తెలంగాణ గ్లోబల్ సమ్మిట్...తొలి రోజు భారీ పెట్టుబడుల వెల్లువ
posted on Dec 8, 2025 8:22PM

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి వివిధ రంగాల నిపుణులు పారిశ్రామిక వేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులతో విడివిడిగా చర్చలు జరిపారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థితో, బాలల హక్కులు, విద్య, మరియు యువత సాధికారత అంశాలపై చర్చించారు. కొరియా ప్రతినిధులతో సమావేశమై, ఎలక్ట్రానిక్స్ మరియు గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు. ట్రంప్ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు,
అమెజాన్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అమెజాన్ సంస్థ తెలంగాణలో లాజిస్టిక్స్ మరియు రిటైల్ రంగాల్లో విస్తరణపై ఆసక్తి చూపింది. ఐకీయా సంస్థ ప్రతినిధులతో సమావేశమై, టెక్స్టైల్ మరియు ఫర్నిచర్ తయారీ రంగాల్లో MSME భాగస్వామ్యంపై చర్చించారు. వియత్నాంకు చెందిన ప్రముఖ సంస్థ VINGroup ప్రతినిధులతో సమావేశమై, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు హెల్త్‌కేర్ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు.
ఎలక్ట్రానిక్స్ రంగ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ స్థాపనపై చర్చించారు. SIDBI, వరల్డ్ బ్యాంక్, వెస్ట్రన్ యూనియన్ ప్రతినిధులతో సమావేశమై, స్టార్టప్ ఫండింగ్ మరియు MSME ఫైనాన్స్ అంశాలపై చర్చించారు. మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్ మరియు వేర్‌హౌజింగ్ రంగ ప్రతినిధులతో భేటీ అయ్యారు.యూనివర్సిటీ ఆఫ్ లండన్‌తో ఉన్నత విద్యా భాగస్వామ్య MoU కుదిరింది. వంతార కన్జర్వేటరీ ప్రాజెక్ట్‌పై MoU సంతకాలు జరిగాయి. చివరగా ఆసియాన్ దేశాల రాయబారులు, వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు.
ఫస్ట్ రోజు భారీగా ఎంవోయూలు కుదిరాయి. వివిధ కంపెనీలతో రూ.1.88 లక్షల కోట్ల మేర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. వివిధ కంపెనీలతో రూ.1.88 లక్షల కోట్ల మేర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. డీప్ టెక్నాలజీ రంగంలో రూ.75 వేల కోట్లు, గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.27 వేల కోట్లు, పునరుత్పాదక రంగంలో రూ.39,700 కోట్లు, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో రూ.19,350 కోట్లు, ఏవియేషన్ రంగంలో జీఎంఆర్ గ్రూప్‌తో రూ.15 వేల కోట్ల మేర ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం వెల్లడించింది.