పెళ్లైన ప్రతి జంట తప్పకుండా ఈ కారణాల వల్ల  గొడవలు పడతారట..!

 


పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట మధ్య కొన్ని గొడవలు కామన్ గా జరుగుతాయని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు.పెళ్లయ్యాక ప్రతి జంట మధ్య జరిగే కామన్ గొడవలు ఏంటో తెలుసుకుంటే.. ఇవి అందరి మధ్యన జరుగుతాయి కాబట్టి వీటిని సీరియస్ గా తీసుకుని బంధాన్ని విచ్చిన్నం చేసుకోకూడదు అని ప్రతి జంట అర్థం చేసుకోగలుగుతుంది.  ఇంతకీ అందరు భార్యాభర్తల మధ్య కామన్ గా జరిగే గొడవలు ఏంటో తెలుసుకుంటే..

తల్లిదండ్రుల శైలి..

భార్యాభర్తల ఇద్దరి తల్లిదండ్రులు ఒకరి కుటుంబ విధానాన్ని మరొకరు విమర్శించుకోవడం చాలా కుటుంబాలలో కనిపిస్తుంది. ఒకరేమో చాలా నిర్లక్ష్యంగా పెంచారు అనే నిందలు వేస్తుంటారు, మరొకరు ఏమో ఏమీ చేత కాకుండా పెంచారని అంటారు, కొన్నిసార్లు చాలా స్ట్రిక్ట్ గా పెంచి పిరికివాళ్లుగా మార్చారని అంటారు.  ఇలా రెండు కుటుంబాలలో విబిన్న విధాలుగా పెంపకం ఉంటుంది.  పెళ్లైన తర్వాత వారికి చిన్నతనం నుండి అలవాటైన విధానం ఇప్పుడు కూడా కొనసాగాలని కోరుకుంటారు.   అంతేకాదు.. తమ చిన్నతనం ఎలా గడిచిందో అదే విధంగా తమ పిల్లలను కూడా పెంచాలని చూస్తారు. ఇది ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో సాగే గొడవ.  దీన్ని వీలైనంత చాకచక్యంగా పరిష్కరించుకోవాలి.

డబ్బు..

డబ్బు చాలా ముఖ్యమైన అంశం.  కొన్ని కుటుంబాలు డబ్బుల విషయంలో చాలా ఆంక్షలు విధిస్తూ పెంచుతారు. మరికొన్ని కుటుంబాలు డబ్బు అనేది పిల్లల కోసమే కదా అనే ఆలోచనతో పిల్లలకు డబ్బు అలవాటు చేస్తారు, డబ్బు వల్ల వచ్చే సమస్యలు కొన్నిసార్లు చాలా తీవ్రమైన గొడవలకు కారణం అవుతాయి. భార్యాభర్తల అభిరుచులు డబ్బు విషయంలో ఒకటిగా ఉంటే పర్లేదు. కానీ ఒకరు పొదుపరి,  మరొకరు బాగా ఖర్చు పెట్టేవారు అయితే చాలా గొడవలు వస్తుంటాయి.  ముఖ్యంగా ఎప్పడైనా డబ్బు కారణంగా ఇంట్లో  ఆర్థిక సమస్యలు వస్తే జరిగే గొడవలు చాలా పెద్దగా ఉంటాయి.

సాన్నిహిత్యం..

భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే వారి మధ్య సాన్నిహిత్యం కూడా చాలా బాగుండాలి. ఒకరు తమ ప్రేమను ఎక్స్పెస్ చేయగలిగితే మరొకరు అలా ప్రేమను ఎక్ప్రెస్ చేయకుండా తమలోనే దాచుకుంటారు.  దీని వల్ల ఒకరి మీద ఒకరికి విబిన్న అభిప్రాయాలు ఏర్పడతాయి.  ప్రేమించడం తెలియదు, ప్రేమ లేదు,  ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్నారు వంటి అపార్థాలు వస్తాయి.  ఎప్పుడు ప్రేమ గురించి తప్ప బాధ్యతగా ఉంటున్నానని ఆలోచించట్లేదు అని మరొకరు అనుకుంటారు. ఇలా చాలా విధాలుగా అపార్థాలు వస్తుంటాయి.

భవిష్యత్తు..

పెళ్లైన ప్రతి జంటకు భవిష్యత్తు గురించి కొన్ని కలలు ఉంటాయి. పిల్లల కోసం ఒకరు కష్టపడతారు, మరొకరు కెరీర్ ను కూడా వదిలేసుకుంటారు.  జీవితంలో లక్ష్యాల కోసం ఒకరు ఆరాటపడతారు,  నేను ఎన్ని త్యాగాలు చేసినా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఒకరు అనుకుంటారు.  ఇలా చాలా విధాలుగా ఇద్దరూ తమలో తాము సంఘర్షణ పడుతుంటారు.  వీటి వల్ల కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి.

పైన పేర్కొన్న  ప్రతి గొడవ పెళ్లైన ప్రతి జంట మధ్య తప్పనిసరిగా జరుగుతుంది.  కేవలం తమ మద్య మాత్రమే గొడవ జరుగుతుందనే ఆలోచన చేస్తూ గొడవ జరిగినప్పుడు దానికి గల కారణాన్ని సమస్యగా చూసి దాన్ని పరిష్కరించుకోవాలి. అంతే కానీ భాగస్వామినే సమస్యగా చూస్తే ఆ బందం పెళుసుగా మారుతుంది.  అంతేకాదు.. భార్యాభర్తల మద్య గొడవలు జరిగినప్పుడు,  సమస్య వచ్చినప్పుడు రాజీ పడటం ప్రధానం.  ఎవరో ఒకరు రాజీ పడితే తప్ప బందం నిలవదు.  రాజీ పడటం అంటే తాము ఓడిపోవడం,  చిన్నతనం కావడం కాదు.. బంధాన్ని నిలబెట్టుకోవడం.  

                        *రూపశ్రీ. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu