తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా
posted on Sep 28, 2025 11:57AM

తమిళనాడులోని కరూర్‌లో తన ప్రచారసభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నా హృదయం ముక్కలైంది. నేను భరించలేని బాధ, దుఃఖంలో ఉన్నాను.
ఆ బాధ పదాల్లో వర్ణించలేనిది. కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని విజయ్ పేర్కొన్నారు. తమిళనాడు కరూర్‌లో విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది.
ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 40 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ సభకు మధ్యాహ్నం చేరుకోవాల్సి ఉండగా, ఆరు గంటల ఆలస్యంగా రాత్రి వేళ ర్యాలీకి హాజరయ్యారు. ఈలోపు భారీ సంఖ్యలో జనాలు కూడగట్టుకోవడంతో అనూహ్య పరిస్థితి ఏర్పడింది.
విజయ్ ప్రసంగం ప్రారంభమైన క్షణాల్లోనే ఆయనను దగ్గరగా చూడాలన్న ఉత్సాహంతో కొందరు ముందుకు దూసుకెళ్లారు. ఫలితంగా పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఘటనపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. తొక్కిసలాట ఘటన స్ధలికి వెళ్లాలా? వద్ద అనే విషయంపై సమాలోచనలు జరుపుతున్నారు. అక్కడికి వెళ్లే వచ్చే వచ్చే సెక్యూరిటీ సమస్యలు, వెళ్లకపోతే ఎదురయ్యే రాజకీయ విమర్శలను ఎలా ఎదర్కోవాలనే దానిపై పార్టీనేతలతో చర్చిస్తున్నారు