హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ కలకలం

హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ కలకలం సృష్టిం చింది. మహేశ్వరంలోని ఓ రిసార్ట్స్‌లో రేవ్ పార్టీ నిర్వహి స్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో  ఎస్ వోటీ  పోలీసులు  ఆ రిసార్ట్ పై దాడి చేశారు.  గుంటూరుకు చెందిన ఫర్టిలై జర్ కంపెనీ డీలర్ ఈ రేవ్ పార్టీ ఇస్తున్నట్లు తేలింది. కంపెనీ యాజమాని తమ దగ్గరున్న డీలర్స్ కోసం ఈ పార్టీ అరేంజ్ చేశారని తేలింది. ఈ రేవ్ పార్టీలో ఏడుగురు మహిళా డాన్సర్లు కూడా ఉన్నారు.  

మద్యం తాగి అమ్మాయిలతో చిందులేస్తూ నానా హంగామా సృష్టించారు. దీంతో  స్థానికులు  పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రాచకొండ ఎస్ఓటి బృందం రంగంలోకి దిగి ఆ రిసార్టుపై దాడులు చేసింది. అయితే ఈ పార్టీకి ఎక్సైజ్ శాఖ అనుమతి ఉంది.. అయితే  అనుమతి లేకుండా డ్యాన్సర్లను తీసుకువచ్చి అసభ్య నృత్యాలు చేయించడం చట్ట విరుద్ధం కావడంతో పోలీసులు డ్యాన్సర్లను అరెస్టు చేశారు. అలాగే పెద్ద మొత్తంలో మద్యం, క్యాసినో కాయిన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వినియోగం కూడా జరిగిందా అన్న కోణంలో పరిశీలిస్తున్నారు.  కేసు నమోదు చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu