సమాజంలో తనకంటూ ఓ గొప్ప స్థానం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. స్థానం సంగతి అలా ఉంచితే... కనీసం తను ఒకడు ఉన్నాడని అవతలివారు గుర్తించాలని అనుకుంటారు. ఈ గుర్తింపు కూడా పొందలేకపోతే మనిషి ఏమైపోతాడు? అలాంటివారితో ఎలా ప్రవర్తించాలి? అన్న అనుమానాలు వచ్చాయి పరిశోధకులకి. ఫలితంగా ఓ ప్రయోగం చేసి చూశారు. ఆ ప్రయోగం ఏమిటో! అది నేర్పే పాఠాలేమిటో చూడండి!
ఈ పరిశోధన కోసం సైకాలజిస్టులు, అభ్యర్థులతో ఒక ఆటని ఆడించారు. ఇందులో ఒకరికి ఒకరు బంతిని అందిస్తూ ఉండాలి. ఈ ఆటలో కొందరికి బంతి అస్సలు అందలేదు. ఇలాంటి సందర్భాలలో కావాలని తమని విస్మరిస్తున్నారన్న భావన మనకి కలగడం సహజం. ఇది ఆత్మన్యూనత, అభద్రతాభావం లాంటి తీవ్రమైన మనస్తత్వానికి దారితీస్తుందని తేల్చారు.
తన ఉనికిని గుర్తించకపోవడం వల్ల మనిషి అహం దెబ్బతింటుదనీ... అది తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుందనీ తేలిపోయింది. కానీ ఇలాంటి సందర్భాలను నివారించడం ఎలా అన్న దిశగా కూడా ప్రయత్నం చేశారు. తనని తిట్టినా, తిరస్కరించినా కూడా మనిషికి ఎలాగొలా తనని గుర్తించారులే అన్న తృప్తి కలుగుతుందట. ఏదో సినిమాలో చెప్పినట్లు- ‘కుదిరితే క్షమించు, లేదా శిక్షించు, కానీ మేం ఉన్నామని గుర్తించు’ అంటూ మనిషి తపించిపోతాడట.
మన చుట్టూ ఉండే ప్రతిఒక్కరి అహంకారాన్నీ మనం తృప్తి పరచలేకపోవచ్చు. కానీ వాళ్లూ మన రోజువారీ జీవితంలో భాగమేనని గుర్తించడం చాలా అవసరం అంటున్నారు. ఉద్యోగ సంస్థలు కూడా ఈ విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు. ఉద్యోగులని పరామర్శ ద్వారానో, విమర్శ ద్వారానో... అసలంటూ వారు తమ సంస్థలో ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలంటున్నారు. అలాగే ఒకే ఉద్యోగానికి పదులకొద్దీ దరఖాస్తులు వచ్చినప్పుడు కూడా ఈ సూత్రాన్ని పాటించాలని చెబుతున్నారు. తిరస్కరించిన అభ్యర్థుల విషయంలో మిన్నకుండి పోకుండా మెయిల్ లేదా ఉత్తరం ద్వారా ‘మిమ్మల్ని తిరస్కరిస్తున్నాం’ అని తెలియచేయమంటున్నారు.
- నిర్జర.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/as-a-man-35-74693.html
మినుములు లేదా మినప్పప్పు ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తాయో తెలుసా? ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్ మరియు కాల్షియం సమృద్ధిగా ఉండే మినుములు జీర్ణక్రియను మెరుగుపరుస్తూ, ఎముకలను బలంగా మార్చి, కీళ్ల నొప్పులు మరియు ఉబ్బసానికి ఎలా చెక్ పెడతాయో ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
నడుము నొప్పితో బాధపడుతున్నారా? వెన్నెముకను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి మరియు నడుము నొప్పిని తగ్గించడానికి పాటించవలసిన 5 అత్యవసరమైన ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మానవ శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీలు కాదంటూ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు సంచలన విషయాలు వెల్లడించాయి. సగటు ఉష్ణోగ్రత ఎందుకు తగ్గుతుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దీపావళి బాణసంచా పొగ వల్ల ఆస్తమా మరియు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఎలా జాగ్రత్తపడాలో తెలుసుకోండి. N95 మాస్క్ వినియోగం, AQI తనిఖీ మరియు తీసుకోవాల్సిన హెల్త్ టిప్స్.
ప్రకృతి సృష్టించే అత్యంత భయంకరమైన , విధ్వంసకరమైన ముప్పులలో సునామీ ఒకటి. సముద్ర గర్భంలో సంభవించే భూకంపాలు లేదా అల్లకల్లోలాల కారణంగా ఉద్భవించే ఈ రాక్షస అలలు క్షణాల్లో తీర ప్రాంతాలను ముంచెత్తుతాయి.
ధంతేరస్ నుంచి దీపావళి వరకు ఏ రోజు ఏ వస్తువులు కొనుగోలు చేయాలి? బంగారం, వెండి, పాత్రలతో పాటు ఏది శుభప్రదం? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మానవ ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఆధునిక పోషకాహార ఫ్రేమ్‌వర్క్ తెస్తున్న విప్లవాత్మక మార్పులు, ప్రయోజనాల గురించిన పూర్తి సమగ్ర విశేషాలు.
మలబద్దక సమస్యతో బాధపడుతున్నారా? ఉదయాన్నే మోషన్ ఫ్రీగా అవ్వడానికి ప్రముఖ నిపుణులు డాక్టర్ బాలు యెల్లెపు సూచించిన 10 అద్భుతమైన సూపర్ ఫుడ్స్ మరియు డైట్ చిట్కాల గురించి ఈ స్టోరీలో తెలుసుకోండి.
తెలంగాణ స్టైల్ నల్లకూర ఫ్రై తయారీ విధానం తెలుసుకోండి. నీచు వాసన రాకుండా, పర్ఫెక్ట్ మసాలాలతో పల్లెటూరి రుచిలో నల్లకూర ఎలా చేయాలో ఈ స్టోరీలో చూసేయండి.
ఆంధ్రా స్టైల్ చింత చిగురు రొయ్యల కూర తయారీ విధానం మరియు ఆరోగ్య ప్రయోజనాలు. రుచికరమైన పచ్చి రొయ్యల కర్రీని సులభంగా ఎలా చేయాలో తెలుసుకోండి.
దీపావళి పండుగ ప్రత్యేకంగా స్వీట్ షాప్ స్టైల్ లో నేతి బొబ్బట్లు ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. పర్ఫెక్ట్ కొలతలు, చిట్కాలతో రుచికరమైన బొబ్బట్ల రెసిపీ.
మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి , అనేక రకాల చిన్న చిన్న కారణాల వల్ల చాలా మంది క్షణాల వ్యవధిలోనే తీవ్రమైన కోపం తెచ్చుకుంటూ ఉంటారు.
చాయ్‌తో తినడానికి సరికొత్త రుచితో కరకరలాడే బియ్యంపిండి మురుకులను ఇంట్లోనే అత్యంత సులభంగా, నూనె పీల్చకుండా గుల్లగా ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.