. బాధితుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ కేసు సినీ, సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది.
హైకోర్టులో ఒక పిటిషన్ విచారణ సందర్భంగా జూనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఆ సమయంలో జడ్జి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కొంత అసహనానికి గురయ్యారు. ఆ క్రమంలో న్యాయవాది తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిస్తూ.. అక్కడే ఉన్న పోలీసులను పిలిచి ఆ జూనియర్ అడ్వకేట్ ను 24 గంటల పాటు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించారు.