LATEST NEWS
రాజకీయాలకు అలవాటు పడిన నాయకులు వాటిని వదులు కోవడానికి ఇష్టపడరు.  ఏదో ఆవేశంలో రాజకీయ వైరాగ్యం కలిగినా, మరీ ఆవేశపడి రాజకీయ సన్యాసం తీసుకున్నానంటూ ప్రకటనలు చేసేసినా.. ఆ ఆవేశం తగ్గాకా మళ్లీ వాళ్ల చూపు రాజకీయలవైపే అంటుంది. అడుగులు కూడా రాజకీయం వైపే పడతాయి. ఒక లగడపాటి రాజగోపాల్ అయినా, మరో ఉండవల్లి అరుణ్ కుమార్ అయినా.. ఇంకో వడ్డే శోభనాదీశ్వరరావైనా అంతే. అవకాశం లేక, జనం మొచ్చక, ఒప్పక వీరంతా రాజకీయ ప్రకటనలకే పరిమితమయ్యారు. అయితే విజయసాయిరెడ్డి పరిస్థితి అది కాదు.విజయసాయి  అవేశంతో కంటే ఎంతో  ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.  ఎందుకంటే.. వైసీపీలో ఒక సమయంలో ఆయన జగన్ తరువాత జగనంతటి నాయకుడిగా వెలుగొందారు.  ఆయన రాజకీయ సన్యాసం ప్రకటించిన సమయంలో రాజకీయంగానే కాదు, కేసుల పరంగా కూడా నిండా మునిగి ఉన్నారు. ఇంత కాలం తన సర్వస్వం ధారపోసి పెంచిన పార్టీ దూరం పెట్టింది. అదే సమయంలో కేసులూ చుట్టుముట్టాయి. ఆ కేసుల నుంచి బయటపడాలంటే.. వైసీపీకి తాను దూరం అని నిరూపించుకోవాలి. అదే సమయంలో.. తన స్వేదంతో పెంచిన పార్టీలో.. తన ఉనికినే ప్రశ్నార్థకం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు అవకాశం రావాలంటే.. పోలిటికల్ గా తాను న్యూట్రల్ గా ఉన్నాననీ, ఉంటాననీ నిరూపించుకోవాలి. అందుకే ఆ సమయంలో విజయసాయి రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నట్లుగా ప్రకటించారని పరిశీలకులు విశ్లేషించారు. వారి విశ్లేషణలకు తగ్గట్టుగానే ఆయన వ్యవసాయమే వ్యాపకం అని ప్రకటించినా, సోషల్ మీడియా ద్వారా, చేయగలిగినంత రాజకీయం చేశారు. అలాగే కేసుల విచారణకు హాజరైన సందర్భంగా మీడియా ముందూ రాజకీయాలే మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టులకు ఆయన ఇచ్చిన లీకులే కారణమంటే అతిశయోక్తి కాదు. విజయసాయి వైసీపీ నుంచి బయటకు వచ్చి, రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మాటలు, చేతలు, అడుగులూ అన్నీ బయటకు జగన్ కోటరీ టార్గెట్ అన్నట్లు కనిపించినా.. ఆయన అసలు లక్ష్యం జగన్ అన్నట్లుగానే సాగాయి. అంతెందుకు విజయసాయి వైసీపీకి గుడ్ బై చెప్పిన తరువాత హైదరాబాద్ వెళ్లి మరీ  జగన్ సోదరి షర్మిలతో భేటీ అయ్యారు. ఆ తరువాత కూడా విజయసాయి పొలిటికల్ గా బీజేపీకి చేరువ అవుతున్నారన్న ప్రచారం జరిగింది.   ఇప్పుడు ఆ ప్రచారాలకీ, ఆ విశ్లేషణలకూ బలం చేకూర్చే విధంగా హిందుత్వకు మద్దతుగా ఆయన తన గళం వినిపించారు. అదీ అలా ఇలా కాదు.. వైసీపీ పునాదులే కదిలిపోయేంత గట్టిగా విజయసాయి బాం బు పేల్చారు. మొత్తంగా గత రెండు దశాబ్దాలుగా  జరిగిన మతమార్పిడులపై విచారణ జరిపించాలనీ, ఇందుకు ఒక కమిటీని వేయాలని విజయసాయి డిమాండ్ చేశారు. హిందుత్వకు ద్రోహం చేసిన వారిని ఎవరినీ విడిచిపెట్టకూడదని ఉద్ఘాటించారు. ఈ మాటల వెనుక ఆయన ఆయన ప్రధాన టార్గెట్ వైసీపీ అండ్ జగన్ అని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుందంటారు పరిశీలకులు. గత రెండు దశాబ్దాలుగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకూ జరిగిన మతమార్పిడులపై విచారణ జరిపించాలన్నది ఆయన చేసిన డిమాండ్.   వైఎస్ జమానాలో క్రైస్తవ మతంలోకి పెద్ద ఎత్తున మతమార్పిడులు జరగిన విషయం అందరికీ తెలి సిందే. ఇప్పుడు విజయసాయిరెడ్డి డిమాండ్  ద్వారా బీజేపీకి పదునైన ఆయుధాన్ని అందించారని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు విజయసాయి ప్రత్యక్ష రాజకీయాలలో లేకపోవచ్చు కానీ, బీజేపీ గొంతుక వినిపించారు.  తద్వారా తన అడుగులు ఎటు అన్న సంకేతాలు ఇచ్చారు. విజయసాయి కాషాయం పుచ్చుకుంటే.. జగన్ కు ఇక గడ్డుకాలమేనన్నది పరిశీలకుల విశ్లేషణ
బీజేపి రాజ్యాంగంలో లౌకిక, సొషలిష్ట అనే పదాలు 400 ఎంపీ సీట్ల ఇస్తే తొలగిస్తామనడం దారుణమన్ని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ పేరుతో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలను అణచివేసి ఆర్ఎస్ఎస్ విధానాలు పెంచిపోషించడం వల్ల దేశంలో అశాంతి నెలకొల్పుతున్నరన్నారు.  అలగే దేశంతో రూపాయి విలువ 56 రూపాయలు ఉన్నదాని 90 రూపాయల 30 పైసులు పడిపొవడాని నిర్మాల సీతారామన్న మంచిదే అన్నడం చాలా దారుణమన్నారు. దిని వల్ల ప్రజలు, రైతులు నష్టపోతారన్నారు. అలగే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ విద్యను ప్రైవేటికరణ చేసి చాల అన్యాయం చెస్తుందన్నారు. రాజ్యధాని పేరుతో మల్లి ల్యాండ పుల్లింగుకు పాల్పడుతుందన్నారు. డబ్బులంతా అమరావతిపై పెట్టి మల్లి ప్రాంతీయ ఉద్యమాలకు తెరతీస్తున్నారన్నారు.
  మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఉద్దేశించి పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో మ‌రో కేసు నమోదైంది. చవటపాలెం సొసైటీ ఛైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే.. కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిలీ మద్యం కేసుకు సంబంధించిన కీలక ఫైళ్లు కూడా మాయమవడం కలకలం రేపుతోంది. 2014 ఎన్నికల సమయంలో గోవా నుంచి నకిలీ మద్యం తెప్పించి, లేబుళ్లు మార్చి ఓటర్లకు పంపిణీ చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.  ఆనాడు ఈ నకిలీ మద్యం తాగి పలువురు మరణించగా, వందలాది మంది అనారోగ్యానికి గురయ్యారు.ఈ కేసుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఫైళ్లు 2018లోనే అదృశ్యమైనట్లు విజయవాడ ప్రత్యేక కోర్టు గుర్తించి, కేసును సీఐడీకి అప్పగించింది. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఇప్పుడు కూటమి  ప్రభుత్వం అధికారంలో రావడంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తనపై కేసు నమోదు కావడంతో కాకాణి తీవ్రంగా స్పందించారు. దేవాలయ భూములు అక్రమాలపై ప్రశ్నించినందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సోమిరెడ్డికి దమ్ముంటే నార్కో అనాలసిస్ టెస్ట్‌కు సిద్దమా అని సవాల్ విసిరారు.
ALSO ON TELUGUONE N E W S
      -ఎవరు విజేత  -మొత్తం ఎన్ని సినిమాలో తెలుసా! -అభిమానులు ఏమంటున్నారు -సంక్రాంతి ఎప్పుడు మొదలు     సంవత్సరం పొడవున సినిమాల మధ్య పోటీ అనేది వస్తూనే ఉంటుంది. కాని సంక్రాంతికి ఏర్పడే పోటీ మాత్రం రసవత్తరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అభిమానులు, మూవీ లవర్స్ కి కూడా సదరు పోటీ మంచి కిక్ ని ఇస్తుంది. సంక్రాంతి హుంగామాకి ముహూర్తం దగ్గర పడుతుండటంతో సదరు కిక్ ని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశ్యంతో కొత్త సినిమాలు పందెం కోళ్ల లాగా ముస్తాబవుతున్నాయి. దీంతో  సంక్రాంతి విజేతగా ఏ మూవీ నిలుస్తుందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. మరి ఏ ఏ చిత్రాలు సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయో చూద్దాం.       ముందుగా పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్'(Prabhas)జనవరి 9 న 'రాజాసాబ్'(The Rajasaab)తో సంక్రాంతి పందానికి అంకురార్పణ చేయనున్నాడు. చాలా కాలం తర్వాత వింటేజ్ ప్రభాస్ కనిపిస్తుండటంతో పాటు, ఫస్ట్ టైం ప్రభాస్ హర్రర్ థ్రిల్లర్ చేస్తుండటంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో రాజా సాబ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచార చిత్రాలు కూడా అందుకు తగ్గట్టే ఉండటంతో రిజల్ట్ పై అందరిలో ఆసక్తి  ఏర్పడింది. ఇక ఇదే రోజు మరో పాన్ ఇండియా స్టార్' ఇళయ దళపతి విజయ్'(VIjay)వన్ మాన్ షో  'జననాయగాన్'(Jananayagan)వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.       పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కగా విజయ్ ఆఖరి చిత్రంగా ప్రచారం జరుగుతుంది. దీంతో జననాయగాన్ ని ఏ రేంజ్ లో తెరకెక్కించి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. తెలుగులో జననాయకుడు అనే టైటిల్ తో విడుదల కానుండగా అభిమానులు , ప్రేక్షకుల్లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకుంది. మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad garu)తో సంక్రాంతి సందర్భంగానే  ల్యాండ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే.     అధికారకంగా డేట్ ని ప్రకటించకపోయినా సంక్రాంతికి రెండు రోజుల ముందే రానుందనేది టాక్ . చాలా కాలం గ్యాప్ తర్వాత చిరంజీవి చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో పాటు సాంగ్స్, ప్రచార చిత్రాలతో మంచి బజ్ ని ఏర్పాటు చేసుకుంది. పైగా వరుసహిట్స్ తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి దర్శకుడు. దీంతో అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి. ఇక మాస్ మహారాజ రవితేజ(Ravi teja)కూడా సంక్రాంతి కుర్చీ పై కన్నేశాడు.     రవితేజ స్టైల్లో నే మాస్ అంశాలుతో పాటు ఈ సారి ఫ్యామిలీ అంశాలు కూడా ఒక రేంజ్ లోనే ఉండనున్నాయి. దీంతో సంక్రాంతికి అందరు సందడి చేసే ఫ్యామిలీ అండ్ యాక్షన్ మూవీగా సినీ సర్కిల్స్ లో చర్చ నడుస్తుంది. ఇక సంక్రాంతికి నేను కూడా ఉన్నాను అన్నట్టుగా శర్వానంద్(sharwanand)మరో ఫ్యామిలీ మూవీ 'నారి నారి నడుమ మురారి'తో  అడుగుపెట్టనున్నాడు. గతంలో సంక్రాంతి సమయంలో పెద్ద హీరోలతో పోటీపడి శర్వానంద్ రెండు సార్లు విజయాన్ని అందుకోవడంతో 'నారినారినడుమమురారి' పై ఆసక్తి నెలకొని ఉంది.   also read:   ప్రేమలో పడిన అమీర్ ఖాన్.. వయసు 60 ఏళ్ళు     ఇక పండగరోజైన 14  న 'పరాశక్తి' తో శివ కార్తికేయన్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాడు. విభిన్న చిత్రాల హీరోగా గుర్తింపు పొందిన  నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' తో సందడి చేయనున్నాడు. ప్రచార చిత్రాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. దీంతో సంక్రాంతి సినిమాల ఫలితంపై అభిమానుల్లోఆసక్తి నెలకొని ఉంది. మూవీ లవర్స్ మాత్రం అన్నిచిత్రాలు తమని అలరించాలని కోరుకుంటున్నారు.    
  ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందా..?   పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) 2026 సంక్రాంతికి 'ది రాజా సాబ్'(The Raja Saab)తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అలాగే, హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో చేస్తున్న 'స్పిరిట్' కూడా ఇటీవల మొదలైంది. ఇదిలా ఉంటే ప్రభాస్ చేతిలో ఉన్న ఒక క్రేజీ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.   'ది రాజా సాబ్', 'ఫౌజీ', 'స్పిరిట్'తో పాటు.. ప్రభాస్ చేతిలో 'సలార్-2', 'కల్కి-2' వంటి సినిమాలు ఉన్నాయి. అయితే వీటిలో 'సలార్-2'పై కొంతకాలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయినట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది. (Salaar 2)   Also Read: ఒక్క ఫొటోతో ట్రోల్స్ కి చెక్ పెట్టిన ఎన్టీఆర్!   ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'. 2023 డిసెంబర్ లో విడుదలైన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి మంచి విజయం సాధించింది. అయితే వెయ్యి కోట్లు రాబట్టగల సత్తా ఉన్న ఈ మూవీ.. 600 కోట్లకు పరిమితమవ్వడం ప్రభాస్ ఫ్యాన్స్ ని కాస్త నిరాశపరిచింది. అయినప్పటికీ 'సలార్-2'తో అన్ని లెక్కలు సరి అవుతాయని వారు బలంగా నమ్మారు.   కానీ, 'సలార్' తర్వాత 'సలార్-2' చేయకుండా.. ఎన్టీఆర్ 'డ్రాగన్' ప్రాజెక్ట్ తో బిజీ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. దీంతో ఆ సమయంలోనే అసలు 'సలార్-2' ఉంటుందా లేదా? అనే డౌట్స్ వచ్చాయి. మేకర్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెబుతూ వచ్చారు. దీంతో 'డ్రాగన్' తర్వాత 'సలార్-2' ఉండొచ్చని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ అసలు ఎప్పటికీ ఉండకపోవచ్చని, డ్రాగన్ తర్వాత నీల్ మరో హీరో ప్రాజెక్ట్ తో బిజీ అవుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.  
  ఎనిమిదేళ్ల క్రితం మలయాళ నటిపై లైంగిక దాడి కేసు కేరళలో సంచలనం సృష్టించింది. 2017 లో ఈ ఘటన జరగగా.. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటుచేసికుంది. నిందితుల్లో ఒకరైన ప్రముఖ నటుడు దిలీప్‌ ను కేరళలోని ఎర్నాకుళం కోర్టు సోమవారం నిర్దోషిగా తేల్చింది.    సౌత్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందిన ఓ ప్రముఖ నటి.. 2017, ఫిబ్రవరి 17న కిడ్నాప్‌ కి గురైంది. కొచ్చిలో ఈ ఘటన జరిగింది. ఆ రోజు రాత్రి ఆమెను తన కారులోనే లైంగిక వేధింపులకు గురిచేసిన దుండగులు.. తర్వాత అక్కడినుంచి పారిపోయారు.    నటి కిడ్నాప్‌, లైంగిక దాడి కేసులో పది మందిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో దిలీప్ కూడా ఒకరు. 2017 జులైలో అరెస్టయిన దిలీప్‌.. నాలుగు నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు.    ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని దిలీప్ మొదటినుంచి వాదిస్తున్నాడు. పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించడమే కాకుండా.. సీబీఐ దర్యాప్తుకి కూడా దిలీప్‌ డిమాండ్ చేశాడు. అయితే ఆయన అభ్యర్థన తిరస్కరణకు గురైంది.   అయితే ఇన్నేళ్ళకు ఈ కేసులో దిలీప్‌ ను ఎర్నాకుళం కోర్టు నిర్దోషిగా తేల్చింది. తాజా కోర్టు తీర్పుపై దిలీప్ స్పందించాడు. ఇది తనపై జరిగిన కుట్ర అని, ఇన్నేళ్ళుగా తనకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.   
‘సలార్‌’, ‘కల్కి’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ‘ది రాజా సాబ్‌’. దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్రభాస్‌ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్‌ కాబోతోంది. మారుతి కాంబినేషన్‌లో తొలిసారి నటిస్తున్న ప్రభాస్‌కి హారర్‌ కామెడీ జోనర్‌లో సినిమా చేయడం కూడా మొదటి సారే.  తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, రెబల్‌సాంగ్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా రిలీజ్‌కి నెలరోజులే సమయం ఉండడంతో ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు. జనవరి 8న ఓవర్సీస్‌లో ‘రాజాసాబ్‌’ ప్రీమియర్స్‌ పడబోతున్నాయి. ప్రభాస్‌ సినిమాల కలెక్షన్స్‌లో ఓవర్సీస్‌ పార్ట్‌ చాలా ఉంటోంది. గతంలో ఓవర్సీస్‌ మార్కెట్‌పై హీరోలు దృష్టి పెట్టినా ఆశించిన స్థాయిలో వచ్చేవి కాదు. బాహుబలి తర్వాత ఆ లెక్కలన్నీ మారిపోయాయి.  ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్‌ హీరోల సినిమాలకు సంబంధించి ఓవర్సీస్‌ కలెక్షన్స్‌ కీలకంగా మారాయి. బాహుబలి తర్వాత ప్రభాస్‌ చేసిన సలార్‌, కల్కి కూడా అక్కడ మంచి కలెక్షన్స్‌ రాబట్టాయి. దీంతో రాజాసాబ్‌ ఓవర్సీస్‌ కలెక్షన్లపై భారీ హోప్స్‌ పెట్టుకున్నారు. కానీ, ఈసారి ప్రభాస్‌ సినిమా ఓవర్సీస్‌ కలెక్షన్లు తారుమారయ్యేలా కనిపిస్తోంది. రాజాసాబ్‌ సినిమా హారర్‌ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ సినిమా విజువల్‌గా చాలా గ్రాండ్‌గా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సినిమాను ఐమాక్స్‌ ఫార్మాట్‌లో చూస్తే ఆ థ్రిల్‌ వేరేలా ఉంటుంది.  ప్రభాస్‌ చేసిన ప్రతి సినిమా ఓవర్సీస్‌లో ఐమాక్స్‌ ఫార్మాట్‌లో రిలీజ్‌ అవుతూ ఉంటాయి. అయితే ఈసారి ఐమాక్స్‌ థియేటర్లలో ప్రభాస్‌ సినిమా రిలీజ్‌ అయ్యే ఛాన్స్‌ లేదు. దీంతో ఐమాక్స్‌ ద్వారా వచ్చే కలెక్షన్లకు గండిపడే అవకాశం ఉంది. డిసెంబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అవుతున్న ‘అవతార్‌3’ దానికి కారణంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన అవతార్‌, అవతార్‌2 చిత్రాలు విజువల్‌గా ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఐమాక్స్‌లో మాత్రమే ఎక్స్‌పీరియన్స్‌ చెయ్యాలని ప్రతి ఆడియన్‌ అనుకుంటాడు. దానికి తగ్గట్టుగానే అవతార్‌3 చిత్రాన్ని నాలుగు వారాలపాటు ఐమాక్స్‌ థియేటర్లలో ప్రదర్శించేందుకు ఒప్పందం జరిగింది.  ఆ కారణంగా ‘రాజాసాబ్‌’ చిత్రాన్ని ఈసారి ఓవర్సీస్‌లో ఐమాక్స్‌ ఫార్మాట్‌లో ప్రదర్శించడం లేదు. మరి దీని తాలూకు ఎఫెక్ట్‌ కలెక్షన్లపై ఏమేరకు ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఐమాక్స్‌ ఫార్మాట్‌ అందుబాటులో లేకపోయినా ప్రీమియర్‌ లార్జ్‌ ఫార్మాట్‌తోపాటు ఇతర ఫార్మాట్లలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. అక్కడ కూడా కొన్ని థియేటర్లు అవతార్‌3కి వెళ్లిపోయాయి. అయితే సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో స్పెషల్‌ ఫార్మాట్‌లో సినిమాను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నామని ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. 
  The upcoming horror thriller Isha features Thrigun and Hebah Patel in lead roles with Akhil Raj, Siri Hanmanth and Prithveeraj also playing significant roles. The team has just released a chilling new trailer that instantly grabs attention. It opens with four friends who set out to uncover the truth behind fraudulent spiritual gurus.   However, Babloo Prithveeraj steps in, determined to prove the existence of ghosts, pulling them and the audience - into a dark, unsettling realm filled with terrifying moments. The friends soon find themselves overwhelmed by fear. As the trailer unfolds, it reveals a creepy, deserted house inhabited by hidden spirits, with the four friends trapped inside.    Their struggle for survival becomes the central focus, leaving viewers curious about their fate. What happened to them inside that haunted structure? What is the dark history of the abandoned building? These glimpses raise numerous compelling questions. Did the friends make it out alive? What secrets do the ghosts hold?   The trailer successfully builds suspense and intrigue, and the creators promise a gripping, edge-of-the-seat horror experience for audiences. RR Dhruvan’s background score heightens the tension, and the visuals along with the production quality stand out impressively. Backed by Pothula Hema Venkateswara Rao under HVR Productions, the movie brings together a skilled technical team including Santosh Sanamoni for cinematography, RR Dhruvan for music and Vinai handling the editing.   Following their impressive success with Little Hearts and Raju Weds Rambai, producers Bunny Vas and Vamsi Nandipati are now gearing up to deliver another gripping project. Known for their strong judgment in selecting content-driven stories, the duo is presenting Isha under their respective banners. Their association has significantly boosted the buzz around the film, raising expectations for another compelling cinematic experience.   https://x.com/Theteluguone/status/1997919793417171399?s=20  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి. అయితే గొడవలు కూడా ఆరోగ్యంగా  ఉన్నప్పుడే భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. కానీ నేటి కాలంలో చాలా వరకు భార్యాభర్తల బంధాన్ని విచ్చిన్నం చేసే విదంగా గొడవలు జరగడం చూస్తుంటాం.  అసలు భార్యాభర్తల మధ్య గొడవలు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? తెలుసుకుంటే.. భార్యాభర్తల మధ్య వాదనలు, గొడవలు జరుగుతూ ఉంటాయి.  అవన్నీ నిజంగా బంధాన్ని బలపరుస్తున్నాయా లేదా అనే విషయాన్ని గమనించుకోవడం చాలా ముఖ్యం. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినా అది ఆరోగ్యకరంగా ఉండాలి.  భార్యాభర్తలు ఇద్దరూ తమ అబిప్రాయాలను ఓపెన్ గా చెప్పుకోవాలి.  అది వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీసేలా కాకుండా సమస్యపై దృష్టి పెట్టేలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య బంధం విచ్చిన్నం కాకుండా బంధం బలపడుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ వాదించుకున్న తర్వాత జరిగిన విషయం గురించి ఇద్దరూ లోతుగా  ఆలోచించాలి.  ఇది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ప్రతి గొడవ తర్వాత భార్యాభర్తలు తమ భాగస్వాములను మరింత అర్థం చేసుకోగలిగితే,  సమస్య ఎందుకు వచ్చిందనే విషయాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ బంధం ఆరోగ్యకరంగా ఉంటుంది. భార్యాభర్తల మద్య గొడవ ఏదైనా అనుమానం, హింస,  కోపం, నియంత్రించడం,  భయపెట్టడం వంటి విషయాల ద్వారా చోటు చేసుకుంటే అది బార్యాభర్తల మద్య బంధాన్ని నాశనం చేస్తుంది. భార్యాభర్తల మధ్య  ఎన్ని గొడవలు జరిగినా అది చివరికి పరిష్కారం అవ్వాలి.  అలా ఉన్నప్పుడే ఆ బందం అందంగా, ఆనందంగా ఉంటుంది.  భార్యాభర్తలు కూడా ఇలాంటి గొడవల వల్ల దూరం కాకుండా ఉంటారు.  కానీ గొడవలు నిరంతరం జరుగుతూ పరిష్కారం మాత్రం జరగకపోతే ఆ బంధాలు ఎక్కువ కాలం నిలవవు.                                  *రూపశ్రీ.
  అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది.  దీనికి కారణం కేవలం బయట సమాజంలో కాదు.. ఇద్దరు వ్యక్తుల మద్య అభద్రతాభావం.  తమ స్థానం ఎక్కడ బలహీనం అవుతుందో అని అత్తగారు,  తనకు తన మాటకు ఎక్కడ విలువ లేకుండా పోతుందో అని కోడలు ఇద్దరూ తమ తమ పంతాలకు పోవడం వల్ల అత్తాకోడళ్ల మధ్య విభేదాలు వస్తుంటాయి. అయితే కొన్ని మ్యాజిక్ చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలు పాటించడం వల్ల అత్తాకోడళ్ల బంధం ఎంతో పదిలంగా,  బలంగా,  సంతోషంగా ఉంటుంది.  ఆ  మ్యాజిక్ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. నేటి కోడలే రేపటి అత్తగారు, ఇప్పటి అత్తగారు ఒకప్పుడు కోడలు  అనే మాట వినే ఉంటారు. అత్తగారి జీవితంలో అంచనాలు ఉంటాయి,  అనుభవాలు ఉంటాయి. కానీ కోడలి జీవితంలో ఆధునికత,  కలలు,  భవిష్యత్తు గురించి ఆశలు ఉంటాయి.  ఇవి రెండూ విరుద్దంగా అనిపిస్తాయి. అందుకే అత్తాకోడళ్ల మధ్య వ్యతిరేకత తలెత్తుతూ ఉంటుంది. అంచనాల గురించి ఓపెన్ గా.. కోడలి మీద అత్తకు, అత్త గురించి కోడలికి కొన్ని అంచనాలు ఉంటాయి.  అయితే విషయాన్ని మనసులో పెట్టుకుని ఎదుటి వారు,  వారికి వారే అర్థం చేసుకుని తమకు నచ్చినట్టు ఉండాలని అనుకోవడం పిచ్చితనం. ఇంటి బాధ్యతలు కోడలితో ఏవి పంచుకోవాలని అనుకుంటారో అత్తగారు ఓపెన్ గా చెప్పాలి. అలాగే కోడలు కూడా తన కెరీర్,  ప్రాధాన్యాల గురించి ఓపెన్ గా తన అత్తగారితో చెప్పాలి.  ఎందుకంటే అంచనాలు నెరవేరకపోతే అత్తాకోడళ్ల బంధం దెబ్బతింటుంది. అందుకే ముందే ఇలా ఓపెన్ గా మాట్లాడుకుంటే మంచిది. ప్రేమతోనే సరిహద్దులు.. అత్తాకోడళ్లు ఒకరి విషయంలో ఒకరు జోక్యం చేసుకోవడం వల్ల చాలా గొడవలు జరుగుతుంటాయి.  చాలా సార్లు అత్తలు తమ ఆధిపత్యం చూపించాలని ప్రయత్నిస్తారు. కానీ అత్తాకోడళ్లు ప్రేమగానే మాట్లాడుకుని తమ సరిహద్దులు విధించుకుంటే చాలా వరకు గొడవలు రాకుండా ఉంటాయి. కానీ ఇద్దరూ ఒకరి విషయాలలో మరొకరు ఎక్కువ జోక్యం చేసుకుంటే పెద్ద గొడవలు జరుగుతాయి. గతం, అనుభవాలు... అత్త జీవితంలో అనుభవాలు చాలా ఉంటాయి. అలాగే కోడలి జీవితంలో అనుభవాలు ఉంటాయి. అత్తగారు తాను జీవితంలో ఎదుర్కున్న సమస్యలు, కుటుంబ పరంగా ఎదుర్కున్న కష్టాలు, చేసిన పోరాటాలు కోడలితో చెప్పుకుంటూ ఉండాలి, కోడలు తన చిన్నతనం తను పెరిగిన విధానం,  తన కష్టం,  భవిష్యత్తు గురించి తన ఆశలు చెప్పుకోవాలి. ఇవి ఇద్దరి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేలా చేస్తాయి. అంతేకాదు.. అత్తాకోడళ్లు ఒకే ఇంట్లో ఉంటారు.  ఆ ఇల్లు సంతోషంగా, ఎంతో బాగా అబివృద్ది చెందాలంటే అత్తాకోడళ్లు ఇద్దరూ అవగాహనతో ఉండటం ముఖ్యం.   నిర్ణయాలు.. అత్తాకోఢల్లు ఇద్దరూ ఒక్కమాట మీద ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుంది.  అందుకే ఏ విషయం గురించి అయినా ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలి.  కోడలు ఇలాగే ఉండాలనే నియమాలు విధించడం అత్తగారి గొప్పతనం అనిపించుకోదు, అత్తగారు చెప్పే ఏ విషయం గురించైనా ఆలోచించకుండా వ్యతిరేకత చూపడం కోడలి తెలివి అనిపించుకోదు. అత్తాకోడళ్లు ఇద్దరూ మాట్లాడుకుని వారి ఇగో సాటిసిపై అయ్యే దిశగా కాకుండా జీవితం గురించి, ఇంచి అబివృద్ది గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పొగడ్తలు.. గొప్ప మెడిసిన్.. బంధం ఆరోగ్యంగా ఉండటంలో పొగడ్తలు చాలా గొప్పగా పనిచేస్తాయి.   అత్తగారు ఏదైనా బాగా చేసినప్పుడు కోడలు,  కోడలు ఏదైనా పనిని బాగా చేసినప్పుడు అత్తగారు.. ఒకరిని ఒకరు మెచ్చుకోవడం చేయాలి.  ఇలా మెచ్చుకోవడం ఇద్దరి మద్య బందాన్ని బలంగా మార్చుతుంది. అంతేకాదు.. ఒకరి మంచి అలవాట్లను మరొకరు మెచ్చుకోవడం, ఒకరికి ఒకరు మంచి స్నేహితురాలిగా ఉండటం వల్ల అత్తాకోడళ్ల బందం పదిలంగా ఉంటుంది.                              *రూపశ్రీ.
జ్ఞాపకం అంటే జరిగిపోయిన ఒక సంఘటన తాలుకూ సందర్భాలు, మాటలు,  మనుషులు గుర్తుండిపోవడం.   ఇవి సంతోషం కలిగించేవి అయితే గుర్తు వచ్చిన ప్రతిసారీ సంతోషాన్నే కలిగిస్తాయి. కానీ.. అవి బాధపెట్టే విషయాలు అయితే మాత్రం వాటి ప్రభావం మామూలుగా ఉండదు. కొన్నిసార్లు గత సంఘటనలు,  జ్ఞాపకాలు హృదయంలో లోతైన గాయాన్ని మిగిల్చుతాయి. అలాంటి సమయాల్లో లోలోపలే నలిగిపోతాడు.  చాలా నరకం అనుభవిస్తాడు.  ఒంటరితనం ఫీలవుతాడు. కానీ  ఒంటరిగా అనిపించడం అంటే జీవితంలో చాలా విషయాల మీద ప్రభావం చూపిస్తుంది.  దీన్నుండి బయటకు రావడానికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. అంగీకారం.. బాధాకరమైన జ్ఞాపకాల నుండి బయటపడటానికి వాటిని అణచివేయడం కంటే అంగీకరించడం చాలా ముఖ్యం. సత్యాన్ని అంగీకరించడం ముందుకు సాగడానికి మొదటి అడుగు. కాబట్టి జరిగినవి ఏవైనా సరే.. వాటిని అంగీకరించాలి.  ఒకరు మోసం చేసినా, నమ్మక ద్రోహం చేసినా,  నష్టం కలిగినా.. ఇలా ఏదైనా సరే..  దాన్ని అంగీకరించి ముందుకు సాగాలి.  ఇలా చేస్తే జ్ఞాపకాలు బాధపెట్టవు. షేరింగ్.. జ్ఞాపకాలు బాధపెట్టినప్పుడు బాధను అందరితో పంచుకోవడం తప్పు. కుటుంబ సభ్యులు,  అర్థం చేసుకునే స్నేహితులు, లేదా కౌన్సిలర్ లతో జరిగింది చెప్పుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు కొన్ని విషయాలను విశ్లేషణ చేసుకుని ఆలోచించే సామర్థ్యం ఉండదు. అదే ఇలా అర్థం చేసుకోగలిగే వారు ఉంటే .. జరిగిన విషయం గురించి మంచి వివరణ, సలహా, ఊరట కలిగే విధంగా మాట్లాడటం వంటివి చేయగలుగుతారు. వ్యక్తీకరణ.. బాధను వ్యక్తీకరించడం కూడా ఒక కళే.. డైరీ రాయడం లేదా కళ-సృజనాత్మకత ద్వారా  భావాలను వ్యక్తపరచడం కూడా ఉపశమనం కలిగిస్తుంది. మనసులో ఉన్న భావాలను కాగితంపై పెట్టడం మంచి చికిత్స. అంతే కాదు.. బాధ నుండి బయటకు రావడానికి ఆ అక్షరాలే సహాయం చేస్తాయి. ధ్యానం, యోగ.. ధ్యానం,  యోగా సహాయం తీసుకోవడం కూడా జ్ఞాపకాల మిగుల్చే బాధ నుండి బయటకు రావడానికి సహాయపడుతుంది. ఇది మనస్సును ప్రశాంతపరచడమే కాకుండా వర్తమానంలో జీవించడం కూడా నేర్పుతుంది. బాధకు సమయం ఇవ్వవద్దు.. బిజీగా ఉండటం,  కొత్త అభిరుచులను అలవాటు చేసుకోవడం,  ఏదో ఒక కొత్త పనిని చేయడం లేదా నేర్చుకోవడం  వలన జ్ఞాపకాల నుండి దూరం కావడానికి సహాయపడుతుంది.  కొత్త వాటిలో మునిగిపోయినప్పుడు బాధాకరమైన విషయాలు మసకబారుతాయి. అసలు వాటి గురించి ఆలోచించే అంత సమయం ఉండకుండా చూసుకోవాలి. జీవనశైలి.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం కూడా చాలా ముఖ్యం. బాగా తినడం, తగినంత నిద్రపోవడం,  క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల  మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయవచ్చు.                                      *రూపశ్రీ.  
