టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తుంది : విజయ్
posted on Jan 25, 2026 3:06PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ స్పష్టం చేశారు. మహాబలిపురం సభలో పార్టీ గుర్తు ‘విజిల్’ ను ఆవిష్కరించారు. ఇది కేవలం ఎన్నికల పోరు కాదని, అవినీతిపై ప్రజాస్వామ్య యుద్దం అని ప్రకటించారు. డీఎంకే, అన్నాడీఎంకే బీజేపీకి లోంగిపోయాయని విమర్శించారు. మార్పు కోసం ప్రజలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ఎంకే స్టాలిన్ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎవరికీ తలవంచం.. దేనికీ రాజీపడే ప్రసక్తే లేదు. మనమందరం కలిసికట్టుగా ఉంటే విజయం మనదే. రాష్ట్రంలో అవినీతి అంతానికి సమయం ఆసన్నమైంది’ అని విజయ్ అన్నారు. దుష్ట శక్తులను, అవినీతిపరులను ఎదుర్కొనే ధైర్యం టీవీకే పార్టీకి మాత్రమే ఉందన్నారు.ఈ సమావేశంలో సుమారు 3,000 మంది రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్త ప్రచార యాత్రను టీవీకే చేపట్టనున్నట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర సాగనుంది.