ఇన్స్టా ఇన్ ఫ్ల్యుయన్సర్ హనీ ట్రాప్.. ఇద్దరు యువకులపై వలపు వల

ఇన్స్టా ఇన్ ఫ్ల్యుయన్సర్ హనీ ట్రాప్ లో ఇద్దరు యువకుల నుంచి భారీగా సొమ్ము గుంజుకున్న సంఘటన విశాఖలో వెలుగులోకి వచ్చింది. సౌమ్యాశెట్టి అనే ఇన్స్టా ఇన్ ఫ్ల్యుయెన్సర్ నిర్వాకం ఆ యువకులు పోలీసులను ఆశ్రయించడంతో బట్టబయలయ్యాయి.  వివరాల్లోకి వెడితే.. తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే యువకుడితో సోషల్ మీడియాలో పరిచయం చేసుకున్న సౌమ్యాశెట్టి.. అతడిని ప్రేమించానంటూ వలపు వల విసిరింది. శ్రీకాంత్ రెడ్డి తనకు వివాహమైంది అని చెప్పినా వినకుండా రెండో భార్యగా ఉండడానికైనా రెడీ అంటూ అతడిని వలపు ముగ్గులోకి దింపింది.

ఆ తరువాత పలు రకాల సమస్యలు చెబుతూ విడతల వారీగా అతడి వద్ద నుంచి దాదాపు కోటి రూపాయలు రాబట్టింది. అంతే ఇక అతడి ఫోన్ ను బ్లాక్ చేయడమే కాకుండా, తనకు ఇక ఫోన్ చేయవద్దంటూ లాయర్ ద్వారా చెప్పించింది.  ఆ తరువాత ఇదే హనీ ట్రాప్ తో రాజేష్ అనే మరో యువకుడికి వల వేసింది. అతడి నుంచి కూడా లక్షల రూపాయలు రాబట్టుకుని.. ఆపై బెదరింపులకు దిగింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇలా ఉండగా సౌమ్యాశెట్టి ఈ ఇద్దరినే కాకుండా ఇంకా పలువురిని ఇదే విధంగా మోసం చేసిందనీ, ఇలా హనీట్రాప్ ద్వారా ఆమె దోచుకున్న సొమ్ము ఐదు కోట్ల రూపాయల పైమానేననీ ఆరోపణలు వినవస్తున్నాయి. అంతే కాకుండా గతంలో కూడా సౌమ్యాశెట్టి తన స్నేహితురాలి ఇంట్లో పెద్దమొత్తంలో బంగారం చోరీ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu