వెంటపడ్డ వీధి కుక్కలు...నిండు ప్రాణం బలి

 

వీధి కుక్కలు జనాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. చిన్నపిల్లలను చంపేసిన సంఘటనలు బయోత్పాన్నే సృష్టిస్తున్నాయి. ఇలాంటి విషాద సంఘటనపై స్పందించిన సుప్రీంకోర్టు వీధి కుక్కలను అక్కడ నుంచి తరలించాలని ,వీధుల్లో ఆహారం పెట్టకూడదని ఆదేశించింది .అయినా ఎక్కడ కూడా వీధి కుక్కల జోలికి అధికారులు వెళ్లడం లేదు. ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో తాజాగా సోమవారం వీధి కుక్కలు వెంట పడ్డ ఘటన ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో చోటు చేసుకుంది.
 

మోటారు సైకిల్ వెలుతున్న ఓ వ్యక్తిని కుక్క వెంబడించడంతో భయపడిన వ్యక్తి వేగంగా వెలుతూ ఆలయాన్ని ఢీ కొనడంతో మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన ట్రాఫిక్ ఎస్.ఐ కుళాయప్ప కథనం మేరకు వివరాలు ఇలా వున్నాయి. రాయచోటి పట్టణం  గాలివీడు రోడ్డులో నివాసం వుంటున్న  షేక్ పజిల్ (28) అనే వ్యక్తి కి  కడప రోడ్డులో ఫర్నీచర్ షాపు వుంది. ఆ షాపును ఇటీవలే చిత్తూరు రోడ్డుకు షిప్ట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు వుండడంతో షిప్టింగ్ పనులు ముగించుకొని  సోమవారం తెల్లవారు జామున 2.45  గంటల సమయంలో మోటార్ సైకిల్ పై ఇంటికి బయలు దేరారు. అర్బన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని అపోలో మెడికల్ స్టోర్ వద్ద అతన్ని వీధి కుక్క వెంబడించాయి. 

దీంతో  కుక్కల బారి నుండి తప్పించుకోవాలన్న  భయాందోళనకు గురై వేగంగా వెలుతూ సమీపంలో రెండు అడుగుల డౌన్ లో వున్న  రామాలయం గోడను ఢీ కొనడంతో ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.   మృతుడు జీవనోపాధి కోసం సౌదీ కి వెళ్లగా పెళ్లి చేసుకోవాలని మూడు నెలల క్రితమే ఇండియాకు రావడం, అంతలోనే ఇలా జరడం పట్ల  కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

*ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా.

భారత అత్యున్నత న్యాయస్థానం  సుప్రీంకోర్టు వీధి కుక్కలపై సీరియస్ అయింది. ఆమేరకు వాటిని వీధుల్లో లేకుండా షెల్టర్ లకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.అంతేకాదు ఇటీవల వాటిని  తరలించేందుకు ఇచ్చిన ఆదేశాలపై ఏ మేరకు చర్యలు తీసుకున్నారో చెప్పాలని కూడా కోరింది .అయినా కూడా అధికారులు వీధి కుక్కల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలు కనిపించడం లేదు . రాయచోటిలో జరిగిన ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu