తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మశ్రీ పురస్కారాలు
on Jan 25, 2026
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే పద్మ పురస్కారాలను జనవరి 25న ప్రకటించింది. దేశవ్యాప్తంగా 2026 సంవత్సరానికిగాను మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించారు. వాటిలో ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. దివంగత బాలీవుడ్ హీరో ధర్మేంద్రకు పద్మవిభూషణ్, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముటికి పద్మభూషణ్, ప్రముఖ నేపథ్యగాయని అల్కా యాగ్నిక్‌కు పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది పద్మశ్రీ పురస్కారాలు అందుకోబోతున్నారు. తెలంగాణ నుంచి ఆరుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. కళల విభాగంలో దీపికారెడ్డి, నటకిరీటి రాజేంద్రప్రసాద్, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, నటుడు, నిర్మాత మాగంటి మురళీమోహన్‌కి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. వైద్య విభాగంలో గూడూరు వెంకటరావు పద్మశ్రీ, పాలకొండ విజయ్ ఆనందరెడ్డి, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో చంద్రమౌళి గడ్డమనుగు, కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యం, కుమారస్వామి తంగరాజుకి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



