బీజేపీ కార్యాలయంలో బీసీ నేతల డిష్యూం డిష్యూం!

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ నేతల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.  బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్యల ఎదుటే బీసీ సంఘాల నేతలు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో చెలరేగిపోయారు.   ఈనెల 18న బీసీ ఐక్యకార్యాచరణ కమిటీ (ఐకాస) నిర్వహించ తలపెట్టిన బంద్‍కు మద్దతు ఇవ్వాలని బీజేపీని కోరేందుకు బుధవారం (అక్టోబర్ 15) ఆర్.కృష్ణయ్యతో పాటు బీసీ సంఘాల నేతలు బీజేపీ కార్యాలయానికి వచ్చారు.

రామచందర్ రావుతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సరిగ్గా ఆసమయంలో ఫొటోల విషయంలో బీసీ నేతల మధ్య వివాదం తలెత్తింది. జూనియర్ ఫొటో కోసం ముందు వరుసలో ఎలా ఉంటారంటూ మొదలైన వివాదం ఘర్షణకు దారి తీసింది.    ప్రెస్ మీట్ సందర్భంగా ఫోటోలో ఎవరు ఏ స్థానంలో  నిలబడాలి, మీడియా షాట్‌లో ఎవరు ముందుండాలి అనే అంశంపై నేతల మధ్య గొడవ పిడిగుద్దుల వరకూ వెళ్లింది. పరిస్థితి చేయిదాటిపోవడంతో చక్కదిద్దేందుకు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో ఆయన, కృష్ణయ్య అక్కడ నుంచి వెళ్లిపోయారు.  ఈ ఘటనపై అంతర్గత నివేదిక ఇవ్వాలని బీజేపీ క్రమశిక్షణ కమిటీకి ఆదేశాలు రామచంద్రరావు ఆదేశాలు జారీ చేశారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu