LATEST NEWS
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సాధారణమే అయినా.. ఒక మంచి పనీ, మానవత్వంతో వేసిన అడుగును కూడా రాజకీయం చేయడం తగదంటూ పేర్ని నాని తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ జరిగిందేంటంటే.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తెలంగాణకు చెందిన నిరంజన్ అనే పవన్ కల్యాణ్ అభిమాని తీవ్ర అనోరోగ్యంతో బాధపడుతూ.. తన జీవితంలో పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారైనా కలవాలని ఆశపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. మానవత్వంతో స్వయంగా వెళ్లి ఆ 17 ఏళ్ల కుర్రాడిని కలిసి, అతనితో కొంత సమయం గడిపారు. వైద్యం కోసం ఆర్థిక సహాయం అందించారు. పవన్ కల్యాణ్ మానవత్వంతో స్పందించిన తీరు పట్ల రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచీ ప్రశంసలు వెల్లువెత్తాయి.
అయితే.. వైసిపి నేత పెర్ని నాని ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదనీ.. కానీ తెలంగాణలో ఎవడో ఒంట్లో బాలేదు అంటే వస్తున్నా తమ్ముడూ అంటూ వెళ్ళిపోయారంటూ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పేర్ని నానివి దిగజారుడు వ్యాఖ్యలను విమర్శలు వెల్లువెత్తుతుననాయి. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఒక బాలుడిని కూడా రాజకీయాల్లోకి లాగడం, ఆనారోగ్యంతో ఉన్న వ్యక్తిని వాడు అంటూ అనుచితంగా పేర్కొనడం దారుణమని నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిని మంచిగా చూడలేని ఇలాంటి సంకుచిత రాజకీయాలు సమాజానికి చెడు సంకేతాలు ఇస్తాయని దుయ్యపడతున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్న కల్వకుంట్ల కవిత.. దూకుడు పెంచారు. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును తన పార్టీ తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) లోకి రావలసిందిగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచీ.. ఆ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్న కవిత ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి తన తండ్రి కెసిఆర్‌ను టీఆర్ఎస్ లోకి రావాల్సిందిగా బంపరాఫర్ ఇచ్చారు. ఇటీవల ఒక జాతీయ టీవీ చానల్ కు కవిత ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం వస్తే తిరిగి సొంత గూటికి వెడతారా అన్న ప్రశ్రకు ఆమె భావోద్వేగంగా స్పందించారు.
బిఆర్ఎస్ పార్టీ నుండి తనను పంపించేటప్పుడు ఎదుర్కొన్న అవమానాలను గుర్తు చేస్తూ.. ఒక జీవిత కాలానికి సరిపడా అవమానాలను అక్కడ భరించానన్నారు. ఆ పార్టీలోకి మళ్లీ వెళ్లే ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టిన కవిత.. ఒకవేళ కెసిఆర్ స్వయంగా తన దగ్గరకు వస్తే.. తాను బిఆర్ఎస్‌లోకి వెళ్లడం కంటే, ఆయననే తన పార్టీ తెలంగాణ రక్షణ సమితి లో చేరాలని కోరతానన్నారు.
కవిత వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో ఆమె పలుమార్లు తన తండ్రి చుట్టూ దయ్యాలు చేరాయని పరోక్షంగా హరీష్ రావు తదితరులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడి కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించడం కవిత.. రాజకీయ పరిణతి చాటుకున్నారు.
దెందులూరు నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దెందులూరు వివాదం: విశ్లేషణ, వ్యూహాలు మరియు భవిష్యత్తు పరిణామాలుఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిణామాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. స్థానిక కూటమి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన మాజీ లీగల్ అడ్వైజర్ ఈడుపుగంటి శ్రీనివాస బాబుల మధ్య తలెత్తిన వ్యక్తిగత, రాజకీయ ఘర్షణ కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య నెలకొన్న వివాద తీవ్రత, దీని వెనుక ఉన్న వ్యూహాలు మరియు రాష్ట్ర రాజకీయాలపై దీని ప్రభావంపై ప్రత్యేక విశ్లేషణ.
రాజకీయ నేపథ్యం మరియు ఘర్షణకు గల కారణాలు2024 అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపు సమయంలో నరసాపురం, ఏలూరు పార్లమెంట్ స్థానాల సమీకరణాల వల్ల దెందులూరు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) టికెట్ ప్రకటన ఆలస్యమైంది. ఆ సమయంలో చింతమనేని ప్రభాకర్‌కు అత్యంత సన్నిహితుడిగా, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధిగా ఉన్న శ్రీనివాస బాబు స్వయంగా దెందులూరు టికెట్ కోసం ప్రయత్నించడం ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. చివరకు చింతమనేని టికెట్ సాధించి విజయం సాధించినప్పటికీ, అంతర్గత విభేదాలు సమసిపోలేదు.
ఇటీవల శ్రీనివాస బాబు కొన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నాయకులకు న్యాయవాదిగా బెయిల్ ఇప్పించడం, చింతమనేనిపై అవినీతి, ఇసుక అక్రమ రవాణా ఆరోపణలు చేయడంతో వివాదం ముదిరింది. సామాజిక మాధ్యమాల్లో ఇరువర్గాలు పరస్పరం కుటుంబ సభ్యులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసుకోవడం శాంతిభద్రతల సమస్యగా రూపాంతరం చెందింది. శ్రీనివాస బాబు ఇంటిపై చింతమనేని అనుచరుల దాడి, తదనంతర పరిణామాల్లో శ్రీనివాస బాబు అరెస్ట్ మరియు పార్టీ నుంచి సస్పెన్షన్ వంటి చర్యలు వేగంగా జరిగాయి.
రాజకీయ వ్యూహాలు మరియు పర్యవసానాలుఈ వివాదాన్ని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహాన్ని అమలు చేస్తోంది. దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌కు బలమైన ప్రత్యర్థిగా నిలబడగల లీగల్ బ్యాక్‌గ్రౌండ్, దూకుడు ఉన్న నాయకుడి కోసం వెతుకుతున్న వైసీపీకి శ్రీనివాస బాబు రూపంలో ఒక అవకాశం దొరికినట్లయింది. భవిష్యత్తులో ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు లభించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మరోవైపు, అధికార కూటమికి ఈ తరహా అంతర్గత ఘర్షణలు ప్రతిబంధకంగా మారుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కంటే ఇటువంటి వివాదాలే మీడియాలో మరియు సోషల్ మీడియాలో ఎక్కువగా హైలైట్ అవ్వడం ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందనే సంకేతాలు ఇవ్వడానికి శ్రీనివాస బాబుపై తక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ, చింతమనేని ప్రభాకర్ వంటి కీలక నేతల దూకుడు స్వభావం కూటమి మేనేజ్‌మెంట్‌కు సవాలుగా నిలుస్తోంది.
భవిష్యత్తు రాజకీయ ప్రభావందెందులూరు పరిణామాలు భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీయనున్నాయి. చింతమనేని ప్రభాకర్‌ను ఢీకొట్టేందుకు ప్రతిపక్షం శ్రీనివాస బాబును లేదా ఆయన కుటుంబ సభ్యులను ముందుంచే వ్యూహాన్ని రచిస్తోంది. అయితే, దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌కు ఉన్న గట్టి కేడర్ బేస్ మరియు సామాజికవర్గ మద్దతును అధిగమించడం ప్రతిపక్షానికి అంత సులువు కాదు. ఈ వివాదాల వల్ల ఇరుపక్షాల ఉమ్మడి మిత్రులు, బంధువులలో కొంత అసంతృప్తి నెలకొన్నప్పటికీ, అది ఓట్ల శాతాన్ని ఎంతవరకు మారుస్తుందనేది వేచి చూడాలి. రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులు తమ పబ్లిక్ ప్రవర్తనలో మరింత బాధ్యతగా వ్యవహరించకపోతే, ఇటువంటి ఘటనలు కూటమి ప్రభుత్వ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉంది
ALSO ON TELUGUONE N E W S
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కోలీవుడ్ స్టార్ జోసఫ్ విజయ్ నటించిన చివరి చిత్రం . అభిమానులు ఎంతో కాలంగా చూడాలని తపిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్నో సస్పెన్సులు, నాటకీయ పరిణామాల మధ్య ఈ భారీ చిత్రాన్ని జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా భవితవ్యం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చేతుల్లోనే ఉంది. జూన్ 19 నాటికి సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ అందుకోవాలని చిత్రబృందం తీవ్రంగా శ్రమిస్తోంది. ఒకవేళ అంతా సవ్యంగా సాగి గ్రీన్ సిగ్నల్ వస్తే.. జూన్ 26న థియేటర్లు దళపతి నినాదాలతో దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే ఈ విడుదలపై నిర్మాతలు ఒక ఊహించని కండిషన్ కూడా పెట్టుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. జూన్ 22 లోపు సెన్సార్ పూర్తి కాకపోతే, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలని కేవీఎన్ ప్రొడక్షన్స్ భావిస్తోంది. ఈ క్రమంలో బయ్యర్లకు నష్టం రాకుండా చూసేందుకు స్వయంగా విజయ్ కూడా తన రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తుండటం విశేషం.
టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్టులో విజయ్ సరసన పూజా హెగ్డే, మమిత బైజు కథానాయికలుగా నటించారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్‌గా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతుండగా, అనిరుధ్ రవిచందర్ బాణీలు సమకూర్చారు. వాస్తవానికి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9నే థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా.. పొలిటికల్ కంటెంట్ కారణంగా తీవ్రమైన వివాదాల్లో చిక్కుకుంది.
గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ సినిమాకు సెన్సార్ ఇబ్బందులు మొదలయ్యాయి. రివైజింగ్ కమిటీల సమీక్షలు, మద్రాస్ హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు నడిచిన న్యాయపోరాటాలు, ఆపై ఏప్రిల్ నెలలో ఆన్‌లైన్ లీకేజీల వంటి కోలుకోలేని దెబ్బలతో ఈ చిత్రం నెలల తరబడి ల్యాబ్‌కే పరిమితమైంది. విజయ్ పూర్తిస్థాయి పొలిటికల్ కెరీర్ ప్రారంభించడంతో ఈ సినిమాపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ఇండస్ట్రీలో విపరీతమైన బజ్ క్రియేట్ అయింది.
సోషల్ మీడియాలో సైతం 'జననాయగన్' హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. విజయ్ కెరీర్‌లోనే ఇది మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోతుందని, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా సెన్సార్ టాక్ ఎలా ఉండబోతుందో, ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
రెండున్నర దశాబ్దాల క్రితమే పల్లెటూళ్లలో ఉన్న ఆడవాళ్ళని ట్రాకర్లు వేసుకొని మరి తన మూవీ చూసేలా చేసిన హీరో నవీన్ వడ్డే.. ఎన్నో హిట్ చిత్రాలు తన ఖాతాలో ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లి, మనసిచ్చి చూడు చిత్రాల్లోని సాంగ్స్ అయితే నేటికీ మారుమోగిపోతుంటాయి. దాదాపు 10 సంవత్సరాల విరామం తర్వాత 'కానిస్టేబుల్ త్రిమూర్తులు'తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.ఈ క్రమంలోవరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత జీవితం, అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలని పంచుకుంటున్నారు. తాజాగా ఆయన తన ఆహారపు అలవాట్ల (Food Habits) గురించి వెల్లడించిన కొన్ని విషయాలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
చాలా మంది సెలబ్రిటీలు తమ ఫిట్‌నెస్ కోసం ఎంతో కఠినమైన నియమాలు పాటిస్తుంటారు. ఉదయాన్నే లైట్ బ్రేక్‌ఫాస్ట్, జ్యూస్‌లు వంటివి తీసుకుంటూ డైట్ మెయింటైన్ చేస్తుంటారు. కానీ వడ్డే నవీన్ లైఫ్‌స్టైల్, డైట్ ప్లాన్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఉదయం లేవగానే టిఫిన్ చేయరట. బ్రేక్‌ఫాస్ట్ స్థానంలో నేరుగా చికెన్ లేదా మరేదైనా భారీ నాన్-వెజ్ వంటకాన్ని లాగించేస్తానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఉదయాన్నే చికెన్ తినడం ఏంటని యాంకర్ ఆశ్చర్యపోగా, ఇది తన చిన్నప్పటి నుండి అలవాటైన డైట్ సీక్రెట్ అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు .
నవీన్ తన రోజువారీ ఆహారంలో నాన్-వెజ్‌కు విపరీతమైన ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. వారం పొడవునా దాదాపు ప్రతిరోజూ ఆయన మెనూలో చికెన్ లేదా మటన్ ఖచ్చితంగా ఉండాల్సిందేనట. సాధారణంగా హెవీ నాన్-వెజ్ తింటే బరువు పెరుగుతారని, జీర్ణక్రియ సమస్యలు వస్తాయని భావిస్తారు. కానీ తన శరీర తత్వానికి ఈ ఆహార శైలి ఎంతో బాగా సెట్ అయిందని, ఇదే తన ఎనర్జీ వెనుక ఉన్న రహస్యమని ఆయన పేర్కొన్నారు. సుమారు 10 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ ఆయన అంతే ఫిట్‌గా మరియు గ్లామరస్‌గా కనిపించడం వెనుక ఈ వింత డైట్ ప్లాన్ ఉందనే విషయం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Also read: Rajinikanth vs dhanush: నువ్వా నేనా!
'కానిస్టేబుల్ త్రిమూర్తులు'విషయానికి వస్తే తనే నిర్మాత కూడా .దాదాపు 200 పైగా కథలని
రిజెక్ట్ చేసిన తర్వాత ఆ మూవీతో వస్తున్నాడు. వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ అగ్ర నిర్మాతగా తెలుగు సినీ సీమలో ప్రత్యేక గుర్తింపు పొందాడు. దాసరి, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సర్దార్ పాపారాయుడు కి వడ్డే రమేష్ నే నిర్మాత.
టాలీవుడ్ లో రాబోయే భారీ ప్రాజెక్టుల విడుదల తేదీల విషయంలో ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, 2027లో విడుదల కాబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైన అగ్ర హీరోల చిత్రాల లైనప్ అంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. ఒక భారీ సినిమా విడుదల తేదీ మారితే, దాని ప్రభావం మిగిలిన అన్ని సినిమాలపై పడుతూ ఇండస్ట్రీలో ఒక పెద్ద చైన్ రియాక్షన్‌కు దారితీస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రతి క్రేజీ ప్రాజెక్ట్ కూడా తన పోటీ ప్రాజెక్టుల కదలికలను బట్టి తమ ప్లాన్స్‌ను నిరంతరం మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే పలు అగ్ర చిత్రాల మేకర్స్ తమ రిలీజ్ విండోస్ మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ రేసులో మొదటగా వినిపిస్తున్న అతిపెద్ద టాపిక్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ (Fauzi) చిత్రానికి సంబంధించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియడ్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలపై ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన బజ్ నడుస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ (Spirit) చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేయడానికి మేకర్స్ ఇప్పటికే ప్లాన్ చేశారు. అయితే, తాజా సమీకరణాల ప్రకారం ఆ డేట్ కి ‘ఫౌజీ’ మూవీ విడుదలయ్యే అవకాశముంది అంటున్నారు. అదే జరిగితే ‘స్పిరిట్’ కొత్త డేట్ ని లాక్ చేసుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు, టోటల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎస్.ఎస్. రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ విజువల్ వండర్ ‘వారణాసి’ (Varanasi) చిత్ర విడుదల తేదీ కూడా మారే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. గ్లోబల్ అడ్వెంచర్‌గా వస్తున్న ఈ సినిమాను మొదట 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని భావించారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల లేదా పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం వల్ల ‘వారణాసి’ చిత్రం అనుకున్న సమయానికి ఏప్రిల్‌లో థియేటర్లలోకి రాకపోతే, ఆ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవడానికి మరో భారీ చిత్రం లైన్ క్లియర్ చేసుకుంటోంది. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ (Dragon) చిత్ర యూనిట్ ఈ అవకాశాన్ని అందుకోవాలని చూస్తోంది.
‘డ్రాగన్’ సినిమాను 2027 జూన్ 11న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఒకవేళ ‘వారణాసి’ సినిమా ఏప్రిల్ రేసు నుంచి పక్కకు తప్పుకుంటే, తమ ‘డ్రాగన్’ సినిమాను ముందే అంటే 2027 ఏప్రిల్ నెలకు ప్రీపోన్ చేసి బాక్సాఫీస్ వద్ద సోలో విండోను సొంతం చేసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట.
ఇలా ప్రస్తుతానికి 2027 సంవత్సరంలో రాబోయే ప్రతి అగ్ర హీరో సినిమా విడుదల తేదీ పూర్తిగా ఇతర సినిమాలపైనే ఆధారపడి నడుస్తోంది. ఏఒక్క ప్రాజెక్ట్ డేట్ కొద్దిగా అటుఇటుగా షిఫ్ట్ అయినా, పోటీ ప్రాజెక్టుల తేదీలు కూడా ఆటోమేటిక్‌గా మారిపోతున్నాయి. ఒకరి డేట్‌ను బట్టి మరొకరు అడుగులు వేస్తూ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన పజిల్ లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. రాబోయే రోజుల్లో ఈ అగ్ర చిత్రాల అఫీషియల్ రిలీజ్ డేట్స్‌పై మరింత స్పష్టత వస్తే కానీ ఈ గందరగోళానికి తెరపడేలా లేదు.
మాజీ మామ, అల్లుళ్లు కేటగిరిలో రజినీకాంత్(Rajinikanth),ధనుష్(dhanush)ఉన్నా కూడా ఇంకా అభిమానుల దృష్టిలో మామ, అల్లుళ్లుగానే ఉన్నారు. పైగా ఇప్పటికి ఇద్దరకీ ఒకరంటే ఒకరికి అభిమానమే. పైగా మాజీ అల్లుడు పోస్ట్ లో రజినీ సినిమాకి ఫ్యాన్ గా వెళ్లి థియేటర్ లో గత్తర కూడా లేపుతుంటాడు ధనుష్. అందుకే ఈ ఇద్దర్ని మామ అల్లుళ్ళుగా ఫ్యాన్స్ పిలుచుకుంటూ ఉంటారు.
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ 'జైలర్ 2' షూటింగ్ ఇప్పటికే దాదాపు చివరి దశకి చేరుకుంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు ధనుష్ అప్ కమింగ్ మూవీ 'ధనుష్ 55' శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. 'అమరన్' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు కావడంతో అంచనాలు పీక్ లో ఉన్నాయి.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ హై-వోల్టేజ్ డ్రామాను కూడా దీపావళి టార్గెట్‌గానే థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇలా ఒకే సమయంలో మాజీ మామ, అల్లుడు పోటీ పడుతుండటంతో అటు అభిమానుల్లోనే కాకుండా ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది.
Also read: Deewana: దీవాన మూవీ ఫస్ట్ రివ్యూ.. హర్షిత్ రెడ్డి లవ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్!
ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఒకవైపు 'జైలర్ 2' చిత్రానికి ఉన్న భారీ బ్రాండ్ ఇమేజ్, నెల్సన్ డార్క్ కామెడీ యాక్షన్ స్టైల్ సినిమాపై విపరీతమైన క్రేజ్ పెంచుతుండగా, మరోవైపు ధనుష్ కంటెంట్ ఓరియెంటెడ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, రాజ్ కుమార్ పెరియసామి మేకింగ్ స్టైల్ గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. గతంలో రజనీకాంత్, ధనుష్ కలిసి ఎన్నో పండుగలను ఒకే ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయిన తర్వాత వీరిద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి కావడం విశేషం.
స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హ్యాండ్ పడిన మూవీ హిట్ కి దారిని వెతుక్కోవడం ఖాయమనే నానుడి అనాది సినీ ఆచారంగా వస్తుంది. ప్రేక్షకులు కూడా అదే సెంటిమెంట్ ని ఫిక్స్ అయ్యి థియేటర్స్ బాట పట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు అదే ఆలోచనతో రేపు రిలీజ్ కాబోతున్న 'దీవానా'ని చూస్తూ ఉన్నారు.
'మెయిల్', 'శుభం', 'కల్కి 2898 ఏడీ' వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షిత్ రెడ్డి, ఇప్పుడు 'దీవానా' తో పూర్తి స్థాయి హీరోగా వస్తున్నాడు. లవ్ ఓరియెంటెడ్ మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కగా శ్రీకాంత్ సంగీశెట్టి దర్శకుడు. తమిళ భామ స్నేహా మణిమేగలై హీరోయిన్‌గా పరిచయమవుతోంది. అరహా మీడియా, వి స్టూడియోస్ పతాకాలపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించగా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమైంది. సినిమా విడుదలకు ముందే ఇండస్ట్రీ సర్కిల్స్ మరియు ప్రీమియర్స్ నుండి అందుతున్న ఫస్ట్ రివ్యూస్ ఆధారంగా ఈ సినిమా విశేషాలు మరియు అంచనాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
'దీవాన' సినిమా కథ విషయానికి వస్తే, ఇందులో హీరో హర్షిత్ రెడ్డి 'మున్నా' అనే పక్కా ఓల్డ్ సిటీ హైదరాబాద్ కుర్రాడిగా కనిపించనున్నాడు. హైదరాబాద్ స్థానిక లైఫ్ స్టైల్, ఇక్కడి కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో మున్నా పాత్రకు ఉండే యాటిట్యూడ్, రఫ్‌నెస్, మాస్ ఎనర్జీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. నిజ జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో, ఎవరి కోసమో లేదా దేని కోసమో 'దీవాన' (పిచ్చివాడు) అవుతారని, ఈ సినిమాలో ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన ఒక సాధారణ కుర్రాడి భావోద్వేగాలను దర్శకుడు ఎంతో సహజంగా ఆవిష్కరించారని టాక్. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరో స్నేహితులుగా నటించిన వారంతా లోకల్ హైదరాబాద్ కుర్రాళ్లు కావడంతో, వారి మధ్య వచ్చే కామెడీ, డైలాగ్స్ పక్కా లోకల్ ఫ్లేవర్‌తో థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయమని తెలుస్తోంది.
