పేద ముస్లింలకు యోగి ఆఫర్..
posted on Apr 13, 2017 6:21PM

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. తాను బాధ్యతలు చేపట్టిన దగ్గరనుండి పలు నిర్ణయాలు తీసుకుంటూ తమ మార్క్ ను చూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకొని పేద ముస్లింలకు బాసటగా నిలిచారు. పేద ముస్లిం కుటుంబాలు తమ కుమార్తెల పెళ్లిళ్లకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా.. వారికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. దాంతోపాటు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో.. ముస్లింలకు సామూహిక వివాహాలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు ఉత్తరప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో సామూహిక వివాహాలు జరిపించేందుకు వీలుగా ’సద్భావనా మండపాలు’ నిర్మించాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి మంచి స్పందన వస్తే.. ప్రతియేటా రెండుసార్లు చొప్పున ఈ సామూహిక వివాహాలు నిర్వహిస్తారు.