"నేను బాలూలా పుట్టాలి"- కె.బాలచందర్

posted on: May 29, 2012 4:46PM

"అంతులేని కథ, గుప్పెడు మనసు, మరోచరిత్ర, ఇది కథ కాదు" వంటి అద్భుతమైన చలన చిత్రాలకు దర్శకత్వం వహించి, కమల్ హాసన్, రజనీ కాంత్ వంటి గొప్ప నటులను వెండి తెరకు పరిచయం చేసిన దర్శక శ్రేష్టుడు, దర్శక స్రష్ట కె.బాలచందర్ ఇటీవల ఒక టి.వి. కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు.

ఆ కార్యక్రమానికి గానగంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యాతగా ఉన్నారు. ఆ కార్యక్రమం జరుగుతున్న తీరూ, బాలు నడిపిస్తున్న తీరూ చూసిన బాలచందర్ "వచ్చే జన్మలో నాకు బాలూలా జన్మించాలని ఉంది" అని అన్నారు. ఇది విన్న బాలు ఆనందంతో, చెమర్చిన కన్నులతో "ఈ జన్మకు ఇది చాలు. నాకు ఇంతకంటే ఏ భారతరత్న అవార్డులూ అక్కరలేదండీ" అని అన్నారు. పక్కనే ఉన్న మరో అతిథి ప్రముఖ రచయిత ఆదివిష్ణు "బాలు మీలా దర్శకుడవుతాడు...మీరు బాలూలా గాయకులవ్వండి" అని అన్నారు...!

google-ad-img
    Related Sigment News
    • Loading...