ఈ సినిమా మేకింగ్ వెనుక చిత్ర యూనిట్ పడిన కష్టం, తీసుకున్న శ్రద్ధ అమోఘం. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఉండేందుకు ప్రతి షెడ్యూల్ కంటే ముందు భారీగా వర్క్‌షాప్స్ నిర్వహించారు. కేవలం 3 రోజుల షూటింగ్ కోసం ఏకంగా 10 రోజుల పాటు వర్క్‌షాప్స్ చేసి నటీనటులను సన్నద్ధం చేయడం విశేషం. ఈ తీవ్రమైన హోంవర్క్ కారణంగానే సినిమాను ఎలాంటి రీషూట్లు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయగలిగారు. అంతేకాకుండా, సినిమాలోని చాలా భాగం సెట్స్ వేయకుండా హైదరాబాద్‌లోని రియల్ లొకేషన్లలోనే షూట్ చేశారు. సన్నివేశాల్లో కనిపించే రద్దీ అంతా షూటింగ్ చూడటానికి వచ్చిన నిజమైన ప్రజలే కావడం విశేషం, ఇది సినిమాకి మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది.
Also read: VIjay: విజయ్, ఉదయనిధి కలిసి గెలిచారు.. తెరపైకి వచ్చిన సరికొత్త విజయం
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన హైలైట్ ఏమిటంటే.. దీని ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్. ఇప్పటివరకు తెలుగు తెరపై ఎన్నో ప్రేమకథలు చూసినప్పటికీ, 'దీవాన' చిత్రంలో ఒక సరికొత్త ఎమోషనల్ పాయింట్‌ను టచ్ చేశారని, ఆ ట్విస్ట్ ప్రేక్షకులను ఒక్కసారిగా షాక్‌కు గురి చేస్తుందని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉంది. ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను టీజర్ లేదా ట్రైలర్‌లో ఎక్కడా రివీల్ చేయకుండా చాలా సస్పెన్స్‌గా ఉంచారు. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు 'అర్జున్ రెడ్డి' వైబ్స్ వస్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినప్పటికీ, ఆ సినిమాతో దీనికి ఎలాంటి సంబంధం లేదని, కేవలం హైదరాబాద్ యాస, అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్ వల్ల అలా అనిపించవచ్చని హీరో స్పష్టం చేశాడు. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన అల్లు అరవింద్ సినిమాను ఎంతగానో మెచ్చుకుని, గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేయడానికి ముందుకు రావడం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లింది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి. కానీ అంతవరకు అలాంటి అప్యాయత ఏమీ లేని భర్త అకస్మాత్తుగా మితిమీరిన ఆప్యాయతను చూపించడం, అధికంగా శ్రద్ధ చూపడం లేదా అంతకు ముందు ఎన్నడూ లేనంత సన్నిహితంగా ఉండటం వంటివి జరిగితే దాన్ని చాలా సులువుగా కొట్టి పారేయకూడదని అంటున్నారు రిలేషన్ నిపుణులు. ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిదని, ఇలాంటి మార్పు జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
విడాకుల ప్రమాదం..
భార్యాభర్తల బంధం ప్రారంభంలో మితిమీరిన ప్రేమతో ఉండే జంటలకు జీవితంలో తర్వాత విడాకులు తీసుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాల్లో తేలింది. పరిశోధకులు 168 జంటలను 13 సంవత్సరాల పాటు అనుసరించి ఈ విషయాన్ని వెలిబుచ్చారు. సంబంధం ప్రారంభంలో మితిమీరిన శృంగారభరితంగా , చాలా ఆనందంగా ప్రవర్తించే వారికి కాలక్రమేణా విడాకులు తీసుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారట.
మితిమీరిన ప్రేమ ఎందుకు ప్రమాదకరం?
సంబంధంలో నమ్మకం లేదా కమ్యూనికేషన్ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నమే మితిమీరిన ఆప్యాయత అని నిపుణులు చెబుతున్నారు. మితిమీరిన తీవ్రమైన ఆప్యాయత ఎక్కువకాలం నిలవదని అంటున్నారు. బంధం ప్రారంబైమనప్పుడు అతి చాలా చాలా మితిమీరి ఉంటే.. ఆ తరువాత ఆ బంధం శూన్యంగా మారే అవకాశం ఉంటుదని అంటున్నారు.
మితిమీరిన ప్రేమ ఎందుకు ప్రమాదం?
ప్రతి సంబంధంలోనూ ఒక మధురమైన దశ ఉంటుంది, ఆ సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు ఎంతో సన్నిహితంగా ఉంటారు. కానీ కాలక్రమేణా ఈ అనురాగం తగ్గిపోవడం సహజంగా జరుగుతుంది. భార్యాభర్తల బంధం మొదలైనప్పుడే ఎమోషన్ గా ఒకరిమీద మరొకరు ఆధారపడితే సమస్య తలెత్తుతుంది. మొదట్లో ఉన్న ప్రేమ, సాన్నిహిత్యం క్రమంగా బాధ్యతలు, ఇంటి విషయాల కారణంగా తగ్గినప్పుడు వారి బంధంలో ప్రేమ కనుమరుగైపోయిందని భార్యాభర్తలలో ఎవరో ఒకరు తప్పకుండా ఫీలవుతారు.. ఒక బలమైన సంబంధం కేవలం ఆప్యాయతతో మాత్రమే బిల్డ్ కాదు.. బంధంలో నిజాయితీ, నమ్మకం, ఒకరితో మరొకరు మాట్లాడే తీరు, ఒకరికి ఒకరు సహకరించే విధానం అనేవి బంధం ఎక్కువ కాలం పాటు బలంగా ఉండటానికి పునాది అవుతుంది . భార్యాభర్తల బంధంలో ఆప్యాయతను మితిమీరి ప్రదర్శించడం అనేది, ఆ లోటును భర్తీ చేయడానికి చేసే ప్రయత్నానికి సంకేతం కావచ్చని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు.
లవ్ బాంబింగ్..
లవ్ బాంబింగ్‌ను ఒక ప్రధాన హెచ్చరిక సంకేతంగా రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి త్వరగా భావోద్వేగపరంగా దగ్గరవ్వాలనే ఆశతో, మొదట తమ భాగస్వామిపై మితిమీరిన ప్రేమను, బహుమతులను, పొగడ్తలను కురిపిస్తారు. ఆ తర్వాత, ఈ ప్రవర్తన అకస్మాత్తుగా మారిపోతుంది. తరచుగా, భాగస్వామి తమను తామే నిందించుకోవడం మొదలుపెట్టి, సంబంధాన్ని తిరిగి బలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే, దీని అర్థం మితిమీరిన ప్రేమను చూపించే ప్రతి భాగస్వామి తప్పు అని కాదు. కానీ అతిగా ప్రేమ ఉంటే ఆ తర్వాత ప్రేమ లేకపోవడాన్ని భరించలేక గొడవలు, అపార్థాలకు దారితీస్తుంది. ఇది విడాకుల దాకా కూడా వెళ్లవచ్చు.
*రూపశ్రీ.
ఎండలు భగభగ మండుతూ ప్రజలను బాగా ఇబ్బంది పెట్టిన తర్వాత రుతుపవనాలు వస్తాయి. ఈ రుతుపవనాలు ప్రజలకు ఎంతో ఊరట ఇస్తాయి. చాలా ఎండల తర్వాత వర్షం కురవడం, వాతావరణం చల్లబడటం అనేది కేవలం మనుషులకే కాదు.. జంతువులకు, వృక్షాలకు కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. మొక్కలను పెంచుకోవడం అంటే ఎంతో ఇష్టమున్నవారికి మాత్రం వర్షాలు కురవడం అనేది ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. అయితే వర్షాకాలం కొన్ని సవాళ్లను కూడా వెంట తెస్తుంది. వర్షాలు రాగానే కొన్ని తోటలు పచ్చగా, అందంగా కనిపిస్తాయి. మరికొన్ని కలుపు మొక్కలు, కీటకాలు, కుండీలలో నీరు నిలవడం వంటి సమస్యలను తెచ్చిపెడతాయి.
ఈ వర్షాకాలంలో తోటలోని మొక్కలకు ఎలాంటి వ్యాధులు రాకూడదన్నా.. మొక్కలు పచ్చగా, ఏపుగా పెరగాలన్నా వర్షాలు ప్రారంభమయ్యే ముందు కొన్ని పనులు చేయాలి. ఎంతో సులభమైన, ముఖ్యమైన ఆ పనులు ఏంటో తెలుసుకుంటే..
డ్రైనేజీ రంధ్రాలు..
వర్షాకాలంలో మొక్కలు చనిపోవడానికి చాలా ఎక్కువగా ఎదురయ్యే సాధారణ కారణం నీరు. మొక్కలకు నీరు బాగా పోసినా లేదా వర్షాల కారణంగా కుండీలలో నీరు ఎక్కువగా నిలిచినా మొక్కలు చనిపోతాయి. కుండీ అడుగున ఉన్న రంధ్రం మట్టితో లేదా గులకరాళ్లతో మూసుకుపోతే, వర్షపు నీరు బయటకు పోదు. దీనివల్ల వేర్లు నీటిలో మునిగి ఉండి కుళ్లిపోతాయి. అందువల్ల, వర్షాలు రాకముందే, అదనపు నీరు వెంటనే బయటకు పోయేలా అన్ని కుండీలలోని డ్రైనేజీ రంధ్రాలను పుల్ల లేదా స్క్రూడ్రైవర్‌తో శుభ్రం చేయాలి.
కలుపు మొక్కలు..
గాలిలో , నేలలో తేమ పెరిగేకొద్దీ కుండీలలో , పూల మడులలో అనవసరమైన కలుపు మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఈ కలుపు మొక్కలు చూడటానికి అందవిహీనంగా ఉండటమే కాకుండా, నేల నుండి అవసరమైన పోషకాలను గ్రహించి, ప్రధాన మొక్కలను బలహీనపరుస్తాయి. వర్షాలు ప్రారంభమయ్యే ముందు, తోట అంతటా లేదా కుండీలలో కలుపును పూర్తిగా తీసివేసి, అన్ని కలుపు మొక్కలను వేళ్లతో సహా పెకిలించాలి.
ప్రూనింగ్..
ప్రూనింగ్ అంటే కత్తిరింపు. కొత్త మొక్కల పెరుగుదలకు వర్షాకాలం ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది . అందువల్ల, వర్షాలు ప్రారంభమయ్యే ముందు మొక్కలను తేలికగా కత్తిరించాలి. చనిపోయిన, కుళ్ళిన లేదా వ్యాధి సోకిన కొమ్మలను తొలగించాలి. కత్తిరించడం వల్ల మొక్కలో గాలి, సూర్యరశ్మి ప్రసరణ మెరుగుపడుతుంది. వర్షం పడిన వెంటనే మొక్కకు ఎన్నో కొత్త, నిగనిగలాడే ఆకులు చిగురిస్తాయి.
సపోర్ట్..
వర్షాకాలంలో బలమైన గాలులు, తుఫానులు సర్వసాధారణం. మనీ ప్లాంట్, తిప్పతీగ లేదా తమలపాకు వంటి తీగలు, బరువైన మొక్కలు బలమైన గాలుల వల్ల లేదా నీటి బరువు వల్ల విరిగి పడిపోవచ్చు. దీనిని నివారించడానికి, వర్షాకాలం రాకముందే తీగలు , పొడవైన మొక్కలన్నింటికీ వెదురు కర్రలు, పుల్లలు లేదా తాళ్లతో తగినంత ఆధారాన్ని అందించాలి, తద్వారా అవి బలమైన తుఫానుల సమయంలో కూడా సురక్షితంగా నిలబడతాయి.
కంపోస్ట్, కొత్త మట్టి..
తరచుగా కురిసే వర్షాల వల్ల కుండీలలోని పై మట్టి, దానిలోని పోషకాలు కొట్టుకుపోతాయి. వర్షాలు పడటానికి ముందే మట్టిని సిద్ధం చేసుకోవడం ముఖ్యం. కుండీలలో కొంత తాజా మట్టిని, మంచి సేంద్రియ ఎరువును కలపాలి. వర్షపు నీరు పడినప్పుడు, ఈ ఎరువు నేరుగా వేర్లకు చేరి, మొక్కలు రెట్టింపు వేగంతో పెరిగే శక్తిని ఇస్తుంది.
కొన్ని గార్డెనింగ్ టిప్స్..
తేమతో కూడిన వాతావరణం కీటకాలు, శిలీంధ్రాలు , చీమల పెరుగుదలకు అనువైనది. వర్షాకాలంలో, మొక్కలపై మీలీబగ్స్ , శిలీంధ్రాల దాడి బాగా పెరుగుతుంది. దీనిని నివారించడానికి, ప్రతి 15 రోజులకు ఒకసారి మొక్కలపై వేప నూనెను పిచికారీ చేయాలి, లేదా కొద్దిగా శిలీంధ్రనాశక పొడిని శుభ్రమైన నీటిలో కలపి పిచికారీ చేయాలి. ఈ ముందుజాగ్రత్త చర్యలు మొక్కలను వ్యాధుల నుండి కాపాడుతాయి.
*రూపశ్రీ.
తల్లిదండ్రులు తమ పిల్లలను చక్కగా పెంచడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు, కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులకు ఉండే కొన్ని అలవాట్లు తెలియకుండానే పిల్లల మీద ప్రబావం చూపిస్తాయి.ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే.. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మీద ప్రబావం చూపిస్తున్నట్టు కనీసం తల్లిదండ్రులు తెలుసుకోరు, గ్రహించలేరు కూడా. కానీ అది పిల్లల మానసిక , భావోద్వేగ ఎదుగుదలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ప్రవర్తన సరిగా లేని తల్లిదండ్రుల వల్ల, పిల్లలు క్రమంగా మౌనంగా ఉండిపోతారు, తమ మనసులో ఉన్న విషయాలను వ్యక్తపరచడానికి సిగ్గుపడతారు, వారి ఆత్మవిశ్వాసం కూడా బలహీనపడుతుంది. తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉంటే పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందో.. వారు జీవితంలో ఏ విషయాన్ని చెప్పలేక, జీవితంలో ఎదగలేక వెనుకబడిపోతారో.. పేరెంటింగ్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..
