'ప్రత్యేక' ప్రకటనకి కారణం పవనా? చంద్రబాబా?

Publish Date:Sep 1, 2016

Advertisement

ప్రత్యేక హోదా... మొన్నటి వరకూ ఇదే ప్రయోగం వినిపించేది ఎక్కడ చూసినా! కాని, ఇప్పుడు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్రకటన అనేది వినిపిస్తోంది! అంటే ఏంటో ఇప్పటికిప్పుడు ఎవరికీ తెలియదు. కాని, ప్రత్యేకమైన ప్రకటన ఒకటి ఏపీ కోసం చేస్తారని మాత్రం అందరి అంచనా. అందుకు తగ్గట్టే ఢిల్లీలో అలజడి కూడా వుంది. వెంకయ్య, సుజనా చౌదరి లాంటి ఏపీ నేతలు బిజీబిజీగా మీటింగ్ లకు అటెండ్ అవుతున్నారు. జైట్లీ, షా లాంటి హస్తిన పెద్దలు కూడా ఏపీపైన దృష్టి పెట్టినట్టే కనిపిస్తోంది.... 


ప్రత్యేక హోదా ఇస్తామని గత యూపీఏ ప్రభుత్వం చట్ట సభలో అధికారికంగా చెప్పింది. అందుకు కారణం కూడా వెంకయ్య నాయుడే. ఆయనే ఒంటరిగా లేచి నిల్చుని ప్రత్యేక హోదా కావాలని నినదించారు. మన్మోహన్ తో ప్రకటన చేయించారు. అయితే, ఇప్పుడు అదే బీజేపి పెద్దలకు తలనొప్పిగా మారింది! ప్రత్యేక హోదా ఇవ్వటం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత తేలిక కాదు. ఒక్క ఆంద్రప్రదేశ్ కు ఇస్తే అది అక్కడితో ఆగేది కూడా కాదు. ఇంకా చాలా రాష్ట్రాలు అదే డిమాండ్ తో ముందుకు వస్తాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కూడా స్పెషల్ స్టేటస్ కోరే ఛాన్స్ వుంది. ఇలాంటి పొలిటికల్ ప్రాబ్లమ్స్ మాత్రమే రాజ్యాంగ బద్ధంగా కూడా అనేక సమస్యలు వచ్చే అవకాశం వుంది ప్రత్యేక హోదా విషయంలో. అందుకే, ప్రత్యేక హోదా ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ లేదా ప్రత్యేక ప్రకటనగా మారిపోయింది. ఇంతకీ ప్రత్యేక ప్రకటనలో వుండేదేంటి? 


ప్రత్యేక ప్రకటనలో మోదీ సర్కార్ ఏపీకి ఇచ్చేదేంటో ఇప్పుడే తెలియదు. కాని, ప్రత్యేక హోదాలో వుండే అన్ని లాభాలు ఇందులో వుంటాయని అంటున్నారు. కాని, అంత పెద్ద వరాల చిట్టా హఠాత్తుగా కేంద్రం ఇప్పుడెందుకు విప్పుతోంది? కారణం పవన్ కళ్యాణ్ తిరుపతి బహిరంగ సభ అనుకున్నారు చాలా మంది. ఎందుకంటే, పవర్ స్టార్ సభ పెట్టి బీజేపిని ఇస్టానుసారం విమర్శించాకే ఢిల్లీలో కదలిక వచ్చింది. కాని, ఇప్పుడు కొన్ని వర్గాల సమాచారం ప్రకారం మరో విషయం తెలుస్తోంది!. ఎన్డీఏలో టీడీపి భాగస్వామి. మోదీతో ఎన్నికల ముందు చాలా పార్టీలు జట్టు కట్టటానికి వెనుకంజ వేశాయి. కాని, అలాంటి సమయంలోనే చంద్రబాబు స్నేహ హస్తం అందించారు. ఓటింగ్ కంటే ముందే ఎన్డీఏలో భాగస్వామిగా వుండి నవ్యాంధ్రలో బీజేపి గెలుపుకు వీలైనంత సహకరించారు. 2014 తరువాత కూడా గత రెండేళ్లుగా శివసేన లాంటి ఎన్డీఏ పక్షాల్లాగా టీడీపీ అల్లరి పెట్టలేదు. ఎన్డీఏలో క్రమశిక్షణగానే మెదులుతూ వచ్చింది. 


రెండేళ్లుగా టీడీపీ ఎన్డీఏకు ఎంతగా సహకరించినా ప్రత్యేక హోదా విషయంలో మోదీ క్యాబినేట్ ఎలాంటి డెసీషన్ తీసుకోలేదు. దీని వల్ల చంద్రబాబు గవర్నెమెంట్ జనం ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. అంతే కాదు, ఏపీకి మేలు జరగకున్నా ఎందుకు ఎన్డీఏలో వుంటున్నారనే వారు కూడా ఎక్కువైపోతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో చంద్రబాబు తన అంతిమ అస్త్రంగా ఎన్డీఏ నుంచి బయటకు వస్తామని చెప్పారంటున్నారు. కేంద్రం పెద్దలకు బాబు ఇక మా వల్ల కాదు మేం గుడ్ బై చెప్పేస్తాం అనటంతోనే కాస్త కదలిక వచ్చిందట! దాని ఫలితమే ప్రత్యేక ప్రకటన కసరత్తు అని కూడా తెలుస్తోంది...
నిజంగా చంద్రబాబు వారెంట్ ఇచ్చారో లేదో తెలియదుగాని ఏదో ఒక కారణం చేత రాష్ట్రానికి మేలు జరిగితే అదే చాలు! 

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.