రాజకీయాలకు అలవాటు పడిన నాయకులు వాటిని వదులు కోవడానికి ఇష్టపడరు.  ఏదో ఆవేశంలో రాజకీయ వైరాగ్యం కలిగినా, మరీ ఆవేశపడి రాజకీయ సన్యాసం తీసుకున్నానంటూ ప్రకటనలు చేసేసినా.. ఆ ఆవేశం తగ్గాకా మళ్లీ వాళ్ల చూపు రాజకీయలవైపే అంటుంది. అడుగులు కూడా రాజకీయం వైపే పడతాయి. ఒక లగడపాటి రాజగోపాల్ అయినా, మరో ఉండవల్లి అరుణ్ కుమార్ అయినా.. ఇంకో వడ్డే శోభనాదీశ్వరరావైనా అంతే. అవకాశం లేక, జనం మొచ్చక, ఒప్పక వీరంతా రాజకీయ ప్రకటనలకే పరిమితమయ్యారు. అయితే విజయసాయిరెడ్డి పరిస్థితి అది కాదు.విజయసాయి  అవేశంతో కంటే ఎంతో  ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.  ఎందుకంటే.. వైసీపీలో ఒక సమయంలో ఆయన జగన్ తరువాత జగనంతటి నాయకుడిగా వెలుగొందారు.  ఆయన రాజకీయ సన్యాసం ప్రకటించిన సమయంలో రాజకీయంగానే కాదు, కేసుల పరంగా కూడా నిండా మునిగి ఉన్నారు. ఇంత కాలం తన సర్వస్వం ధారపోసి పెంచిన పార్టీ దూరం పెట్టింది. అదే సమయంలో కేసులూ చుట్టుముట్టాయి. ఆ కేసుల నుంచి బయటపడాలంటే.. వైసీపీకి తాను దూరం అని నిరూపించుకోవాలి. అదే సమయంలో.. తన స్వేదంతో పెంచిన పార్టీలో.. తన ఉనికినే ప్రశ్నార్థకం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు అవకాశం రావాలంటే.. పోలిటికల్ గా తాను న్యూట్రల్ గా ఉన్నాననీ, ఉంటాననీ నిరూపించుకోవాలి. అందుకే ఆ సమయంలో విజయసాయి రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నట్లుగా ప్రకటించారని పరిశీలకులు విశ్లేషించారు. వారి విశ్లేషణలకు తగ్గట్టుగానే ఆయన వ్యవసాయమే వ్యాపకం అని ప్రకటించినా, సోషల్ మీడియా ద్వారా, చేయగలిగినంత రాజకీయం చేశారు. అలాగే కేసుల విచారణకు హాజరైన సందర్భంగా మీడియా ముందూ రాజకీయాలే మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టులకు ఆయన ఇచ్చిన లీకులే కారణమంటే అతిశయోక్తి కాదు. విజయసాయి వైసీపీ నుంచి బయటకు వచ్చి, రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మాటలు, చేతలు, అడుగులూ అన్నీ బయటకు జగన్ కోటరీ టార్గెట్ అన్నట్లు కనిపించినా.. ఆయన అసలు లక్ష్యం జగన్ అన్నట్లుగానే సాగాయి. అంతెందుకు విజయసాయి వైసీపీకి గుడ్ బై చెప్పిన తరువాత హైదరాబాద్ వెళ్లి మరీ  జగన్ సోదరి షర్మిలతో భేటీ అయ్యారు. ఆ తరువాత కూడా విజయసాయి పొలిటికల్ గా బీజేపీకి చేరువ అవుతున్నారన్న ప్రచారం జరిగింది.   ఇప్పుడు ఆ ప్రచారాలకీ, ఆ విశ్లేషణలకూ బలం చేకూర్చే విధంగా హిందుత్వకు మద్దతుగా ఆయన తన గళం వినిపించారు. అదీ అలా ఇలా కాదు.. వైసీపీ పునాదులే కదిలిపోయేంత గట్టిగా విజయసాయి బాం బు పేల్చారు. మొత్తంగా గత రెండు దశాబ్దాలుగా  జరిగిన మతమార్పిడులపై విచారణ జరిపించాలనీ, ఇందుకు ఒక కమిటీని వేయాలని విజయసాయి డిమాండ్ చేశారు. హిందుత్వకు ద్రోహం చేసిన వారిని ఎవరినీ విడిచిపెట్టకూడదని ఉద్ఘాటించారు. ఈ మాటల వెనుక ఆయన ఆయన ప్రధాన టార్గెట్ వైసీపీ అండ్ జగన్ అని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుందంటారు పరిశీలకులు. గత రెండు దశాబ్దాలుగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకూ జరిగిన మతమార్పిడులపై విచారణ జరిపించాలన్నది ఆయన చేసిన డిమాండ్.   వైఎస్ జమానాలో క్రైస్తవ మతంలోకి పెద్ద ఎత్తున మతమార్పిడులు జరగిన విషయం అందరికీ తెలి సిందే. ఇప్పుడు విజయసాయిరెడ్డి డిమాండ్  ద్వారా బీజేపీకి పదునైన ఆయుధాన్ని అందించారని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు విజయసాయి ప్రత్యక్ష రాజకీయాలలో లేకపోవచ్చు కానీ, బీజేపీ గొంతుక వినిపించారు.  తద్వారా తన అడుగులు ఎటు అన్న సంకేతాలు ఇచ్చారు. విజయసాయి కాషాయం పుచ్చుకుంటే.. జగన్ కు ఇక గడ్డుకాలమేనన్నది పరిశీలకుల విశ్లేషణ
  కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రెండేళ్ల కాంగ్రెస్‌ నయవంచన పాలన పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో నెరవేర్చని హామీలను పేర్కొంటూ ఛార్జ్‌షీట్‌ విడుదల చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల పాలైందని కేంద్ర మంత్రి అన్నారు. తెలంగాణలో కారు పార్టీ పోయి హస్తం పార్టీ దోపిడీ మాత్రం ఆగలేదని ఆయన అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లయినా 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయలంటే భూములు అమ్మవలసి వస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఏ ముఖం పెట్టుకొని ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సన్నం, ఉచిత బస్సు పథకాలను మాత్రమే ప్రచారం చేసుకుంటుందని, అందులో సన్నం బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం వాటనే ఎక్కువ ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విజయోత్సవాలు జరుపుకునే హక్కు ఎక్కడిదని ఎంపీ డీకే అరుణ అన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.4 వేలు ఏవి? రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ఎంత కేటాయించారని చెప్పాలని ప్రశ్నించారు  గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల హాయంలో తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల రాజ్యం కొనసగుతోందని కిషన్ రెడ్డి  తెలిపారు. ఈ మహాధర్నలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, మాజీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక, సొషలిష్ట అనే పదాలు 400 ఎంపీ సీట్ల ఇస్తే తొలగిస్తామనడం దారుణమన్ని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ పేరుతో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలను అణచివేసి ఆర్ఎస్ఎస్ విధానాలు పెంచిపోషించడం వల్ల దేశంలో అశాంతి నెలకొల్పుతున్నరన్నారు.  అలగే దేశంతో రూపాయి విలువ 56 రూపాయలు ఉన్నదాని 90 రూపాయల 30 పైసులు పడిపొవడాని నిర్మాల సీతారామన్న మంచిదే అన్నడం చాలా దారుణమన్నారు. దిని వల్ల ప్రజలు, రైతులు నష్టపోతారన్నారు. అలగే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ విద్యను ప్రైవేటికరణ చేసి చాల అన్యాయం చెస్తుందన్నారు. రాజ్యధాని పేరుతో మల్లి ల్యాండ పుల్లింగుకు పాల్పడుతుందన్నారు. డబ్బులంతా అమరావతిపై పెట్టి మల్లి ప్రాంతీయ ఉద్యమాలకు తెరతీస్తున్నారన్నారు.
ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం.  చలి ఎక్కువగా ఉన్నప్పుడు వెచ్చగా పడుకోవాలని అందరూ అనుకుంటారు. దీనికి తగ్గట్టే మందంగా ఉన్న దుప్పటిని నిండుగా కప్పుకొని పడుకుంటారు.  ఇలా పడుకున్నప్పుడు ఏకంగా ముఖాన్ని కూడా పూర్తీగా కవర్ చేసుకుని పడుకునే వారు ఎక్కువే ఉంటారు.  దీనివల్ల ముక్కు, నోరు, చెవులకు చలితీవ్రత సోకదని అనుకుంటారు. అయితే ఇలా పడుకోవడం మంచిదేనా? దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉందా? తెలుసుకుంటే.. చలికాలంలో నిండుగా దుప్పటి కప్పుకోవడం అనే అలవాటు వల్ల చలి నుండి ఉపశమనం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ  ఇలా చేయడం వల్ల  కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉన్న అదే గాలిని పదే పదే పీల్చుకుంటారు. తక్కువ ఆక్సిజన్, ఎక్కువ  కార్బన్ డయాక్సైడ్ ఉన్న గాలిలో నిద్రపోవడం మెదడుకు,  శరీరానికి హానికరం. ఈ అలవాటు నిద్ర నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా, కొన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు,  గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఫుల్ గా దుప్పటి కప్పుకుని నిద్రపోవడం వల్ల  శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఇది  మెదడు,  గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది.  ఇది మాత్రమే కాకుండా ఇలా నిద్రపోయే అలవాటు ఉన్నవారిలో ఉదయం తలనొప్పి, అలసట,  నోరు పొడిబారడం కూడా జరుగుతుందట.  12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. నోటి నుండి వచ్చే తేమ దుప్పటి  బట్టలో చిక్కుకుపోతుంది. దీని వలన దుప్పటి లోపల వాతావరణం వెచ్చగా,  తేమగా ఉంటుంది. ఈ వాతావరణం ఫంగస్  పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.  ముఖం మీద ఫుల్ గా దుప్పటి కప్పుకుని నిద్రపోవడం వల్ల ఈ అలెర్జీ కారకాలు నేరుగా ఊపిరితిత్తులలోకి వెళతాయి.  వీటి వల్ల  అలెర్జీలు,  శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెరుగుతుంది. ఆక్సిజన్ సరిగా  లేకపోవడం వల్ల  మెదడు రాత్రంతా విశ్రాంతి లేకుండా ఉంటుంది.   మంచి, గాఢమైన నిద్ర పట్టడం కష్టంగా ఉంటుంది.  ఒకవేళ నిద్ర పట్టినా ఉదయం లేవగానే తలనొప్పి, అలసట వంటివి ఏర్పడతాయి.   CO2కి అధికంగా గురికావడం వల్ల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది హృదయ స్పందన రేటు,  రక్తపోటును ప్రభావితం చేస్తుంది. అందుకే చలికాలంలో వెచ్చదనం కోసం ముఖాన్ని కూడా కప్పుకుని నిద్రపోవడానికి బదులు,  వెచ్చని దుస్తులు,  టోపి, కాళ్లకు సాక్స్ వంటివి ధరించి నిద్రపోవడం మంచిది. మరీ ముఖ్యంగా ఎంత చలి ఉన్నా ఫ్యాన్ ఉండాలి,  కానీ దుప్పటి కప్పుకోవాలి అని అనుకోకూడదు.                                            *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  లవంగాలు వంటింట్లో ఉండే ఒక మసాలా దినుసు.  చాలా రకాల ఆహార పదార్థాల తయారీలోనే కాకుండా ఔషధ గుణాలు ఉన్న కారణంగా ఏవైనా ఆరోగ్య సమస్యల కోసం కూడా లవంగాలను వాడుతుంటారు. చాలామంది రోజూ ఒక లవంగం తినడం లేదా లవంగాలు ఉడికించిన నీటిని తాగడం చేస్తుంటారు. ఇదంతా శరీరం డిటాక్స్ కావాలని, శరీరంలో ఉండే చెడు పదార్థాలు,  మలినాలు తొలగిపోవాలని, రోగనిరోధక శక్తి బలంగా మారాలని చేస్తుంటారు. అయితే మంచి లవంగాలకు బదులు నకిలీ లవంగాలను వాడితే మాత్రం ఆరోగ్యానికి మేలు జరగకపోగా.. బోలెడు నష్టాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అసలు కల్తీ లవంగాలను ఎలా కనిపెట్టాలి? కల్తీ లవంగాలు తినడం వల్ల కలిగే నష్టాలేంటి? తెలుసుకుంటే.. కల్తీ లేదా నకిలీ లవంగాలు.. మార్కెట్లో లభించేవన్నీ మంచి లవంగాలు అనుకుంటే పొరపాటు.  చాలా వరకు లవంగాలలో నూనెను సేకరించి, వాటిలో వాసన, సారం అనేవి అన్నీ కోల్పోయాక వాటిని అమ్ముతుంటారు. కొందరేమో వాసన, సారం, నూనె కోల్పోయిన లవంగాలకు రసాయనాలు జోడించి వాటిని అమ్ముతుంటారు. ఇవ్నీ కల్తీ లేదా నకిలీ లవంగాలు అని ఆహార నిపుణులు అంటున్నారు. ఈ లవంగాలు ఎటువంటి ప్రయోజనాలను అందించవు.  ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కల్తీ లవంగాలు జీర్ణం కావడం కష్టం,  గ్యాస్, కడుపు నొప్పి, ఆమ్లతత్వం,  వికారం వంటి సమస్యలకు ఇవి కారణం అవుతాయి. కల్తీ లేదా నకిలీ లవంగాలు తినడం వల్ల కలిగే నష్టాలు.. పుఢ్ పాయిజన్.. సరిగ్గా తయారు చేయని లేదా రసాయనాలతో కల్తీ  చేయబడిన లవంగాలు ఫుడ్ పాయిజన్ కు  కారణమవుతాయి. దీని వలన వాంతులు, విరేచనాలు, బలహీనత,  తీవ్రమైన కడుపు తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో వాపు, తలనొప్పి.. నిజమైన లవంగాలు మంటను తగ్గిస్తాయి. కానీ నకిలీ లేదా కల్తీ  లవంగాలు ఈ లక్షణాలను కలిగి ఉండవు. బదులుగా అవి శరీరంలో మంటను పెంచుతాయి. కల్తీ లవంగాలకు రంగు,  సువాసన కోసం రసాయనాలను కలిపి ఉంటారు. ఇవి తలనొప్పి,  తలతిరుగుటకు కారణమవుతాయి. రోగనిరోధక శక్తి మటాష్.. నిజమైన లవంగాలు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. కానీ నకిలీ లవంగాలు శరీరానికి ఎటువంటి ప్రయోజనాలను అందించవు. ఎక్కువ కాలం నకిలీ లేదా కల్తీ లవంగాలను ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది. లివర్ నాశనమే.. చవకగా లభించే లవంగాలు,  రసాయనాలతో కల్తీ చేసిన సుగంధ ద్రవ్యాలు  కాలేయానికి క్రమంగా హాని కలిగిస్తాయి. ఇవి వెంటనే వాటి దుష్ప్రభావాలు బయటకి కనిపించేలా చేయకపోయినా వీటి నష్టం క్రమంగా బయటపడుతూ ఉంటుంది. నకిలీ లేదా కల్తీ లవంగాలు గుర్తించడం ఎలా.. ఒక గ్లాసు నీరు తీసుకొని కొన్ని లవంగాలు వేయాలి. లవంగాలు కల్తీ కాకపోతే అవి  మునిగిపోతాయి, కానీ అవి కల్తీ అయితే తేలుతాయి. అంతేకాదు.. లవంగాల నుండి నకిలీ రంగులు,  రసాయనాలు విడుదల కావడం కూడా కనిపిస్తుంది. నిజమైన లవంగాలు మంచి సువాసన, ఎక్కువకాలం కలిగి ఉంటాయి.  అదే నకిలీ లవంగాలు వాసన ఉండవు,  రంగు కూడా నిజమైన వాటితో పోలిస్తే వేరుగా ఉంటాయి. నకిలీ లవంగాలు నల్లగా,  పొడిగా,  బరువు లేకుండా తేలికగా,  చాలా సులభంగా విరిగిపోయేలా ఉంటాయి.                                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  ఆయుర్వేదంలో ఉసిరికాయను "అమృతఫలం" అని పిలుస్తారు.  అంటే అమృతంతో సమానమైన ఔషద గుణాలు కలిగిన ఫలం. అమృతంలాగా శరీరానికి గొప్ప ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది అని అర్థం.  ఉసిరికాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కానీ ఉసిరికాయ వల్ల అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలగాలంటే ఉసిరికాయను తినే విధానం చాలా ముఖ్యం అని ఆయుర్వేదం చెబుతోంది.   అసలు ఉసిరికాయను ఎలా తినాలి? ఆయుర్వేదం చెప్పిన ఆ విధానంలో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే.. ఉసిరికాయ ఉడికించి.. ఉసిరికాయను జ్యూస్ లాగా,  పచ్చిగా తినడం చూసే ఉంటారు. చాలామంది ఊరగాయ లాగా నిల్వ చేసుకుని కూడా తింటారు.  అయితే ఉసిరికాయను అలా కాకుండా ఆవిరి మీద ఉడికించి తింటే మ్యాజిక్ ఫలితాలు ఉంటాయట.  ఆవిరి మీద ఉడికించడం వల్ల ఉసిరికాయలో ఉండే విటమిన్-సి చెక్కు చెదరదని ఆయుర్వేద నిపుణులు కొందరు చెబుతున్నారు. ఉడికించిన ఉసిరికాయ ప్రయోజనాలు.. రోగనిరోధక వ్యవస్థ.. ఉడికించిన ఉసిరికాయలో  విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది,  ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.  జలుబు,  దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్లు,  అనారోగ్యాలతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. జీర్ణక్రియ.. ఉడికించిన ఉసిరికాయ  జీవక్రియను మెరుగుపరుస్తుంది,  మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.  ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన గట్ ఫ్లోరాకు ఇది  సహాయపడుతుంది.  చర్మం,  జుట్టు.. ఉసిరికాయ అందాన్ని చేకూర్చే  అద్భుతమైన ఫలం. ఉడికించిన ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు,  విటమిన్ సి చర్మ స్థితిస్థాపకతను కాపాడుకోవడానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది. జుట్టు కుదుళ్లకు  పోషణ ఇస్తుంది.  జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది,  జుట్టును మందంగా, బలంగా,  మెరిసేలా చేస్తుంది. గుండె జబ్బులు.. ఉడికించిన ఉసిరికాయ గుండె ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి,  మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బులు,  అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉసిరిలో ఉండే  శోథ నిరోధక లక్షణాలు శరీరంలో మంట,  చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. కంటి చూపు.. విటమిన్ సి,  ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. ఉసిరికాయను  క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వయస్సు సంబంధిత కంటి సమస్యలైన మాక్యులర్ డీజెనరేషన్,  కంటిశుక్లం వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎలా తినాలంటే.. ఒక తాజా ఉసిరికాయను  బాగా కడిగాలి.  ఒక కుండలో లేదా బౌల్ లో నీరు పోసి పైన ఒక చెల్లు ప్లేట్ లేదా గిన్నె ఉంచి అందులో ఉసిరికాయను వేసి పైన మూత పెట్టాలి.  5నుండి 10 నిమిషాలలో ఉసిరికాయ మెత్తబడుతుంది.  ఆ తర్వాత దాన్ని బయటకు తీసి చల్లబడిన తర్వాత నమిలి నేరుగా తినవచ్చు.       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...                          
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.