చెన్నై సూపర్ కింగ్స్ సునాయాస విజయం..: ముంబై ప్లేఆఫ్ ఆశలు ఆవిరి

Publish Date:May 2, 2026

Advertisement

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ సునాయాస విజయం సాధించింది. ఈ  మ్యాచ్ లో ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలు దాదాపుగా ఆవిరైపోయాయి.  సీఎస్కే బ్యాటర్, స్కిప్పర్ రుజురాజ్ సింగ్, కార్మిక్ శర్మలు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో  ముంబై పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు.  మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది. ఇక చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్ అద్భుత ప్రదర్శన కనబరిచి కీలక  మూడు వికెట్లు పడగొట్టి ముంబై బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు. అతనికి తోడుగా నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించారు. క్రమబద్ధమైన బౌలింగ్‌తో చెన్నై బౌలర్లు ముంబైని కట్టడి చేశారు.

అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు సంజూ శాంసన్ 11 పరుగులు, ఉర్విల్ పటేల్ 24 పరుగులు చేసి ఔటయ్యారు. అయితే.. ఆ దశలో స్కిప్పర్   రుతురాజ్ గైక్వాడ్, యువ ఆటగాడు కార్తీక్ శర్మ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను ముంబై చేతుల్లోంచి లాగేసుకున్నారు.

రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేసి అజేయంగా నిలవగా, కార్తీక్ శర్మ 40 బంతుల్లో 54 పరుగులు చేసి సత్తా చాటాడు. దీంతో   చెన్నై లక్ష్యాన్ని ఛేధించి విజయాన్ని అందుకుంది.  

By
en-us Political News

  
శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఈసారి పూర్తిగా సాధారణ ట్రాఫిక్ మధ్యనే ప్రయాణించడం నగరంలో ప్రత్యేక చర్చకు దారితీసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వ్యవస్థను ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్‌ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్‌గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.