‘రాజా సాబ్’ చాప్టర్ క్లోజ్.. ఇదీ ఫైనల్‌గా తేలిన లెక్క!
on Jan 26, 2026
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్‌ని ఒక్కసారిగా పెంచిన ‘బాహుబలి’ సిరీస్ భారీ విజయం సాధించడమే కాకుండా కలెక్షన్లపరంగా అప్పటికి ఇండియాలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. ఈ సిరీస్ తర్వాత ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని దష్టిలో పెట్టుకొని ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కొన్ని అపజయాలు కూడా ప్రభాస్ ఖాతాలోకి వచ్చి చేరాయి. ‘సలార’ ‘కల్కి’ వంటి భారీ హిట్స్‌తో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చారు.
ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమాలేంటి? అవి ఏ రేంజ్‌లో నిర్మాణం జరుపుకుంటాయి అనే ప్రశ్న కూడా మొదలైంది. అయితే ప్రభాస్ వరసగా సినిమాలు కమిట్ అవుతూ వచ్చారు. అందులో మొదట వినిపించిన సినిమా రాజా సాబ్, ఆ తర్వాత ఫౌజీ, స్పిరిట్ చిత్రాలు మొదలయ్యాయి. రాజా సాబ్ చక్కని ఎంటర్‌టైనర్‌గా అందర్నీ ఆకట్టుకుంటుందని అందరూ అనుకున్నారు. బాహుబలికి ముందు ప్రభాస్ చేసిన డార్లింగ్, మిర్చి వంటి సినిమాల తరహాలో రాజా సాబ్ ఉంటుందని డైరెక్టర్ మారుతి కూడా చెప్పారు.
సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రాజాసాబ్. ఎవరూ ఊహించని విధంగా మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సినిమాకి సంబంధించి విడుదలైన సాంగ్స్, ట్రైలర్స్ హైప్ క్రియేట్ చేయడంతో మొదటి రోజు భారీగానే ఓపెనింగ్స్ వచ్చాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం.. మొదటి వారంలో రూ. 130 కోట్ల నెట్ వసూలు చేయగా, ఇప్పటి వరకు టోటల్ ఇండియా నెట్ కలెక్షన్స్ రూ. 142 కోట్లకు చేరుకుంది. గ్రాస్ పరంగా చూస్తే.. ఫస్ట్ వీక్‌లో రూ.238 కోట్లు కలెక్ట్ చేసిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఓవరాల్‌గా రూ.250 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో రాజాసాబ్ చిత్రాన్ని నిర్మించారు. కలెక్షన్లపరంగా కనిపిస్తున్న ఫిగర్స్ చూస్తుంటే నిర్మాతలకు భారీగానే నష్టం వచ్చిందని అర్థమవుతోంది. థియేటర్ రన్ ద్వారా 60 శాతం వరకు రికవరీ అయిందని తెలుస్తోంది. ఇక మిగతా ప్లాట్ ఫామ్స్ ద్వారా వచ్చే మొత్తాన్ని బట్టి చూస్తే నిర్మాతలకు వంద కోట్లకు పైగా నష్టం వచ్చిందని తెలుస్తోంది. గతంలో ఆదిపురుష్ చిత్రం కూడా మొదటి షో నుంచే డిజాస్టర్ అనే పేరు తెచ్చుకుంది. ఆ సినిమా నిర్మాతలకు భారీ నష్టాన్ని తెచ్చింది. దాని తర్వాతి స్థానంలో రాజాసాబ్ నిలిచింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