కొన్ని లక్షణాలను, ప్రవర్తనను బట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో పెంపకం సరిగా లేదని అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులలో మూడు సాధారణ లక్షణాలు ఉంటాయి. మొదటిది, తమ పిల్లల ప్రతి దాన్ని నియంత్రించాలని, వారి తరపున ప్రతి నిర్ణయం తామే తీసుకోవాలని కోరుకునే తల్లిదండ్రులు. రెండవది, పిల్లలు విచారంగా, కోపంగా లేదా కలత చెందినప్పుడు, "నువ్వు అతిగా స్పందిస్తున్నావు" లేదా "ఇంత చిన్న విషయానికి ఎందుకు కోపపడుతున్నావు?" వంటి మాటలు అనడం. ఇది పిల్లల భావాలకు విలువ లేదని వారికి నేర్పుతుంది.
పిల్లలు సరిగా పెంచడం లేదనడానికి మూడవ సంకేతం ఏమిటంటే, పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే, ఎప్పుడూ చదువుకుంటే, తల్లిదండ్రుల మాట వింటే, వారి అంచనాలకు అనుగుణంగా జీవిస్తేనే తమకు ప్రేమ, పెద్దల అనుమతి లభిస్తాయని భావించడం. ఒకవేళ వారు అలా చేయకపోతే, వారి తల్లిదండ్రులు కోపగించుకోవడం లేదా కలత చెందడం, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ఇలా చాలా చేస్తారు. తల్లిదండ్రులు చేసే ఈ ప్రవర్తన వల్ల పిల్లలు మానసికంగా ఎదగలేరు, వారి ఆత్మవిశ్వాసం కోల్పోతారు.
తల్లిదండ్రులు ప్రవర్తన మార్చుకోవాలి..
తల్లిదండ్రులు తమలో తాము పైన చెప్పుకున్న లక్షణాలు గమనిస్తే, వెంటనే తమ ప్రవర్తన మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలని పేరెంటింగ్ నిపుణులు అంటున్నారు. అంతేకాదు.. తమ పిల్లలను నియంత్రించడానికి బదులుగా, తల్లిదండ్రులు వారితో మంచి అనుబంధాన్ని పెంచుకోవడం, పిల్లలతో స్నేహితులుగా ఉండటంపై దృష్టి పెట్టాలి. వారి సమస్యలకు పరిష్కారాలు సూచించే ముందు, పిల్లలు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా, వారి సమస్య ఏంటో వివరంగా తెలుసుకోవాలి. కేవలం చదువు, ఫలితాలపై దృష్టి పెట్టకుండా, వారు తమ పిల్లల అభిరుచికి విలువ ఇవ్వాలి.
ఇది ముఖ్యం..
తల్లిదండ్రుల ప్రవర్తన సరిగా లేకపోవడం అంటే.. అప్పుడప్పుడు ఒక చెడ్డ నిర్ణయం తీసుకునేవారు లేదా పొరపాటు చేసేవారు కాదు. విషపూరితమైన తల్లిదండ్రులు అంటే, వారి వల్ల పిల్లలు క్రమంగా తమ ఆత్మవిశ్వాసాన్ని, తమ అభిప్రాయాన్ని చెప్పే శక్తిని, ఏదీ చెప్పుకోలేని పరిస్థితి తీసుకురావడం. ఇలాంటివన్నీ ఉంటే ఆ పిల్లలు జీవితంలో ఎంతో కోల్పోతారు.
*రూపశ్రీ.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సాధారణమే అయినా.. ఒక మంచి పనీ, మానవత్వంతో వేసిన అడుగును కూడా రాజకీయం చేయడం తగదంటూ పేర్ని నాని తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ జరిగిందేంటంటే.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తెలంగాణకు చెందిన నిరంజన్ అనే పవన్ కల్యాణ్ అభిమాని తీవ్ర అనోరోగ్యంతో బాధపడుతూ.. తన జీవితంలో పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారైనా కలవాలని ఆశపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. మానవత్వంతో స్వయంగా వెళ్లి ఆ 17 ఏళ్ల కుర్రాడిని కలిసి, అతనితో కొంత సమయం గడిపారు. వైద్యం కోసం ఆర్థిక సహాయం అందించారు. పవన్ కల్యాణ్ మానవత్వంతో స్పందించిన తీరు పట్ల రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచీ ప్రశంసలు వెల్లువెత్తాయి.
అయితే.. వైసిపి నేత పెర్ని నాని ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదనీ.. కానీ తెలంగాణలో ఎవడో ఒంట్లో బాలేదు అంటే వస్తున్నా తమ్ముడూ అంటూ వెళ్ళిపోయారంటూ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పేర్ని నానివి దిగజారుడు వ్యాఖ్యలను విమర్శలు వెల్లువెత్తుతుననాయి. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఒక బాలుడిని కూడా రాజకీయాల్లోకి లాగడం, ఆనారోగ్యంతో ఉన్న వ్యక్తిని వాడు అంటూ అనుచితంగా పేర్కొనడం దారుణమని నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిని మంచిగా చూడలేని ఇలాంటి సంకుచిత రాజకీయాలు సమాజానికి చెడు సంకేతాలు ఇస్తాయని దుయ్యపడతున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్న కల్వకుంట్ల కవిత.. దూకుడు పెంచారు. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును తన పార్టీ తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) లోకి రావలసిందిగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచీ.. ఆ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్న కవిత ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి తన తండ్రి కెసిఆర్‌ను టీఆర్ఎస్ లోకి రావాల్సిందిగా బంపరాఫర్ ఇచ్చారు. ఇటీవల ఒక జాతీయ టీవీ చానల్ కు కవిత ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం వస్తే తిరిగి సొంత గూటికి వెడతారా అన్న ప్రశ్రకు ఆమె భావోద్వేగంగా స్పందించారు.
బిఆర్ఎస్ పార్టీ నుండి తనను పంపించేటప్పుడు ఎదుర్కొన్న అవమానాలను గుర్తు చేస్తూ.. ఒక జీవిత కాలానికి సరిపడా అవమానాలను అక్కడ భరించానన్నారు. ఆ పార్టీలోకి మళ్లీ వెళ్లే ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టిన కవిత.. ఒకవేళ కెసిఆర్ స్వయంగా తన దగ్గరకు వస్తే.. తాను బిఆర్ఎస్‌లోకి వెళ్లడం కంటే, ఆయననే తన పార్టీ తెలంగాణ రక్షణ సమితి లో చేరాలని కోరతానన్నారు.
కవిత వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో ఆమె పలుమార్లు తన తండ్రి చుట్టూ దయ్యాలు చేరాయని పరోక్షంగా హరీష్ రావు తదితరులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడి కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించడం కవిత.. రాజకీయ పరిణతి చాటుకున్నారు.
దెందులూరు నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దెందులూరు వివాదం: విశ్లేషణ, వ్యూహాలు మరియు భవిష్యత్తు పరిణామాలుఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిణామాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. స్థానిక కూటమి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన మాజీ లీగల్ అడ్వైజర్ ఈడుపుగంటి శ్రీనివాస బాబుల మధ్య తలెత్తిన వ్యక్తిగత, రాజకీయ ఘర్షణ కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య నెలకొన్న వివాద తీవ్రత, దీని వెనుక ఉన్న వ్యూహాలు మరియు రాష్ట్ర రాజకీయాలపై దీని ప్రభావంపై ప్రత్యేక విశ్లేషణ.
రాజకీయ నేపథ్యం మరియు ఘర్షణకు గల కారణాలు2024 అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపు సమయంలో నరసాపురం, ఏలూరు పార్లమెంట్ స్థానాల సమీకరణాల వల్ల దెందులూరు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) టికెట్ ప్రకటన ఆలస్యమైంది. ఆ సమయంలో చింతమనేని ప్రభాకర్‌కు అత్యంత సన్నిహితుడిగా, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధిగా ఉన్న శ్రీనివాస బాబు స్వయంగా దెందులూరు టికెట్ కోసం ప్రయత్నించడం ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. చివరకు చింతమనేని టికెట్ సాధించి విజయం సాధించినప్పటికీ, అంతర్గత విభేదాలు సమసిపోలేదు.
ఇటీవల శ్రీనివాస బాబు కొన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నాయకులకు న్యాయవాదిగా బెయిల్ ఇప్పించడం, చింతమనేనిపై అవినీతి, ఇసుక అక్రమ రవాణా ఆరోపణలు చేయడంతో వివాదం ముదిరింది. సామాజిక మాధ్యమాల్లో ఇరువర్గాలు పరస్పరం కుటుంబ సభ్యులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసుకోవడం శాంతిభద్రతల సమస్యగా రూపాంతరం చెందింది. శ్రీనివాస బాబు ఇంటిపై చింతమనేని అనుచరుల దాడి, తదనంతర పరిణామాల్లో శ్రీనివాస బాబు అరెస్ట్ మరియు పార్టీ నుంచి సస్పెన్షన్ వంటి చర్యలు వేగంగా జరిగాయి.
రాజకీయ వ్యూహాలు మరియు పర్యవసానాలుఈ వివాదాన్ని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహాన్ని అమలు చేస్తోంది. దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌కు బలమైన ప్రత్యర్థిగా నిలబడగల లీగల్ బ్యాక్‌గ్రౌండ్, దూకుడు ఉన్న నాయకుడి కోసం వెతుకుతున్న వైసీపీకి శ్రీనివాస బాబు రూపంలో ఒక అవకాశం దొరికినట్లయింది. భవిష్యత్తులో ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు లభించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మరోవైపు, అధికార కూటమికి ఈ తరహా అంతర్గత ఘర్షణలు ప్రతిబంధకంగా మారుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కంటే ఇటువంటి వివాదాలే మీడియాలో మరియు సోషల్ మీడియాలో ఎక్కువగా హైలైట్ అవ్వడం ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందనే సంకేతాలు ఇవ్వడానికి శ్రీనివాస బాబుపై తక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ, చింతమనేని ప్రభాకర్ వంటి కీలక నేతల దూకుడు స్వభావం కూటమి మేనేజ్‌మెంట్‌కు సవాలుగా నిలుస్తోంది.
భవిష్యత్తు రాజకీయ ప్రభావందెందులూరు పరిణామాలు భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీయనున్నాయి. చింతమనేని ప్రభాకర్‌ను ఢీకొట్టేందుకు ప్రతిపక్షం శ్రీనివాస బాబును లేదా ఆయన కుటుంబ సభ్యులను ముందుంచే వ్యూహాన్ని రచిస్తోంది. అయితే, దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌కు ఉన్న గట్టి కేడర్ బేస్ మరియు సామాజికవర్గ మద్దతును అధిగమించడం ప్రతిపక్షానికి అంత సులువు కాదు. ఈ వివాదాల వల్ల ఇరుపక్షాల ఉమ్మడి మిత్రులు, బంధువులలో కొంత అసంతృప్తి నెలకొన్నప్పటికీ, అది ఓట్ల శాతాన్ని ఎంతవరకు మారుస్తుందనేది వేచి చూడాలి. రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులు తమ పబ్లిక్ ప్రవర్తనలో మరింత బాధ్యతగా వ్యవహరించకపోతే, ఇటువంటి ఘటనలు కూటమి ప్రభుత్వ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉంది
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు చాలా సాధారణంగా అనిపిస్తాయి. వయసు కారణంగా, లేదా అలసిపోవడం వల్ల జరుగుతోందేమోనని, పరిసరాల కారణంగా సరిగా వినిపించడం లేదేమోనని ఇలా.. రకాలుగా అనుకుంటూ వినికిడి సమస్యను లైట్ తీసుకుంటారు. చాలామంది ఇతరులతో మాట్లాడటం కష్టమయ్యే వరకు తమ సమస్యను గుర్తించరు. కానీ వినికిడి సమస్య రావడానికి ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలేంటో తెలుసుకోవడం వల్ల సమస్యను ముందే గుర్తించవచ్చు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
వినికిడి సమస్యను మొదట్లోనే గుర్తించడం ఎందుకు ముఖ్యం?
వయసు పెరగడంతో వచ్చే వినికిడి లోపం క్రమంగా అభివృద్ధి చెంది, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలను ముందుగానే గుర్తిస్తే, దీర్ఘకాలికంగా వినికిడిని , జీవన నాణ్యతను కాపాడుకోవచ్చు. చుట్టూ ఉన్న అందరూ ఎంతో బాగా మాట్లాడుతూ, నవ్వుతూ, తుళ్లుతూ ఉంటే.. వినికిడి సమస్య ఉన్నవారు మాత్రం తమ సమస్య కారణంగా ఎవరితో ఎక్కువ మాట్లాడలేకపోవడం, తమ రోజు వారీ కార్యకలపాలను సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం వంటివి జరుగుతాయి. దీని వల్ల వినికిడి సమస్యను ముందుగానే గుర్తించడం ముఖ్యం.
లక్షణాలు..
గందరగోళం..
వినికిడి లోపానికి మొదటి లక్షణం వినిపించకపోవడమే కాదు.. . కొన్నిసార్లు ఇతరులు మాట్లాడటం వినగలుగుతారు, కానీ మాటలను స్పష్టంగా అర్థం చేసుకోలేరు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో, కుటుంబంలో అందరూ కలిసి మాట్లాడుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లలో మాట్లాడే మాటలను అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇది ప్రారంభ దశలో వినికిడి లోపానికి ఒక సాధారణ లక్షణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.
చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పించుకోవాల్సి రావడం..
ఇతరులు ఏదైనా చెప్పినప్పుడు పదేపదే మళ్ళీ చెప్పమని అడుగుతున్నట్లయితే, ఇది కూడా ఒక హెచ్చరిక సంకేతం కావచ్చు. మొదట్లో ఇది సాధారణంగానే అనిపించవచ్చు, కానీ ఈ అలవాటు రోజువారీ లైఫ్ స్టైల్ లో భాగంగా మారినప్పుడు, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎక్కువగా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులే ఈ మార్పును మొదటగా గమనిస్తారు.
వ్యాల్యూమ్..
టీవీ, మొబైల్ ఫోన్ లేదా రేడియో వాల్యూమ్‌ను నిరంతరం పెంచడం మరో సాధారణ లక్షణం. తరచుగా, ఇంట్లోని ఇతర వ్యక్తులు ఆ వాల్యూమ్‌ను చాలా ఎక్కువగా అని చెబుతూ ఉంటారు, అయితే వినికిడి లోపం ఉన్న వ్యక్తి దానిని సాధారణంగానే అనుకుంటారు. ఈ మార్పు క్రమంగా జరుగుతుంది, కాబట్టి చాలా మంది దీనిని తీవ్రంగా పరిగణించరు.
ఫోన్లో మాట్లాడటంలో ఇబ్బంది..
ఫోన్‌లో మాట్లాడటంలో ఇబ్బంది కూడా వినికిడి లోపానికి ఒక సంకేతం కావచ్చు. నేరుగా, ఎదురుగా ఉండి మాట్లాడేటప్పుడు ముఖ కవళికలు , పెదవుల కదలికలు అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి, కానీ ఫోన్‌లో కేవలం గొంతుపైనే ఆధారపడవలసి ఉంటుంది. స్వల్ప వినికిడి లోపం కూడా ఫోన్ లో మాట్లాడటం కుదరకపోతే అది స్పష్టంగా తెలిసిపోతుంది.
చెవిలో శబ్దాలు..
చెవుల్లో నిరంతరం రింగింగ్, గింగురుమనే లేదా ఈల శబ్దాలు రావడం ఆందోళన కలిగించే విషయం. టిన్నిటస్ అని పిలువబడే ఈ పరిస్థితి, తరచుగా వినికిడిలో ఒక అంతర్లీన సమస్యను సూచిస్తుంది. వినికిడి సమస్యలను నిర్లక్ష్యం చేయడం కేవలం చెవులకే పరిమితం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాలక్రమేణా ఇది సామాజిక ఒంటరితనం, నిరాశ, ఒత్తిడి , కుంగుబాటుకు కూడా దారితీయవచ్చు. అందువల్ల, ఈ లక్షణాలు కొనసాగితే ఈ.ఎన్.టి నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
*రూపశ్రీ.
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నరాల బలహీనత మరియు విపరీతమైన నీరసం. షుగర్, బీపీ, అధిక బరువు, పోషకాహార లోపం లేదా దీర్ఘకాలికంగా వాడే కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నరాల బలహీనత రావచ్చు. అయితే, కొంతమందికి అన్ని రకాల వైద్య పరీక్షలు నార్మల్‌గా ఉన్నప్పటికీ ఒంట్లో శక్తి లేనట్టు, నిస్త్రాణగా అనిపిస్తుంది. వైద్య పరిభాషలో దీనిని 'క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్' (Chronic Fatigue Syndrome) అంటారు. తాత్కాలిక ఉపశమనం కోసం కాఫీ, టీలు లేదా స్వీట్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
ఇలాంటి అంతుపట్టని నరాల బలహీనత మరియు నీరసం నుండి శాశ్వతంగా బయటపడటానికి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఇంట్లోనే సులభంగా చేసుకోదగ్గ రెండు అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలను ఈ వీడియోలో వివరించారు.
చిట్కా 1 (ఎండు ద్రాక్ష మరియు నిమ్మరసం):** రాత్రి వేళల్లో ఒక గ్లాసు నీటిలో గుప్పెడు (సుమారు 25 గ్రాములు) ఎండు ద్రాక్ష (కిస్మిస్) వేసి, అందులో ఒక నిమ్మకాయ రసం పిండి మూత పెట్టాలి. ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగి, నానిన కిస్మిస్ పండ్లను తినాలి. ఇలా 40 రోజుల పాటు చేయడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు.
చిట్కా 2 (షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవారి కోసం - తులసి మరియు మట్టి ముంత):** ఒక చిన్న కొత్త మట్టి ముంతను శుభ్రం చేసుకుని, అందులో రాత్రి పూట ఒక గ్లాసు నీరు పోసి 10 తులసి ఆకులను నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగాలి. మట్టిలో ఉండే సహజసిద్ధమైన ఖనిజాలు, తులసిలోని ఔషధ గుణాలు కలిసి నరాలకు అమితమైన శక్తిని ఇస్తాయి.
ఖరీదైన మందులు లేకుండా, ఇంట్లోనే ఈ చిన్న చిట్కాలతో నరాల బలహీనతను ఎలా దూరం చేసుకోవాలో డాక్టర్ గారి మాటల్లోనే ఈ వీడియో చూసి పూర్తిగా తెలుసుకోండి!
మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య. చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం, రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, తిన్న వెంటనే నిద్రపోవడం, జీవనశైలిలో మార్పులు.. మొదలైనవన్నీ గ్యాస్, ఎసిడిటీ సమస్యకు దారితీస్తాయి. గుండెల్లో మంట, ఎసిడిటీ లేదా అజీర్ణం వంటి సమస్యలను ఎదుర్కొన్నప్పుడు తరచుగా దగ్గరలోని మెడికల్ స్టోర్ నుండి గ్యాస్ మాత్రలను కొనుగోలు చేసి వాడుతుంటారు. ఈ మందులు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి, కానీ దీర్ఘకాలంలో, అవి ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ల వల్ల మూత్రపిండాలకు కలిగే ప్రమాదాలు
వైద్య నివేదికలలో, నిపుణుల బృందం ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (PPIs) అనే ఔషధాల సమూహాన్ని ఆరోగ్యానికి అత్యంత హానికరం అని వర్ణించింది. ఈ మందులను దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల మూత్రపిండాల వైఫల్యం ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి.
ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు..
ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు అనేక పేర్లతో అమ్ముడవుతాయి . ప్రపంచవ్యాప్తంగా చాలా సాధారణంగా సూచించబడే మందులలో ఇవి కూడా ఉన్నాయి. కొన్ని పరిశోధనలలో ఇతర అసిడిటీ మందులు (హిస్టమైన్-2 రిసెప్టర్ యాంటాగోనిస్టుల వంటివి) తీసుకునే వారితో పోలిస్తే, PPIS మందులు తీసుకునే వారికి మూత్రపిండాల వ్యాధి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తేలింది.
PPIS తీసుకుంటున్న రోగులకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వచ్చే అవకాశం 28.4 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అదేవిధంగా, తీవ్రమైన మూత్రపిండాల గాయం ప్రమాదం 4.2 రెట్లు ఎక్కువగా , ఫైనల్ స్టేజ్ మూత్రపిండాల వ్యాధి ప్రమాదం 35.5 రెట్లు ఎక్కువగా ఉంటుందట. PPIS తీసుకునే వ్యక్తులలో ఎలక్ట్రోలైట్ల (సోడియం, పొటాషియం మరియు మెగ్నీషియం వంటివి) అసమతుల్యత ఉండే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాల్లో తేలింది.
లివర్ ప్రమాదం కూడా..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, చాలా మంది రోగులకు PPIలు కీలకమైన మందులు కావచ్చని, PPIలు ఎలుకలు , మానవులలో దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ప్రమాదాన్ని కూడా పెంచవచ్చని సూచించింది. సాధారణంగా మందుల ప్రయోగాలు ఎలుకల మీదనే జరుగుతాయి.
రానిటిడిన్..
రానిటిడిన్‌తో ఉన్న అతిపెద్ద ప్రమాదం ఏమిటంటే.., దానిని నిల్వ చేసినప్పుడు, దానిలో N-నైట్రోసోడైమిథైలమైన్ (NDMA) అనే రసాయనం ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇది అత్యంత విషపూరితమైనదని , క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి. చాలా దేశాలు దీని వాడకాన్ని నిషేధించినప్పటికీ, భారతదేశంలో ఇది ఇప్పటికీ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుకలో ఉంది.
కాబట్టి గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలకు ఊరికే మెడికల్ స్టోర్ నుండి మందులు తెచ్చుకుని వాడకుండా ఆరోగ్యాన్నిజాగ్రత్తగా కాపాడుకోవాలి.
*రూపశ్రీ.
