స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారం
posted on Jan 17, 2026 11:29AM
.webp)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఎన్డీఆర్ జీవన సాఫ్యల పురస్కారం దక్కింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని శుక్రవారం (జనవరి 16) ప్రదానం చేశారు. అంతకు ముందు నర్సీపట్నంలోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో మకర జ్యోతి ఉత్సవాలు శుక్రవారం (జనవరి 16) ముగిశాయి. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన శోభాయాత్ర విశేషంగా ఆకట్టుకుంది.
స్థానిక ఐదు రోడ్ల కూడలి నుంచి ప్రారంభమైన స్వామివారి రథోత్సవం కృష్ణ బజార్ , వేంకటేశ్వర స్వామి ఆలయం మీదుగా సాగింది. ఈ సందర్భంగా వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభావేదికపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కి ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. పరిషత్తు అధ్యక్షుడు, ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ ఈ అవార్డును అందజేశారు.